May 3, 2024

ప్రణయ విజృంభణ

                                                   ప్రియా నాయుడు

 

Screen Shot 2016-02-03 at 4.48.09 PM

 

పిడికెడు నా యదను మీటితే ..వేయి వీణల ప్రణయరాగాల వెల్లువలె

పెదవుల తాళపత్రాల మీద ..లిఖించాను నీ ప్రేమ కావ్య వజ్రములే

అంగాంగ నీ చూపుల ఉలి వేడిమి తాకిడి  ..విరహపు  జ్వాలలు నే తాళజాల

పురివిప్పిన నా యవ్వన ప్రాంగణములో ..కురిసే శృంగార విరిజల్లుల వాన

తలచి అలసి వలచి వగచి విసిగి వేసారి ..వేగిపోతున్నాను నీ తమకములో

క్షణము యుగము పగలు రాత్రి వగలు శగలు తూలిపోతున్నాను నీ తలపులలో

తనువు అణువు సొగసు వయసు మనసు ..మధుధారలై కురిసే ఈ మధువనిలో

విరహం విరసం ప్రణయం సరసం నయనం  స్వర్గ దారులై  విరిసే యదకుసుమంలో

నవమన్మధుని  రూపువో యదదోచిన రాతిరాజువో సమ్మోహిత మనో చోరినివో

నీలవేణి మన సెరిగిన ప్రేమ లోలుని ప్రతిరూపమైన శృంగార నా ధర హాసానివో

తపనల పళ్ళెములో ప్రేమాను రాగాల మరుల సిరులు వొంపిన శృంగార నిధివో

కలల రాకుమారిడివో నింగి నక్షత్రాల నడుమ వెలిగే చంద్రబింబానివో నా రాజువో ..

జిలి బిలి ఆశల అల్లరి చిలిపి  ఊహల ఊయల  చెలరేగు నా మధుర భావనవో

గడి బిడి చేసే నా గుండెను దూసే చురకత్తి చూపుల మత్తు జల్లే మాంత్రికుడివో

నవ నాడులు నీ వశమై తపియింప చేసే చిత్రమైన అనుభూతుల చిత్రకారుడివో

లలనా చంద్రికల తారాడు నవ వసంత రాధికా సమ్మోహిత  ప్రియ ప్రేరణవో

గమ్మత్తుగా ఇలా నీ సోత్తులా నన్ను తనివి తీరా కరిగించు నీ తపనలలో

విరిమెత్తల నా యదసోత్తుల పాలించు సుతిమెత్తని వలపుల నీ కౌగిలిలో

వోపజాల నిరీక్షణల జ్వాల బంధించు  కరముల ఆలింగన నీ యదశ్వాసలో

కరిగిపోనా  కౌగిలిలో ..  నీ అధర ఛుంభన సుగంధాల పన్నీటి  ప్రవాహములో

మనము ఏకమై ప్రేమలోకాలకే అతీతమైన ఒక అనిర్వచనీయమైన అనుభూతులై

ప్రేమరాజ్యపు  హృదయాల్లో ఒక ప్రణయకావ్యమై మిగిలిపోవాలి  మన ప్రణయగాధ!

1 thought on “ప్రణయ విజృంభణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *