May 9, 2024

అర్చన 2020 – కరోనా – కర్కోటకులు

రచన: ఓట్ల ప్రకాశరావు

కరోనా సూక్ష్మ జీవ కణాలు పెద్దవిగా ఉంటుందట, ఆ ఊరికి రావచ్చన్న భయంతో వున్నారు,
మాస్క్ ఉపయోగిస్తూ తప్పించుకున్నామన్న దైర్యంతో వున్నారు.
కర్కోటక సూత్రధారులు వేల కోట్లలో దోచుకుంటున్నారు.
రాజకీయ పార్టీలో ప్రవేశిస్తూ తప్పించుకొన్నామన్న ధైర్యంతో వున్నారు

కరోనా సూక్ష్మ జీవకణాలు చేతుల మీద పదినిముషాలు మాత్రమే ఉంటుందన్నారు.
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకొంటున్నారు.
కర్కోటక సూత్రదారుల చేతులమీద రాక్షస సంపాదన రేఖ జెర్రీ పోతంత పొడుగుగా ఉంటుందన్నారు
ఎల్లవేళలా చేతులను అక్రమ సంపాదనకే ఉపయోగిస్తున్నారు.

కరోనా సూక్ష్మ జీవకణాలు గాలినుండి వెంటనే నేలను చేరుకొంటుందన్నారు,
అందరూ ధైర్యంతో ఊపిరి పీల్చుకొంటున్నారు.
కర్కోటక సూత్రదారుల ధనకాంక్ష ఆకాశమంత ఎదిగిందంటున్నారు
వాళ్ళు దేశాన్ని దోచుకొంటూ సంతోషంతో ఊపిరి పీల్చుకొంటున్నారు

కరోనా సూక్ష్మ జీవ కణాలు ఊపిరి తిత్తులకు సోకకుండా చూసుకోవాలని అంటున్నారు,
పసుపు ఉప్పు కలిపిన గోరు వెచ్చటి నీటితో పుక్కళిస్తూ తమని కాపాడుకొంటున్నారు.
కర్కోటక సూత్రదారులపై చర్య తీసుకొనవచ్చని అనుకొంటున్నారు,
కుక్క పందులలాంటివారికి కానుకలను సమర్పిస్తూ తమను కాపాడుకొంటున్నారు .

కరోనా సూక్ష్మ జీవకణాలు ఇద్దరిలో ప్రవేశించిందని తెలుసుకొన్నారు,
యుద్ధ ప్రాతిపదికలా తగు చర్యలు తీసుకోవడంతో చాలామంది మెచ్చుకొన్నారు.
కర్కోటక సూత్రదారులు కరోనా వైరస్ కన్నా భయంకరమైన వారని అంటున్నారు.
యుద్దప్రాతిపదికలా కర్కోటకులపై చర్యలు తీసుకొంటారని అందరూ ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *