May 20, 2024

అర్చన 2020 – ఆంగికం , వాచికం

సంధ్యా గోళ్లమూడి హవభావముల తోడ అభినయమేలనో దొరా ! దేశాభివృద్హికి తోడుపడుమోయ్ దొరా . కాలానుగుణముగా నడచు బాట చూపు వెనుకబాటుతనమె విద్యలో మఱ్ఱివూడలైంది . చదువుల తల్లి మోము వెలవెలబోయింది పసిడిమొగ్గలు పాకలో పేడ పిసుకుతుంటే . ముక్కుపచ్చలారని పిల్లలు పెళ్లిపీటలెక్క బలిపీఠమైంది వారి బ్రతుకుకదే పెళ్ళిపీట ఎవరికి వారే నాకెందుకంటూ ప్రక్క చూపులతో. చక్కగా పోయేరు, అడ్డుకొనలేరెవరు దేశాన బైట పనికి పోయిన పిల్ల ఇల్లు చేరుదాక గుండెలు గుప్పెట కనుగుడ్లు దారివెంట అన్ని […]

అర్చన 2020 – ఆడపిల్ల ఆవేదన

రచన: ఆలేఖ్య పుట్టక మునుపే పరీక్షలు, ఏంటి మాకీ పరీక్షలు.. పుట్టేది ఆడపిల్ల మాకొద్దు, ఎందుకు? సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుంటే ముందుకు.. పుట్టినప్పటి నుండి పెళ్లితంతు వరకు చదువు నుండి ఉద్యోగం వరకు వేస్తారే లెక్కలు.. ఎందుకు ఆడపిల్లకిన్ని శిక్షలు… స్వేచ్ఛగా తిరిగలేము తిరిగినా బతకలేము ఈ తోడేళ్ళ జనారణ్యంలో అందరూ మన్మథులే.. కామదాహనికి కనబడవు ఇంతి వయసులే… కామమృగాలకి మా దేహాలే ఫలహారాలాయే.. కడకు మిగిలేవి మాకు మానభంగాల దహనాలే.. నే జేసిన నేరమేమి? ఆడపిల్లగా […]

అర్చన 2020 – ఆత్మరక్షణ

రచన: దొంతభక్తుని రామ నాగేశ్వరరావు ఓ పసిపాప మృగాళ్ళ పాపానికి బలై పోతే కన్నతల్లి హృదయం బ్రద్దలై పిచ్చిదయ్యింది ఓ పుత్తడి బొమ్మ ప్రేమ వంచనతో అంగడి బొమ్మైతే కన్నతండ్రి తాళలేక బలవన్మరణం పొందాడు ఓ చెల్లిపై ప్రేమోన్మాది ఆసిడ్ దాడిని ఆపే ప్రయత్నంలో అన్న హంతకుడై జైలు పాలయ్యాడు ఆగ్రహంతో ఓ భార్య తాగుబోతుల కాహుతి కాకుండా భర్త అడ్డుకొని మృత్యుదేవత కౌగిట ఒరిగాడు అతివలను సంరక్షించే పవిత్ర యజ్ఞంలో అమాయక బంధువర్గం సమిధలు కారాదు […]

అర్చన 2020 – ఒక కోయిల విలాపం

రచన: నండూరి సుందరీ నాగమణి మావి కొమ్మల చేరి, పరవశమ్మున గొంతెత్తి నేను పాడుకొంటూ ఉంటే, నా పాట విని దరిచేరావు, నీ అందమైన కోయిలన్నావు, నన్ను ప్రేమించానన్నావు, మూడు ముళ్ళేసి పెళ్ళాడావు… ఎన్నో అందమైన పగళ్ళూ, మరెన్నో నులి వెచ్చని రాత్రులూ ఆనందంగా సాగిపోయాయి… మత్తిల్లిన కొత్త కాపురంలో పాటకు సమయమేదీ? ఒకరి తరువాత మరొకరు సంతానం పుట్టుకు వస్తే… నిద్ర పుచ్చుదామని జోలపాటకై నే గొంతు సవరించుకుంటే… అప్పుడు చూసా మొదటిసారి – ముడుచుకున్న […]

అర్చన 2020 – కరోనా – కర్కోటకులు

రచన: ఓట్ల ప్రకాశరావు కరోనా సూక్ష్మ జీవ కణాలు పెద్దవిగా ఉంటుందట, ఆ ఊరికి రావచ్చన్న భయంతో వున్నారు, మాస్క్ ఉపయోగిస్తూ తప్పించుకున్నామన్న దైర్యంతో వున్నారు. కర్కోటక సూత్రధారులు వేల కోట్లలో దోచుకుంటున్నారు. రాజకీయ పార్టీలో ప్రవేశిస్తూ తప్పించుకొన్నామన్న ధైర్యంతో వున్నారు కరోనా సూక్ష్మ జీవకణాలు చేతుల మీద పదినిముషాలు మాత్రమే ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకొంటున్నారు. కర్కోటక సూత్రదారుల చేతులమీద రాక్షస సంపాదన రేఖ జెర్రీ పోతంత పొడుగుగా ఉంటుందన్నారు ఎల్లవేళలా చేతులను అక్రమ […]

అర్చన 2020 – జీవనయానం

రచన: ఎస్. వి. లక్ష్మణ్ అనుక్షణం తీరిక లేకుండా ఆశల సౌధం నిర్మించుకోవడానికి ఇల్లంతా చక్కబెట్టుకుని బయలుదేరిన ఈ క్షణం నుండి తిరిగి వచ్చేవరకు ఉరుకులు పరుగుల ప్రయాణం ఊగిసలాటలో జీవనయానం ఋతువులు మార్చిన వాతావరణం ఎవరికీ పట్టని పర్యావరణం ఏ క్షణానికి ఏమి జరుగునో ఐనా మారని మానవ నైజం ఒక్క క్షణం నిలకడగా ఆలోచన ఓరిమితో గమ్యానికి సూచన ఔనన్నా కాదన్నా ఆందోళనకరం అండదండగా ఉండాల్సిన తరుణం

అర్చన 2020 – దశ’దిశలా’ దగ్ధమౌతోన్న మానవత్వం

రమేష్ చెన్నుపాటి పశువుల్ని కూడా శిశువుల్ని చేసుకుని ప్రాణం పోసే డాక్టర్ని..ప్రాణం తీసింది పశుత్వమా..చెద పట్టిన మనిషితత్వమా దశ ‘దిశ’లా దగధ్ధమౌతోన్న మానవతత్వమా ఉగ్గు పాలలో కాస్త తప్పుల సిగ్గు పోసి పెంచండి తల్లుల్లారా..ఓ పూట నోట్లో పొయ్యేదానికే పుచ్చూచచ్చూ చూసే మనం.. ఈళ్ళని పెంచి పోషించినందుకూ.మంచి మార్గం చూపనందుకూ.. ఉరికొయ్యలకూగాల్సింది..మనం కాదా.. కొమ్మల్లేని అమ్మలూ..మోడులైన మట్టి బొమ్మలూ తుపాకీ తూటానో..న్యాయం రాసే చీటీనో.. తెచ్చే మార్పు..పిసరంత ఏమార్పు.. నీతి తప్పిన మనిషి..చచ్చిన శవంతో సమానమని నేర్పని […]

అర్చన 2020 – మేలుకో మేలుకై

రచన: గోమతి నేను మనిషిగానే వున్నాను. నువ్వు మృగానివి ఎలా అయ్యావురా? పరాయి స్త్రీలను చూస్తే తల్లీ, సోదరి ఎందుకు గుర్తుకురాలేదు? ఓహో! నిజము! నీలో మానవత్వపు వెలుగు లేదు, అందుకే చీకటిలో పొరలుతున్నావు. తల్లి,తండ్రి,గురువు, నీకు మంచినే బోధిస్తారే? మరి ఎక్కడ దారి తప్పావు? వయసు రెక్కలు తొడుగునప్పుడు, విచక్షణ కన్నులు మూసుకున్నావు. అమృతమనుకుని చెడుమాటల సీసముతో చెవులు మూసుకున్నావు. సినిమాలు,సెల్లు ఫోనులు నేర్పుతున్నాయా? హంసవలె నీ బుద్ధి వున్న అవి ఏమి చేయునురా? బురదలో […]

అర్చన 2020 – నాన్నగారు… !

రచన: గన్నోజు శ్రీనివాస చారి నవ్యలోక జన్మదాత సవ్య దీవెన సంధాత దివ్య పాలన చతురుడు.. భవ్య భవిత మార్గ దూత! తండ్రి కారణజన్ముడు పుత్రోత్సహపు ధన్యుడు పుత్రికలను ప్రేమించే… పులకిత దైవ రూపుడు! తనయుల పాలిట ఉషస్సు అనునయించే తేజస్సు అమ్మతోడ జీవనమై… సాధించు సదా యశస్సు! తల్లిలేక ధరణి లేదు తండ్రి లేక తనువు రాదు సృష్టిలోన తల్లి దండ్రి.. జననమొసగు పూల పాదు! వృద్ధ్యాప్యంలో గమనించు చేయూత నిడి సేవించు తనవి తీరగ […]

అర్చన 2020 – నిప్పుల కుంపటి

రచన: ప్రసాద్ ర్యాలి గమ్యంలేని గాలివాటు ప్రయాణంలో అభివృద్ధి బాటవైపు ఎలా వెళ్ళేది. కనీసం గుండెల్లోనైనా పిడికిలి బిగించి ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి గుంపులోని గోవిందుల మధ్య నుండే నాయకుడు పుట్టుకురావాలి. సామూహిక నినాదాల మధ్య నుండి బలమైన గొంతు వినపడాలి. మిణుగురు వెలుగుల పరంపర శాశ్వతంగా కాంతినివ్వాలి. మరణం ఎదురుపడినపుడు పసిపిల్లలా భుజానికి ఎత్తుకోవాలి. పదిమందిని ఒకే బాటలో నడిపేందుకు గుచ్చుకుంటున్న ప్రతికూల ముళ్ళను ఆభరణాల్లా ధరించాలి. ఒకరి ఆశ ఆరాటమైతే ఒఖ్ఖరి […]