April 27, 2024

సెప్టెంబరు 15 పదచంద్రిక

అత్యల్ప స్పందన మూలంగా మాలిక పదచంద్రికను ఈ సంచికతో నిలిపివేయడం జరుగుతోంది.. కొద్ది విరామం తర్వాత సరికొత్త ఆలోచనతో మళ్లీ కలుద్దాం..

padachandrika sept 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి
సమాధానాలు పంపవలసిన ఆఖరి తేదీ: 20 సెప్టెంబర్
సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

అడ్డం ఆధారాలు
1 ఇగత్ పురి లో గోయెంకా గారు నేర్పే మెడిటేషన్ పద్దతి
4 జనుము, కొబ్బరి నుండి వచ్చే పీచు
5 రంగూన్ ఉన్న దేశం
7 పల్లకి. అదృష్టం ఇది ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి తోసిందట
8 కోప్పడితే పిల్లలు పెట్టే మూతి
9 10 అడ్డం ముందు చేరితే 11 అడ్డానికి ఉన్న ఆస్తి
10 విలువలు, వలువలు మధ్య కామన్ ఫేక్టర్
11 ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ సినిమా. ఆయన ఎవరబ్బాయో చెప్తుంది
14 సారంగధర మొదట్లోనే తడబడ్డాడే
16 చేతికి వాచి, పళ్ళకి … బ్రహ్మానందం కవిత్వం గుర్తుతెచ్చుకోండి
17 బోల్టు కి బిగించేది
18 సర్పం
19 ఆర్ధికంగా ధివాళా తీస్తున్న పురాణాలదేశం
21 యమలీల హీరో.. తెలుగు హాస్య నటుడు
22 పాట కాని పాట.. వేరే వాళ్ళు ఏం చెప్పినా అవుననడం
23 ధర
25 జూన్ నెలలో ఈ దినం జరుపుకున్నాం, రాందేవా
26 తిరుపతిలో ఒక తీర్ధం .. రాష్ట్రపతిగారు ఈమధ్యనే దర్శించారు
29 జిత్తులమారి జంతువు..కుక్కలాంటిదే
30 ఎలక ఉండే కన్నం
33 క,ఖ,గ,ఘ…….హళక్షఱ ల పేరు
నిలువు ఆధారాలు
1 బాహుబలి దర్శకుడు
2 మట్టి తవ్వి ఎత్తి పోయడానికి వాడేది
3 గుజరాతు లో ఒకనది
6 శక్తి
7 అడుగులు
12 అర్జునుడే..
13 పెట్టుబడి
14 చెక్కలని కోసేవి
15 గుట్టు విప్పేస్తే అయ్యేది
19 మెడ
20 కూతురు
21 పద్యాలలో రకం, వేశ్య
24 హనీ సింగు పేరుకు ముందు చేరిన అక్షరాలు
26 బంగారు వాన
27 మోకాళ్ళ కింద వెనుక భాగాలు, గింజలు
28 ఒడ్డు
31 కొండ బిలాలు
32 చిన్న మగ పిల్లలు

1 thought on “సెప్టెంబరు 15 పదచంద్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *