April 26, 2024

శిక్షణ (తండ్రి – కూతురు )

రచన : శ్రీ మతి అల్లూరి గౌరీ లక్ష్మి “నాన్నా!  రేడియోలో నీ భావనొస్తుందీ రోజు. లే ..లే… కాఫీ చేస్తున్నా!” అమ్మాయి శ్రీ లక్ష్మి మేలుకొలుపుకి లేచాను. సమయం అయిదున్నర దాటింది. అల్లుడికీ  పిల్లలకీ మెలకువ రాకుండా , ఇద్దరం మొహాలు కడుక్కుని కాఫీ కప్పుల్తో  మేడ మీదికి చేరాం రేడియో పట్టుకుని. అక్కడున్న కుర్చీల్లో కాఫీ తాగుతూ రేడియో పెట్టి కూర్చున్నాం. మంగళ ధ్వని, కార్యక్రమ వివరాలయ్యాక “ఈ నాటి భావన శ్రీ శివ […]

మాలిక పత్రిక నవంబర్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor / Content Head ప్రతీ నెల సరికొత్త అంశాలతో మిమ్మల్ని అలరిస్తోంది మాలిక  పత్రిక. ఈ నెల ప్రత్యేకంగా జడ అనే అంశం మీద వచ్చిన సరదా పద్యాలు మీకోసం… మమ్మల్ని ఆదరిస్తోన్న  పాఠకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల మాలిక పత్రికలోని వివిధ వ్యాసాలు: మీ రచనలు పంపవలసిన చిరునామా editor@maalika.org 00. శిక్షణ (తండ్రి – కూతురు) 01. జడమాలిక  02.  పదచంద్రిక – నవంబర్ 2014 03. […]

జడమాలిక

pic: Bapu           Shyam pullela కంట్రీలు వేరు యైనచొ వెంట్రుకలను ముడుచునట్టి విధములు మారున్ ‘ఎంట్రీ’లవెన్ని యున్నను ‘జంట్రీ’ మెచ్చెడి విధమ్ము, జడయే శ్యామా!   Srinivas Bharadwaj Kishore సుస్తీజేసిందంటూ కుస్తీబడుతుండు లేయకూసోరాకే వస్తేనువుజడనూపుత ముస్తాబయ్యిండుసూడు ముసలాడైనా ఇస్తే జడ చేతికి నువు ఉస్తాదుకు మల్లె గొప్ప పోజిచ్చిండే వస్తేగద చూస్తందుకు మస్తుగ నుందేంది దంట పండ్లికిలించే మామూలుగ జడ కదుపగ వామోయని గట్టిగరిచి వడిగురికిండే ఏమౌతది మరి […]

మాలిక పదచంద్రిక – నవంబర్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి                                                                           ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన […]

ఆత్మీయం — ఎగిరే పావురమా

రచన: సి.ఉమాదేవి కూచిపూడి నాట్యారాధనలో నిత్యార్చన చేస్తున్న కోసూరి ఉమా భారతి గారు రచనారంగంలో సైతం సామాజికాంశాలపై చక్కటి అవగాహనతో నవలలు వెలువరించడం  ప్రశంసనీయం. నవల,కథ,కవిత ప్రక్రియ ఏదైనా కష్టం,సులభం అనే ముద్రలకందవు. సాహితీ సేవలో ప్రతి పదం,వాక్యం  రచయిత మేధో శ్రమతో నిర్మించబడినవే! అయితే నవలారచన సమయాన్ని ఆశిస్తుంది.అలాగే అవగాహనను కూడా కోరుకుంటుంది. నవలీకరించడానికి తగిన ముడిసరుకు కావాలి.విషయసేకరణ తరువాత పాత్రల ప్రవేశం,వాటి అమరికపైనే కథాగమనం ఆధారపడుతుంది. ఇక ఉమా భారతి గారి నవలలో వారి […]

మూడు పాయల జడ

రచన – జెజ్జాల కృష్ణ మోహనరావు           ఒకే జడకు మూడు పాయలవలె, ఒకే భావానికి మూడు ప్రతిరూపములను మీకు ఇక్కడ అందిస్తున్నాను – (1) ఆంగ్లములో వ్రాసిన ఒక prose poem, (2) తెలుగులో ఆ భావములకు ఒక పద్య రూపము, (3) అదే భావములకు ప్రతిబింబముగా ఒక వచన పద్యము. ఇవి ఒక దానికి ఒకటి మక్కీకిమక్కి అనువాదము కాదు.  భావము లొకటే అయినా చెప్పడములో భేదాలు ఉన్నాయి. […]

ఆరాధ్య – 2

రచన: అంగులూరి అంజనీదేవి   http://www.angulurianjanidevi.com  anguluri.anjanidevi.novelist@gmail.com   ”నా ఆఫీసు ఇక్కడికి దగ్గరే! నడుచుకుంటూ వెళ్తాను. నువ్వు ఇటువైపు తిన్నగా వెళ్తే ఓ ఐదు నిముషాల్లో మాదాపూర్‌ పెట్రోల్‌పంప్‌ బస్‌స్టాప్‌ వస్తుంది. అక్కడ హెచ్‌-10 బస్సెక్కి హైటెక్‌సిటీకెళ్లు. అక్కడ వరసగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే వుంటాయి. వాటిలోకెళ్లి నీ రెజ్యూమ్‌ చూపించు. నా ఫ్రెండ్‌ కూతురు వాత్సల్య కూడా ఈ మధ్యన ఈ ప్రయత్నంలోనే వుంది. సర్టిఫికేట్లన్నీ ఫైల్లో వున్నాయికదా! ఫైల్‌ జాగ్రత్త!” అంది. ”ఆంటీ! నాకు […]

అనగనగా బ్నిం కథలు – 14 – బాయ్‌ఫ్రెండ్

రచన: బ్నిం   నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడూనీడ నీవే ‘సఖుడౌ’ నీవే గురుడవు దైవము నీవె నా పతియు గతియు నిజముగ కృష్ణా   ఇది కృష్ణ శతకంలోని పద్యం.   ఒక వ్యక్తి మరొకరి మీద ఆధారపడటం… అండ కోరటం.. వారినే సర్వస్వంగా భావించడం.. అసత్యం కాదు. అత్యవసరం కూడా!!! ఇక్కడీ కథలో.. ‘సఖుడు.. ‘ఫ్రెండ్’ ఎవరూ…? అతను ‘నీడగా’ ఉంటూ.. ఆమెని ఎలా ఆదుకున్నాడు .. ఆదుకుంటాడు? అనే ప్రశ్నలకి […]

మాయానగరం: 9

రచన:భువనచంద్ర         “పోనీ ఇవాళ మా ఇంట్లో భోంచేద్దురు గాని.. అదీ మీకు ఇష్టం అయితేనే..! మెల్లగా అన్నది మాధవీరావ్. “అమ్మయ్యా..మాధవిగారూ.. అన్నపూర్ణాదేవే ఎదురుగా వచ్చి ‘భక్తా..ఇదిగో ప్రసాదం’ అంటూ అంటూ వడ్డిస్తానంటే వద్దనేవాడు లోకంలో వుంటాడాండీ?  తొలి నే జేసిన పూజాఫలమో… నేటి ఆలయ దర్శన సౌభాగ్యమో…లేకపోతే…” ఆనందం అంతా ముఖంలో ప్రతిఫలిస్తుండగా అన్నాడు ఆనందరావు. “అయ్యా..నేను అన్నపూర్ణాదేవిని గాదు. జస్ట్ మాధవిని. పాయింటు టూ నాకు సరిగ్గా వంట రాదు. […]

మలాలా యూసెఫ్ జై: ది ఫైటర్

రచన:   డా. జె. గౌతమి సత్యశ్రీ           కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు……  పావన నవ జీవన బృందావన నిర్మాతలు…. అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఒక పావన నవజీవన బృందావన నిర్మాత పదహారేళ్ళ ఈ పాకిస్తానీ అమ్మాయి మలాలా యూసెఫ్ జై.  ప్రపంచమంతా ఈమెను ఆరాధించడానికి కారణం ఆమె చేస్తున్న పోరాటాలే. పాకిస్తానీ అమ్మాయిలందరికీ చదువుకునే యోగ్యతకు తాలిబన్ మిలిటెంట్ల వల్ల భంగం కలగకూడదని,  ఆమె నిరంతరం జరుపుతున్న […]