April 26, 2024

Gausips : DEAD PEOPLE DON’T SPEAK-8

రచన: డా. శ్రీసత్యగౌతమి,

అంటే.. “ఆ టైంలో సమాధి దగ్గిర వున్నది అనైటా? అదే నేను గూగుల్లో చూశానా? ఒకవేళ ఫెర్నాండేజ్ చెప్పినట్లు ఆ కొద్దికాలం పాటు అనైటా ఆ ఆత్మ తాలూకు అతీంద్రియ శక్తులకు లోనై ఆ కుర్రాడి ఆత్మ నడిపించినట్లుగా తానే రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నదా? ఆ ఆత్మ అనైటాను వశం చేసుకొని తన ద్వారా అందరితో మాట్లాడుతున్నదా?” ఆశ్చర్యంతో కళ్ళింత చేసి నోరు వెళ్ళబెట్టాడు ఏరన్.
కాసేపాగి మళ్ళీ అనుకున్నాడు అయితే రహస్యాన్ని చేధించడానికి తాను తీసుకున్న స్టెప్స్ సరియైనవే, అందుకే ఎక్కువ టైం పట్టకుండా కొత్త విషయాలు బయటపడ్డాయి, కాకపోతే అవి నిజాలయి వుండాలి.
ఒకసారి అనైటా పరిచయం దగ్గిరనుండి బార్ నుండి బయట పడి ట్రాలీలో అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళి, బిరియానీ తిని తిరిగి హోటల్ వచ్చేంత వరకు ఆమె మాటలు, చూపులు, చేష్టలు ఏదైనా అనుమానస్పదం గా వున్నాయేమో అని మననం చేసుకున్నాడు. దీని వల్ల ఏరన్ కి ఒక క్లూ దొరికింది.
“తాను ఇంతకు మునుపు కూడా ఎల్విన్ దగ్గిరనుండి రికార్డింగ్సు తీసుకున్నాననే చెప్పిందే తప్ప, తాను దగ్గిరుండి విన్నదని మాత్రం చెప్పినట్లుగా గుర్తులేదు” అని స్వగతం గా అనుకున్నాడు.
“అంటే ఆ పెయింటర్ అనే కుర్రాడి ఆత్మ అనైటా ద్వారా నే రేడియోస్టేషన్ కి ఫోన్ చేస్తున్నది, అదీ ఒకటే టైం కి .. కేవలం ఆ ఫోన్ ఇన్ అనే కార్యక్రమానికి. ఎందుకంటే ఆ కార్యక్రమానికి రేడియో జాకి ఎల్విన్. ఎల్విన్ అనైటా ఫ్రెండ్. అందుకే ఆ ఆత్మ ఆ టైంలోనే మాట్లాడుతున్నదన్నమాట. అయితే అనైటా ఆ టైం లో రేడియో స్టేషన్ కి కాదు, ఆ ఆత్మకు వశమై తనకు తెలియకుండానే ఎల్విన్ ఫోన్ కు రింగ్ ఇచ్చి ఆత్మను కనెక్ట్ చేస్తున్నది, అది ఎల్విన్ తో మాట్లాడుతున్నది, ఆ మాటలు వుంటూ ఎల్విన్ రికార్డ్ చేస్తున్నాడు అనైటాకి అందిస్తున్నాడు. ఇదీ గాబోలు జరుగుతున్నది !!!
అయితే ఇది ఎల్విన్ ఫోన్ రికార్డింగ్స్, ప్రయివేట్ కాల్స్ !!!!
ఇది ఫోన్ ఇన్ కార్యక్రమంలో రికార్డ్ అవ్వడం లేదు, అలాగయితే వూరంతా అందరికీ ఈ స్టోరీ తెలిసేది. ఇది కేవలం ఎల్విన్ కి, అనైటాకి ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. ఈ ఆలోచన ఏరన్ కు గొప్ప ఊపునిచ్చింది. అంతే కాదు అనైటా గురించి పూర్తిగా అర్ధమయ్యింది. ఈ స్టోరీ న అనైటా ఫాలో అవ్వటం లేదు. ఆ కుర్రాడి ఆత్మ అనైటాని ఫాలో అవుతున్నాడు. ఈ స్టోరీ లో హీరో ఆ కుర్రాడే, పేరు “పెయింటర్”
తనకున్న అజెండాలో 8 ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం దొరికేసింది, ఆత్మలు తమకు తాముగా తమ అతీంద్రియ శక్తులను ఉపయోగించుకొని మనుష్యులకు తాము చెప్పాలనుకున్నవి చెప్తాయని, అనైటా ఎందుకు ఈ స్టోరీ అని ఫాలోఅవుతుందనీ…
“అసలు తాను ఈ స్టోరీనే ఎందుకు ఫాలో అవుతుంది?”.. మరో ప్రశ్న తలెత్తింది ఏరన్ కి. ఇది తెలియాలంటే తన అజెండా లోని ఒక ప్రశ్న ఆ కుర్రాడి పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకోవాలి. తాను సమాధిగా ఎందుకు మిగిలాడో తెలుసుకోవాలి. చూస్తుంటే ఈ వివరాలు అనైటాకి కూడా తెలిసినట్లులేవు, ఎంతసేపూ పెయింటర్ వాయిస్ వినడం, చెప్పింది రికార్డు చేసుకోవడం తప్ప!!
పెయింటర్ గురించి ఎలా తెలుసుకోవడం???????.. ఏరన్ కు వేధిస్తున్న ప్రశ్న!!
అమాండా గాని, రూబీ గాని ఈ విషాయాలతో సంబంధం వుందా? తాను ఈ హోటల్ రావడానికి ముందు అమాండా రూబీకి ఫోన్ చెయ్యడం, నా వివరాలు అడగడం జరిగింది. విచిత్రంగా అమాండా ఫోన్ నెంబర్ కూడా మారింది రిజిస్టర్ లో నుండి. అమాండా నెంబర్ అని ముందు తీసుకున్న ఫోన్ చేస్తే… ఏ రెస్పాన్స్ లేదు, తరువాత తీసుకున్న అమాండా నెంబర్ ఫోన్ చేస్తే కీచు శబ్దాలొచ్చాయి, ఏంటి చెప్మా??????
కానీ ఇప్పుడు అనైటా విషయంలో పెయింటరే అనైటా ఫోన్ ద్వారా ఎల్విన్ ఫోన్ కి కనెక్ట్ అవుతున్నాడని అనుకున్నాను కదా.. అది ఒక విధంగా నిజమయితే అమాండా నెంబర్ అని రెండవ సారి తీసుకున్న నెంబర్, అనైటా నెంబర్ కి మ్యాచ్ అయివుండాలి. అంటే అమాండా అనే వ్యక్తే లేదా ????? అది కేవలం కల్పనా? అందుకే అమాండా మళ్ళీ రాలేదా నాకోసం???? ఇది తేలాలంటే ముందు నెంబర్లు మ్యాచ్ చెయ్యాలి. అనుకున్నదే తడువు ఒక్క ఉదుటున ఆరోజు రూబీ రాసిచ్చిన స్లిప్ కోసం టేబుల్ మీద వెతికాడు. కనబడలేదు. మళ్ళీ మళ్ళీ వెతికాడు.. ఊహు.. కనబడలేదు. చెత్త బుట్టలో వెతికాడు. చెత్తబుట్ట ఖాళీగా వుంది, ఊ.. హౌస్ కీపింగ్ క్లీన్ చేశేశారు.. అని స్వగతంగా అనుకున్నాడు. సరేలే మళ్ళీ రిసప్షన్ లోకి వెళ్ళి అడిగి తేవాలి.
దీనికన్నా కూడా ముఖ్యం అనైటాని దగ్గిరుండి వాచ్ చెయ్యడము.
“అనైటాని తీసుకొని రేడియో స్టేషన్ కి వెళ్ళాలి, ఎల్విన్ కి బదులు ఫోన్ ఇన్ కార్యక్రమం నేను కండక్ట్ చెయ్యాలి. పెయింటర్ ఆత్మ కేవలం ఎల్విన్ కి అనైటా ద్వారా ప్రయివేట్ కాల్స్ చేస్తున్నట్లయితే ఆమె స్టేషన్ లోనే వుంటుంది నాతో పాటు. అనైటా, ఎల్విన్ల మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి నా జేబులో వేసేసుకుంటాను, సో పెయింటర్ కి వాళ్ళతో కమ్యూనికేట్ చేశే అవకాశమే లేదు. చేస్తే డైరక్ట్ గా స్టేషన్ కే చెయ్యాలి. చూద్దాం ఏమి జరుగుతుందో. ఒకవేళ స్టేషన్ కి చేస్తే ఆ రికార్డింగ్స్ ని రేడియో ట్రాన్స్ మిట్ చేస్తాను. ఏమి జరుగుతుందో చూద్దాం”…. అలోచించుకొని పెట్టుకున్నాడు ఏరన్.
మరి ఏరన్ వేసుకున్న పధకాల ప్రకారమే పెయింటర్ నడుచుకున్నాడా లేక తాను ఇంకా తెలివిగా ఏరన్ ని తప్పుదోవ పట్టించాడా???????
**********************

(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *