May 17, 2024

అర్చన 2020 – పిల్లకాకి

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి

“ఇంకా ఎంతకాలం పంపిస్తాము? మీకు నలభై , నాకు ముప్పై అయిదు వచ్చాయి. ముందు ముందు మన పిల్లలని పెంచాల్సిన బాధ్యత అయితే మనమీదే ఉంటుందిగా. మన పిల్లల బాధ్యత మనది. ఆయన పిల్లల బాధ్యత ఆయనది . “అంది ఖచ్చితముగా రాధిక.
“మీరు నాకు తెలియకుండా పంపితె , తరువాత తెలిస్తె ఊరుకోను”అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పేసింది .
“కానీ ఆయన రిటైర్ అయిపోయారు కదా. తమ్ముడూ, చెళ్ల్లెళ్ళు ఆలశ్య0గా పుట్టారు. ఇప్పుడు వాళ్ల చదువులు, పెళ్ళీళ్ళు అన్నిఆయనొక్కడే చూడాలంటే కష్టం కదా. ఇంటికి పెద్దకొడుకునని ఉన్నదంతా ఊడ్చి నన్ను చదివించారు. ఇప్పుడు నేను ఇవ్వనంటే బాగుంటుందా?ఆలోచించు”అన్నాడు మెల్లిగా ప్రాధేయ పడుతున్నట్టుగా, నట్టుతూ , నసుగుతూ రాఘవ ‘
రాఘవకి , రాధికకి ఈ మధ్యనె పెళ్ళీ అయ్యింది. బాధ్యతలతో రాఘవకి, అందం, చదువు తక్కువ వల్ల రాధికకి పెళ్ళీ ఆలస్యంఅయ్యింది
రాధికకి అసలె కోరికలు ఎక్కువ . దానికి తోడుకొత్త కాపురం. అందులొ అవక, అవక అయ్యింది పెళ్ళి. అందుకే పెళ్ళి కయిన ఆలస్యం, కోరికలు తీర్చుకోవడములొ కాకూడదని ఆమె ఉద్దేశ్యం.
రాఘవ జీతం తమ ఇద్దరికైతె ఫరవాలెదు. బాగానె సరిపొతుంది. కాని పెళ్ళైనా రాఘవ తండ్రి రిటైర్ కావటం వల్ల, తమ్ముళ్ళూ, చెళ్ళెళ్ళూ చిన్నవాళ్ళు కావట0 వల్ల, వాళ్ళనీ తనలాగె కొంతైనా పైకి తేవాలి అన్నరాఘవ
కోరికవల్ల, పూర్వము లానే ఒక మనిషి(అంటే తను) పెరిగినా తండ్రి కి అలాగె, ఇదివరకటి అంత డబ్బూ ప0పుతున్నాడు రాఘవ.
అదే ఇష్ట0 లేని రాధికకి, ఇప్పుడు మావగారు. ఇంకా ఎక్కువ పంపమనడ0 తొటీ ఓళ్ళు మండుతో0 ది.
మావగారు కూతురికి కుట్టు మిషన్ కొన్నాడుట. ఆమెకి చదువు లేదు. ఉద్యొగం రాదు కాబట్టి పెళ్ళి అయితె , ఒక్క జీతముతొ బతకట0 కష్ట0 కాబట్టీ, కనీసం టైలరింగ్ వస్తె, తనకి, పిల్లలకి అయినా కుట్టుకోవచ్చని, కొంచెం భర్తకి ఆసరా అవుతుందని, అందుకె కుట్టు మిషన్ కొన్నానని , వచ్చేనెల ఎక్కువ సాయం చేయమని రాసాడు.
అదుగో ఆ ఉత్తరం చూసినప్పటీ నుంచి అమె ఇలా గంగవెర్రు లెత్తుతొంది . ‘
“ఉత్తరం రాసి పడేయ్యండీ. ఎంతకని?ప్రతినెలా ఏదొ ఒకటీ రాస్తారు. తనకో, మీ అమ్మకో మందులో
కాల్లేజి ఫీజులో, చెల్లెలు కొత్తబట్టలు అడిగిందనో ఏదొ ఒకటీ. అసలు వీళ్ళ కోరికలు తీర్చటానికె మీరు సంపాదిస్తున్నట్లు ఉంది.
ఎవరి కున్నంతలొ వారు గడుపు కోవాలని తనే అంటారుగా. వాళ్ళనీ ఫించను లొ గడుపుకోమన0డీ. రెందు సంసారాలు గడపట0 మీకూ కష్ట మని రాయండి . లేకపొతె నేనె రాసేస్తాను. “అంది బెదిరిస్తున్నట్లు. హడిలిపోయాడు రాఘవ. “వద్దులే నేనే రాస్తాను. “అన్నాడు. అప్పటికె అమె సంగతి అతనికి అర్థమయ్యి0ది. రాఘవే రాసాడు . కాని రాధిక పక్కనే ఉంది. రాత మాత్రమె అతనిది , మాటలు మాత్రం ఆమెవె.
ఇలా సాగింది ఉత్తరం .
“నాన్నగారికి నమస్కారం.
మీ ఉత్తరం అందింది . మీ కోరిక ప్రకారం ఎక్కువ పంపలేను. ఏదైనా కొనే ముందర మన ఆర్థిక పరిస్తితి కూడా ఆలొచించ గలరు.
నాతో మొదట సంప్రదించగలరు. నాకూ పెళ్ళైంది. ఖర్చు పెరిగింది. కాబట్టీ రెండు కుటూ0బాలు పోషించట0 కష్టం కదా ” రాయించింది రాధిక .
రెందు కుటూ0బాలు అన్నది అండర్ లైన్ చేయించింది . రాఘవ వెయ్యడేమోనని ఉత్తరం తనే పోస్ట్ చేస్తానని తీసుకుని, చేసింది .
రాఘవ గుండేల్లొ గుబులు మొదలైంది. ఒకటీ రక్తసంబంధం. రెండూ గిల్టీ. ముఖ్య0గా రక్తసంబంధాలకి, బాంధవ్యాలకి ప్రాముఖ్యత నిచ్చే తండ్రికి ఈ ఒ0టేత్తు పోకడలు నచ్చవని తెలుసు .
ఆ రొజు రాఘవ ఇంటీకి రాగానె బాగ్ అందుకుని తీసుకుని, మంచినీళ్ళు, కాఫి అందించింది. కాఫే తాగు తుందగా మెల్లిగా అంది “పొనీ పాపం మావయ్యగారు అడిగింది పంపెయ్యండి. రిటైర్ అయ్యారుగా. కుటు0బం నడపటానికి ఫించను ఏమి సరిపోతుంది “అంది
. “కాని నువ్వు . . . “ఏదొ అనబొయాదు .
” అవును నేనే చెబుతున్న, పంపండీ”అని లోనికి వెళ్ళిపోయింది .
రాఘవ నవ్వుకున్నాడు. తండ్రి ఉత్తరం కళ్ళముందు నిలిచింది.
” రాఘవకి ఆశీస్సులు. రెండు కుటూ0బాలు నడపట0 కష్టమన్ననీమాట సబబె. అందుకే మేము కూడా నీ దగ్గరకే వచ్చేస్తాము . అప్పుడు ఒక్క సంసారమె అవుతుంది. ఇది నా ఉద్దేశ్యము. నీ నిర్ణయం తెలపగలవు . ”
నాన్న
ఒకసారి ఇంటికి రాస్తె, అన్నివాటాలవి పోస్ట్ మన్ గేట్లో0చి పడేసిపోతె, వానకి తడిసిపోయింది అని రాఘవ అన్నాడని , అప్పటినుంచి ఆఫీస్కి రాస్తె, ముగ్గురు రాఘవులు ఉండటం తోటి చాలా ఆలస్యముగా అందింది ఉత్తరం. అందుకని అప్పటి నుంచి తండ్రి అన్నిఉత్తరాలు ఇంటికి ఒకటి, ఆఫిస్కి ఒకటి కాపీలు పెడుతున్నాడు తండ్రి. ముఖ్యముగా ప్రధాన ఉపాధ్యాయుడుగ పనిచెసిన తండ్రి మనుశ్యుల మనస్తత్వం గ్రహించగలడు .
అందుకె ఆ ఉత్తరం వెనుక కోడలి హస్తము0దని గ్రహించాడు. అందుకే ఆ ఉత్తరం అమె కూడా చదవాలని, చదువుతుందని తెలుసు. కాని ఆ ఉత్తరం రాఘవకు కూడా వచిందని తెలియని రాధిక, రాఘవ దగ్గర మంచితనం చూపించి. వాళ్ళు రాకుండగా చెయ్యాలని అనుకుంది .
పాపం పిల్లకాకి .
—–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *