May 9, 2024

అర్చన 2020 – ఆడపిల్ల ఆవేదన

రచన: ఆలేఖ్య

పుట్టక మునుపే పరీక్షలు, ఏంటి మాకీ పరీక్షలు..
పుట్టేది ఆడపిల్ల మాకొద్దు, ఎందుకు?
సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుంటే ముందుకు..
పుట్టినప్పటి నుండి పెళ్లితంతు వరకు
చదువు నుండి ఉద్యోగం వరకు వేస్తారే లెక్కలు..
ఎందుకు ఆడపిల్లకిన్ని శిక్షలు…
స్వేచ్ఛగా తిరిగలేము తిరిగినా బతకలేము
ఈ తోడేళ్ళ జనారణ్యంలో అందరూ మన్మథులే..
కామదాహనికి కనబడవు ఇంతి వయసులే…
కామమృగాలకి మా దేహాలే ఫలహారాలాయే..
కడకు మిగిలేవి మాకు మానభంగాల దహనాలే..
నే జేసిన నేరమేమి? ఆడపిల్లగా పుట్టడమా..
ఓ కామాంధ! నీ ఇంట పుట్టకబోవడమా..
పుణ్యభూమిలో పుట్టడమే మా నేరమా..
స్త్రీ అంటే సుఖానిచ్చే పరికరమా…
కనరావా మా అవయవాలు మీ అక్కాచెల్లెళ్ళలో.
చూడండి మాలోనూ మీ అమ్మతనాన్ని ..
కాపాడుకోండి త్వరలో అంతరించే మా స్త్రీ జాతిని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *