May 19, 2024

దేవీ భాగవతం 8

రచన: స్వరాజ్యలక్ష్మి వోలేటి 6వ స్కంధము, 24వ కథ బ్రాహ్మణ, క్షత్రియవైరం ప్రాచీన కాలమున హైహయవంశ క్షత్రియులకు, భృగువంశజులైన బ్రాహ్మణులకు వైరము కలిగినది. హైహయ వంశమున కార్తవీర్యుడు అను రాజుండెను. అతనికి వేయి భుజములుండెను. అతనిని సహస్రార్జనుడు అని జనులు పిలువసాగిరి. అతడు రెండవ విష్ణువు వలె వెలుగు`చుండెను. ధర్మము గలవాడు. గొప్ప దానబుద్ధి కలవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. అతని వలన రాజు మంత్రదీక్ష తీసుకొనెను. ఆ రాజుకు భగవతి జగదంబ ఇష్టదైవము. ధార్మికుడైన ఆ […]

మనసులు మురిపిస్తా

రచన: గుండ్లపల్లి రాజేంద్రపసాద్ వెలుగునై ప్రసరిస్తా వదనాలను ప్రకాశింపజేస్తా గాలినై వ్యాపిస్తా సువాసనలను విరజిమ్ముతా పువ్వునై వికసిస్తా పరవశాన్ని పంచిపెడతా పాటనై రాగము తీయిస్తా ఆటనై నాట్యము చేయిస్తా పలుకులనై కులికిస్తా తేనెలను చిందిస్తా చిరునవ్వునై చెంపలకెక్కుతా అమృతాన్నై అధరాలలోకూర్చుంటా కలనై కల్పనలిస్తా కలమై కాగితాలపై రాయిస్తా అక్షరాలనై అల్లుకుంటా పదములై ప్రవహిస్తా ఊహనై ఊరిస్తా భావమునై భ్రమలు కలిగిస్తా అందమునై అలరిస్తా అంతరంగంలో ఆవాసముంటా కవితనై కవ్విస్తా మనసులను మురిపిస్తా

సుప్రభాత పద్యములు

రచన: టి.వి.యెల్. గాయత్రి సీసము // పసుపు వర్ణపు వెల్గు బాటలన్ జల్లుచు ప్రాగ్దిశ నుదయించె భానుడిలను కువకువ లాడుచు గూళ్లను వదిలిన పక్షి గణంబుల పాట వినుచు వడివడిమేల్కొని వయ్యారి భామలు పెరుగును జిల్కగ ప్రీతి తోడ పశువుల తోడ్కొని పాలేళ్ళు ముదముగ నాగళ్లు పట్టుచు నడచి రపుడు // తేట గీతి పల్లె నిద్దుర లేచెను పరవశించి విరులు వెదజల్లు పుప్పొడి విందు చేయ తేటి గుంపుల సందడి తేరి చూచి నవ్వు కొనుచును […]