. బాలసారె రోజు — ” మళ్ళాఆడపిల్లేనా!”అక్క అనసూయ వెక్కిరింపు, ఆమెకు చక్కనైన కొడుకున్నాడని టెక్కు.. “మూడోసారైనా వంశోధ్ధారకుడు పుడతాడని మీ అమ్మానాన్న కలలు కన్నార్రా!” మేనత్త నసుగుడు, తమ్ముడ్ని తక్కువ చేయాలని ఆమె యావ. “ముగ్గురికి చదువులూ, పెళ్ళిళ్ళూ పేరంటాలూ నీవల్లవుతుందా! పోనీ దీన్ని పెంపుడుకివ్వరాదుట్రా!” పిన్నమ్మ పితలాటం, తన తోడికోడలికి పిల్లల్లేరు, ఈ బంగారపు బొమ్మను ఆ నల్ల బంగారాలకు కట్టబెట్టి, మెప్పుపొందాలని ఆమె ఆశ. “ఆ ఆడపిలల్లకేం చదువుల్లే! ఇంటి పన్లూ వంట […]