March 19, 2024

సంక్రాంతి పౌష్యలక్ష్మీ

రచన: ప్రకాశ లక్ష్మి

వచ్చింది, వచ్చింది పౌష్య లక్ష్మీ,
తెచ్చింది, భువికి హరివిల్లు శోభ,
లేతగరిక మీద మంచు బిందువులు,
మంచి ముత్యాలు గా, లేత సూర్యకాంతిలో
మెరయు,

హరిదాసుల హరి స్మరణ కీర్తనలు,
డూ,డూ బసవన్న ల ఆటపాటలతో,
ఇంటి ముంగిట రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలతో,
కొత్త పంటలు తో గాదెలు నిండి,

ైబోగి మంటలతో చలిపులి తరిమివేయగా,
కొత్త గా పెళ్ళి అయిన దంపతుల ముద్దు ముచ్చట్లు,
బావామరధళ్ళ సరసాలు,
కమ్మనైన పిండి వంటల ఘుమఘుమలతో,

గగనానికి గాలిపటాల గింగిరాలు,
కోడిపందాల పౌరుషాల బరిలో,
పసిపిల్లలకు బోగి పండ్లు, బొమ్మలకొలువులు,

వేకువ జామున కోవెలలో మోగే జేగంటలు,
గోదారంగనాధుల పరిణయానికి నాంది పలుకుతు,
ఆళ్వారుల దివ్య ప్రబంధాల పాశురాలు పఠింప,
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ,
భువిలో జనులకు నవనవోన్మేష,
ఆనందంలో మునిగి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *