April 26, 2024

అనగనగా బ్నిం కధలు 11 – రాజయ్య ఇడ్లీ బండి

రచన: బ్నింbnim

చదివినది: ఐనంపూడి శ్రీలక్ష్మి

 

వందల ఎకరాల్తో బాటు.. తల్లితండ్రులు వెలకట్టలేనంత సహృదయం ఇచ్చిన పెద్ద మనిషి జగన్నాధరావు!
ఎంత వున్నా కావల్సిందేమిటీ? ప్రేమించే వ్యక్తులు!! అదీ ఆయనకి పుష్కలమే. ప్రేమని డబ్బిచ్చి కొనలేడు కదా! మంచితనంతోనే సంపాదించుకున్నాడతను.
అవసరమైతే ప్రాణమైనా ఇచ్చే ప్రేమధనం అతని జనానాలో ఖజానాలో వుంది.!
కోరుకుంటే  7 స్టార్ హోటల్ నుంచి పలారం తెచ్చుకునే అతను సందు చివర రాజయ్య ఇడ్లీ బండి ముందు నిలబడి ఇడ్లీ తిన్నాడు. తిని థ్రిల్లయ్యాడు. థ్రిల్లయి ఏం చేశాడు? అదే కథ..
నేనే  రాశానా? అనేంత మంచి కారక్టర్స్ (జగన్నాధరావు, రాజయ్య) కథలో నడిచాయ్..వొదిగాయ్.. నన్ను నిలిపాయ్!
చాలా రోజుల తర్వాత వింటొంటే కథ మర్చిపోయిన నాకే మంచి కథ రాసేనే అనే ఆనందం, థ్రిల్ కలిగాయి..!
జ్యోతి వలబోజుగారు ‘మాలిక’ కోసం ముందు మాటలు రాసి పంపమంటే స్వోత్కర్షగా వుంటుందని మొహమాటపడి  కంట్రోల్డ్‌గా రాస్తున్నాను.
మంచి కథ.. దయచేసి వినండి. మీ బ్నిం కూడా మంచి కథకుడే అని సంతోషించవచ్చు!
ఈ కథని ఆనాడు మెచ్చుకుని ప్రచురించకపోయుంటే ఎంత చేటు నాకూ…! ?
అందుకే శ్రీమతి ఏ.ఎస్.లక్ష్మిగారికి (ఆంధ్రభూమి – వీక్లీ) మళ్లీ థేంక్స్ చెప్పుకుంటున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *