May 5, 2024

అలవాటే!

రచన: భమిడిపాటి శాంత కుమారి

ఏరుదాటాక తెప్పను తగలెట్టటం
ఈ పెద్దలకు అలవాటే!
ఆ వయసులో తామేమి చేశామో
మరిచిపోవటం పరిపాటే!
అది వారికి సహజ సిద్ధమైన పొరపాటే!
తమ వయసులో తాము చూసినవి,చేసినవి
మరిచిపోవటం గ్రహపాటే!
అర్ధంకాని వయసులో అన్నీఅలానే చేసి
పిల్లల దగ్గరకొచ్చేసరికి మాత్రం
ఇలా అపార్ధాలకు తమమననులో తావిచ్చి
ఆదరించవలసిన విషయంలో చీదరించి
దన్నుగా ఉండవలసిన సమయంలో వెన్నుచూపి
మేల్కొల్పాల్సిన తమ మనసును తామే నిదురపుచ్చి
ఇలా ప్రవర్తించటం న్యాయమా?
వయసు చేసే తుంటరిపనులు,
మనసు చేసే ఇంద్రజాలాలు
గుర్తుంచుకోకపోవటం ధర్మమా?
నడిచి వచ్చిన దారిని మరిచిపోతే ఎలా?
నిన్నే అనుసరిస్తున్నారని తెలియకపొతే ఎలా?
ఇది నీవు నేర్పిన విద్యయేకదా నీరజాక్షా!
మరి నీ పిల్లలపైననే నీకు ఎందుకింత కక్ష?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *