May 8, 2024

వలలుడూ – తాండావకేళి సల్పెనే…

 

వంశీ మాగంటి
________

 

కుండలా కాంతూలూ మెరయ

దండిగా  అందెలూ మ్రోయ

దండిగా గంటె చేబూని

థళాంథళాం యని థణినాదముతో   || తాండా ||

 

నీటీచుక్క సుయ్యిమని పాడాగా

గంటెలు తాళమూ వేయగ

వంటింటి కొలువూన వలలుడూ

తధిమిత కుంతరి తకుఝణ తకథిమి  || తాండా ||

 

అల్లమూతల్లి వీణామీటాగా

ఉల్పాయలు తాళమూ వేయగ

మిరిచీలూ మృదంగమూ వాయించగను

పరీపరీ పరి పరి పరి విధముల || తాండా ||

 

లపనమూనా మమ్మేలు జిహ్వా

పెనమూన మూడో కన్ను

సొగసూగ నూనేలహారము

నిగాల్ నిగాల్ మని నిగనిగ మెరయుచు || తాండా ||

 

బల్లాతల్లీ మస్తాకమున

కడిగీన పళ్ళెరపూ రేఖ

అల్లాపూ కారమూతో

మిసాల్ మిసాల్ మని మిసమిస మెరయ || తాండా ||

 

జేజబ్బలూ జేజవ్వలూ

నాయనలూ అమ్మలూ పిలకాయలు

వేసిన దోసెను ప్రణుతింపగను

భళీభళీ భళి భళిభళి యనుచు || తాండా ||

 

వంటలసాల హృదయ

పంకజాపరియంక నిలయ

వలలు డదుగో ఉదయ కాలము

ఝణాఝణం యని ఝణినాదముతో || తాండా ||

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *