May 25, 2024

రాజీపడిన బంధం – 6

రచన: కోసూరి ఉమాభారతి “అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండీ కూడా గొప్ప క్రీడాకారుడు కదా…. అలా ఆటల్లో ఎదుటివాడిని ఓడించి, తను గెలవడమే ధ్యేయంగా జీవిస్తారు కదా క్రీడాకారులు. దుర్గాప్రసాద్ చెప్పంగా శ్యాం, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవారంట. శ్యాం ఎందులోనూ ఓటమి ఎరుగడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ తోనే అయిందట” క్షణమాగారు.. నాన్న చెప్పేది మౌనంగా వింటున్నాను. “దుర్గాప్రసాద్ చెప్పినదాన్ని బట్టి అల్లుడుగారి బాల్యం, పెంపకం, వ్యక్తిత్వం పై నాకు కొంత […]

గజల్

రచన: డా. భీంపల్లి శ్రీకాంత వెల్లువలా ఉప్పొంగే కడలి అలలదెంతా ఆరాటం ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలదెంతా ఆరాటం మంటలై ఎగిసిపడే అగ్గిరవ్వలను చూస్తుంటే చలిని పోగొట్టే వేడిదనపువాడిదెంతా ఆరాటం అజ్ఞానాన్ని తరిమేసే జ్ఞానజ్యోతులను చూస్తుంటే చీకటిని పారదోలే వెలుగుకిరణాలదెంతా ఆరాటం ఆటుపోట్ల అలజడులు జీవితాలను కమ్ముకుంటే నిత్యగాయాలను చెరిపేసే కాలానిదెంతా ఆరాటం హృదయాన్ని సాంత్వనపరిచే కన్నీటిని చూస్తుంటే దిగులును పోగొట్టే మనిషి గుండెదెంతా ఆరాటం తూర్పున ఉదయించే సూర్యోదయాన్ని చూస్తుంటే అంధకారాన్ని పోగొట్టే ఉషాకిరణాలదెంతా ఆరాటం కట్టతెగి […]

నిష్క్రమణ…

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ సుమతీ కాఫీ తీస్కురా ఎన్ని సార్లు చెప్పాలి. వినబడట్లేదా లేక విననట్టున్నావా అరిచాడు విశ్వం. అదిగోండీ అక్కడే పెట్టాను. చూస్కోండి, మీకు కాఫీ ఇచ్చే ఇటొచ్చాను సంజాయిషీగా చెప్పింది సుమతి. “సర్లే” కసిరాడు విశ్వం ఇంతలోపే మమ్మీ బాక్సు అయ్యిందా.. ఇంకా పావు గంటే టైం ఉంది అరిచాడు రాజా, సుమతి కొడుకు. అయిపోతుందిరా ఒక్క నిమిషం గబగబా కూరలో ఉప్పు, కారం వేసి అన్నం పెట్టి బాక్సు మూత పెట్టింది. […]

లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

రచన: రవీంద్ర కంభంపాటి తిరిగి ఊరెళ్లిపోవాల్సిన రోజొచ్చేసింది. ఏంటో నిన్న గాక మొన్నొచ్చినట్టు ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని మా అమ్మ ఒకటే గొడవ. ‘సరేలే. నువ్విలా ఏడుపు మొహం పెట్టేవంటే. ఇంకెప్పుడూ రానని’ తనతో అంటూంటే, లోవరాజుగాడొచ్చేసేడు. కారేసుకుని ! స్టేషన్ దాకా దింపడానికి కారెందుకని అడిగితే, డిక్కీ తీసి చూపించేడు. ఓ పెద్ద క్యాను నిండా ఆవు నెయ్యి, తేగల కట్టలు, సంచీడు మొక్కజొన్నపొత్తులూ, ఓ పెద్ద కరకజ్జం ప్యాకెట్టు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. […]

చంద్రోదయం – 5

రచన: మన్నెం శారద బలమైన తిండితో అతని ఛాతీ వెడల్పయింది. కళ్ళు ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. వతైన అతని వుంగారాల క్రాపు చూస్తే శేఖరానికి అసూయ కలుగుతోంది! “నువ్వెటునుంచి వస్తున్నావు?” అన్నాడొకరోజు శేఖర్, సీరియస్ గా. “అంటే?” సారధి ఆశ్చర్యంగా అడిగేడు. “అదే, ఆఫీసునుండి ఏ దారిన వస్తున్నావు? వుమెన్సు కాలేజీ రూటేనా?” “అవును,” సారధి అర్థం కానట్లు చూసేడు. శేఖర్ సీరియస్ గా మంచమ్మీద నుంచి లేచి కూర్చున్నాడు. “నువ్వటే ఎందుకొస్తున్నావో తెలుసుకోవచ్చా?” “అదిదగ్గర దారి కాబట్టి” […]

అమ్మమ్మ – 15

రచన: గిరిజ పీసపాటి పీసపాటి తాతయ్య దగ్గర నుండి అమ్మమ్మకు వచ్చిన ఉత్తరంలో ‘నాగకు కొంచెం ఆరోగ్యం క్షీణించిన కారణంగా నా స్నేహితుడైన డా. నౌడూరి శ్రీరామమూర్తి గారికి (మక్కువ అనే ఊరిలో వీరు ఉంటున్న కారణంగా అందరూ వీరిని మక్కువ డాక్టర్ గారు అంటారు) చూపించగా, చాలా చిన్న వయసులోనే గర్భవతి కావడం వలన రక్తహీనత బాగా ఉందనీ, మందులు రాసి ఇచ్చారని రాస్తూ…’ ‘డెలివరీ కష్టం కావచ్చు కనుక డెలివరీ సమయానికి ఏదైనా హాస్పిటల్ […]

హరిలో రంగ హరీ.. జలజం పని హరీ

రచన: గిరిజారాణి కలవల ” ఇదిగో.. చెపుతున్నది కాస్త ఓ చెవిన పడేసుకోండి.. ఆనక మళ్లీ.. నాకు ఎప్పుడు చెప్పావు అంటే ఊరుకోను” .. అంది జలజం . ” అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పకుండా ఈ నిందా స్తుతేంటే.. ఏం కావాలో చెప్పు.. ఒక్క చెవిలో ఏం ఖర్మ.. రెండు చెవుల్లోనూ గరాటు వేసుకుని మరీ పడేసుకుంటా.. ” అన్నాడు జలజాపతి . ” అబ్బో, మీ ఎకసెక్కాలు చాల్లెండి.. మొన్న కొన్న పుస్తకాల […]

గిలకమ్మ కతలు – ఆల్లదేదో ఆల్లదన్నట్టు ..మందేదో మంది. అంతే..!

రచన: కన్నెగంటి అనసూయ బళ్ళో బెల్లిలాక్కొట్టేరో లేదో తన పొస్తకాలు ఎనకమాల వత్తా వత్తా సుబ్బలచ్చాన్ని తెమ్మని లంగా కాళ్లకడ్డంబడద్దేవోనని రెండు సేతుల్తోనూ పైకెత్తి పట్టుకుని ఏదో ములిగిపోతందన్నట్టు పెద్ద పే..ద్దంగ లేసుకుంటా ఇంటికేసి నడుత్తుందేవో.. అడుగడ్దప్పుడల్లా..సిమ్మిల్లో దబక్కన పడ్డ రోకలి పోటల్లే , కురుత్తాకి ముందరిసిన మేఘపురంకెల్లే.. సౌండొత్తుంటే.. అంతకు ముందే అన్నాల్దిని ..పొద్దుటేల్నుండీ సేసీ సేసీ ఉన్నారేవో నడాలు పట్టేసి కునుకుదీద్దావని మంచాలెక్కినోళ్ళు కాత్తా టీయేలయ్యే తలికి సేట్లల్లో అయిదారు తవ్వల బియ్యాలేసుకుని మట్టి […]

దివి నుండి భువికి

రచన: చెంగల్వల కామేశ్వరి “రేపేనా నువ్వు వెళ్లేది? అడిగాడు శర్మ “అవునండీ! కొంచెం హుషారుగా బదులిచ్చాడు ఈశ్వర్, వచ్చాకా విశేషాలు చెప్పు! అంటున్న మామగారి మాటలకు ‘ఉండేది ఒకరోజు! ఏముంటాయి. ?’ మళ్లీ ఇక్కడికే రావాలి. ఇలాగే ఉండాలి. వాళ్లక్కడ మనమిక్కడ” ఉదాసీనంగా అంటున్న ఈశ్వర్ మొహం చూసి, ఒకసారి దీర్ఘంగా నిట్టార్చారు శర్మగారు . “నిజమే! కాని ఏం చేయగలం? మనకి మాత్రం ఇష్టమా! మనవాళ్లందరిని వదిలి ఇలా ఉండటం . “వలస పక్షుల్లా చెట్టుకొకరు […]

రింగుల జీవన వలయం

రచన: – పిడపర్తి భారతి కాళ్ళు టపాటపా నేల కేసి కొడ్తూ, రెండు చేతులూ బాగా ఆడిస్తూ, ఇంట్లో కొచ్చి, సోఫాలో నాన్న పక్కన బుంగ మూతి పెట్టుకుని కూర్చుంది, కల్యాణి. కల్యాణి కూర్చున్న జోరుకి, గోపాల్రావు గారు చదువుతున్న పేపర్ని కొంచెం పక్కకి జరిపి, కూతురి వైపు చూసి, “ ఏం. తల్లీ.? “ అని, యధాలాపం గా అన్నట్టుగా అంటూ, మళ్ళీ పేపర్ లో దూరిపోయారు. ఒక్క రెండు నిమిషాలు ఆగి, ఇంక లాభం […]