May 3, 2024

అర్చన 2020 – జీవనయానం

రచన: ఎస్. వి. లక్ష్మణ్ అనుక్షణం తీరిక లేకుండా ఆశల సౌధం నిర్మించుకోవడానికి ఇల్లంతా చక్కబెట్టుకుని బయలుదేరిన ఈ క్షణం నుండి తిరిగి వచ్చేవరకు ఉరుకులు పరుగుల ప్రయాణం ఊగిసలాటలో జీవనయానం ఋతువులు మార్చిన వాతావరణం ఎవరికీ పట్టని పర్యావరణం ఏ క్షణానికి ఏమి జరుగునో ఐనా మారని మానవ నైజం ఒక్క క్షణం నిలకడగా ఆలోచన ఓరిమితో గమ్యానికి సూచన ఔనన్నా కాదన్నా ఆందోళనకరం అండదండగా ఉండాల్సిన తరుణం

అర్చన 2020 – దశ’దిశలా’ దగ్ధమౌతోన్న మానవత్వం

రమేష్ చెన్నుపాటి పశువుల్ని కూడా శిశువుల్ని చేసుకుని ప్రాణం పోసే డాక్టర్ని..ప్రాణం తీసింది పశుత్వమా..చెద పట్టిన మనిషితత్వమా దశ ‘దిశ’లా దగధ్ధమౌతోన్న మానవతత్వమా ఉగ్గు పాలలో కాస్త తప్పుల సిగ్గు పోసి పెంచండి తల్లుల్లారా..ఓ పూట నోట్లో పొయ్యేదానికే పుచ్చూచచ్చూ చూసే మనం.. ఈళ్ళని పెంచి పోషించినందుకూ.మంచి మార్గం చూపనందుకూ.. ఉరికొయ్యలకూగాల్సింది..మనం కాదా.. కొమ్మల్లేని అమ్మలూ..మోడులైన మట్టి బొమ్మలూ తుపాకీ తూటానో..న్యాయం రాసే చీటీనో.. తెచ్చే మార్పు..పిసరంత ఏమార్పు.. నీతి తప్పిన మనిషి..చచ్చిన శవంతో సమానమని నేర్పని […]

అర్చన 2020 – మేలుకో మేలుకై

రచన: గోమతి నేను మనిషిగానే వున్నాను. నువ్వు మృగానివి ఎలా అయ్యావురా? పరాయి స్త్రీలను చూస్తే తల్లీ, సోదరి ఎందుకు గుర్తుకురాలేదు? ఓహో! నిజము! నీలో మానవత్వపు వెలుగు లేదు, అందుకే చీకటిలో పొరలుతున్నావు. తల్లి,తండ్రి,గురువు, నీకు మంచినే బోధిస్తారే? మరి ఎక్కడ దారి తప్పావు? వయసు రెక్కలు తొడుగునప్పుడు, విచక్షణ కన్నులు మూసుకున్నావు. అమృతమనుకుని చెడుమాటల సీసముతో చెవులు మూసుకున్నావు. సినిమాలు,సెల్లు ఫోనులు నేర్పుతున్నాయా? హంసవలె నీ బుద్ధి వున్న అవి ఏమి చేయునురా? బురదలో […]

అర్చన 2020 – నాన్నగారు… !

రచన: గన్నోజు శ్రీనివాస చారి నవ్యలోక జన్మదాత సవ్య దీవెన సంధాత దివ్య పాలన చతురుడు.. భవ్య భవిత మార్గ దూత! తండ్రి కారణజన్ముడు పుత్రోత్సహపు ధన్యుడు పుత్రికలను ప్రేమించే… పులకిత దైవ రూపుడు! తనయుల పాలిట ఉషస్సు అనునయించే తేజస్సు అమ్మతోడ జీవనమై… సాధించు సదా యశస్సు! తల్లిలేక ధరణి లేదు తండ్రి లేక తనువు రాదు సృష్టిలోన తల్లి దండ్రి.. జననమొసగు పూల పాదు! వృద్ధ్యాప్యంలో గమనించు చేయూత నిడి సేవించు తనవి తీరగ […]

అర్చన 2020 – నిప్పుల కుంపటి

రచన: ప్రసాద్ ర్యాలి గమ్యంలేని గాలివాటు ప్రయాణంలో అభివృద్ధి బాటవైపు ఎలా వెళ్ళేది. కనీసం గుండెల్లోనైనా పిడికిలి బిగించి ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి గుంపులోని గోవిందుల మధ్య నుండే నాయకుడు పుట్టుకురావాలి. సామూహిక నినాదాల మధ్య నుండి బలమైన గొంతు వినపడాలి. మిణుగురు వెలుగుల పరంపర శాశ్వతంగా కాంతినివ్వాలి. మరణం ఎదురుపడినపుడు పసిపిల్లలా భుజానికి ఎత్తుకోవాలి. పదిమందిని ఒకే బాటలో నడిపేందుకు గుచ్చుకుంటున్న ప్రతికూల ముళ్ళను ఆభరణాల్లా ధరించాలి. ఒకరి ఆశ ఆరాటమైతే ఒఖ్ఖరి […]

అర్చన 2020 – నీకై

రచన: శ్రీదేవి సురేష్ కూచిమంచి అయినా నీకు ఎప్పుడు అర్థమౌతుంది.. ఆమె వినీలగగనమంత మనసుని నీకై పరిచి ఉంచుతుంది.. నీలో ప్రేమ అణువంతైన కురిపిస్తే… ఆ ప్రేమ చుక్కలను తన మదిలో చల్లని ముంచు ముద్దలా పదిలపరుచుకోవాలని తపన పడుతూ ఉంటుంది.. కాని లేలేత గులాబి వంటి ఆ మనసుని అర్థం చేసుకోకుండా నిర్లక్షంగా పడేసేవు… నీకై క్షణక్షణం పరితపించి నీ కోసమే ఎదురు చూసే ఆ నయనాలు కార్చే కన్నీరు ఓ సంద్రమైన నీ హృదయము […]

అర్చన 2020 – నువ్వేం సాధిస్తావ్

రచన: జి. రంగబాబు టార్గెట్ ఐ. ఐ. టి. అంటూ నువ్వు నీ కొడుకుని జైలు లాంటి క్లాసు రూముల్లోకి పంపేస్తున్నావ్.. నాన్నవై నందుకు నిన్నేమీ అనలేక నాకిలాంటి చదువొద్దు అనే ధైర్యం చేయలేక పాపం అలాగే బందీగా పడివుంటున్నాడు ఆ పసివాడు నువ్వెప్పుడైనా ఆలాంటి జైలు గోడల మధ్య బ్రతికావా? నువ్వెప్పుడైనా బండెడు పుస్తకాలు మోస్తూ నీ బడికెళ్లావా? మరెందుకు నీ కొడుక్కి ఈ శిక్ష? వాడే పాపం చేశాడని నీ లక్ష్యాలన్నీ వాడిపై రుద్దుతున్నావ్? […]

అర్చన 2020 – నేను ఆడదాన్ని కాను

రచన: కిరణ్ విభావరి స్త్రీ శరీరంలో బంధింపబడిన మనిషిని నేను ఓ మనిషిని నీలాంటి మనిషిని నీలో సగమైన మనిషిని నాలో దాగి ఉన్న ఆశల కెరటాలు ఈసడింపుల మధ్య నలిగిపోతే, బలహీనతకు బలమైన సాక్ష్యానిగా కన్నవారికి బరువైన బాధ్యతగా మిగిలిపోయిన నీ సాటి మనిషిని నీలాంటి మనిషిని నీ ప్రతి విజయం వెనుక నేనున్నానని నువ్వంటే, మురిసిపోయాను!!! కానీ నన్ను నీ వెనకే ఉంచేశావని తెలుసుకోలేకపోయాను భాష లేని కన్నీరుని కనుపాపలలో కప్పి, నిన్ను మేము […]

అర్చన 2020 – పండుటాకుల వసంతం

రచన: భైతి దుర్గయ్య పాలిచ్చి పెంచిన మమకారం పాతాళానికి దిగజారిన వేళ నడక నేర్పిన నాన్నతనం నయవంచనకు తలొగ్గిన సమయాన అందరు ఉన్నా అనాథల్లాగా దినమొక యుగంలా బతుకు సాగదీస్తూ జీవితాన్ని ధారగా వంశవృక్షాన్ని పెంచి రాలిపోతున్న పండుటాకుల దీనగాథలు వినేదెవ్వరు వారిని ఓదార్చేదెవ్వరు కాసులకై పరుగెత్తే కాల గమనంలో ఆత్మీయత అనుబంధాలు మటు మాయం పరాయి దేశాల విలాస మోజులో పతనమవుతున్న మానవ విలువలు ఆస్తులు అంతస్తులను పెంచే పేరాశలో కనుమరుగవుతున్న కన్న పేగులు కాటికి […]

అర్చన 2020 – భువి స్వర్గంగా మార్చు

రచన: వై చంద్రకళ ఓమనిషి, నీ గమ్యం చేరే వరకూ ఆగక సాగాలి నవ సమాజ స్థాపనకు నడుం బిగించాలి అవినీతి, అరాచకం ప్రబలిన లోకంలో ప్రాణానికి, మానానికి గడ్డిపోచ విలువైనా ఇవ్వక అధికారాల కోసం అంతస్తులకోసం ప్రాకులాడుతూ మనిషి పాపపుణ్యాల చింతన మరచి మంచి, మానవత్వమన్న ఆలోచన లేక అధోగతిలోకి పయనిస్తున్నవారిని ఆపాలి ప్రజలంతా దైర్యంగా మనగలగాలి మరో అందమయిన ప్రపంచాన్ని నిర్మించాలి స్వార్ధాన్ని విడచి, కలిసికట్టుగా నడచి సొంత లాభాన్ని కొంత మానుకోవాలి చేయి,చేయి […]