May 2, 2024

ఫ‌ట్‌…..ఫ్లాప్‌…..ప‌ర‌మ‌చెత్త‌…..వావ్‌ – హాస్యకథల పోటి – రెండవ బహుమతి

రచన: ముచ్చర్ల రజనీ శకుంతల

హీరో, విల‌న్, హీరోయిన్‌, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ మైకుల మీద మైక్ ట్రైస‌న్ మాదిరిగా ఫిటింగ్‌లు మొద‌లుపెట్టారు. టీవీఛానెల్స్ వాళ్లు చిద్విలాసంగా …. మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంటే….ఆ మ‌ర్డ‌ర్‌ని ఏ యాంగిల్‌లో తీయాలి…. మ‌ర్డ‌ర‌వుతున్న వ్య‌క్తి ఫీలింగ్స్‌ని ఎలా క‌వ‌ర్ చేయాలి…. ఈ మ‌ర్డ‌ర్ మీద జ‌నం అభిప్రాయాలు ఎలా క‌రెక్ట్ చేయాలి…అని ఆలోచిస్తున్నంత చిద్విలాసంగా తిల‌కిస్తున్నారు.
*ఫ‌ట్టు…….ఫ్లాపు* అన్నాడు
వెధ‌వ డైరెక్ట్ * ప‌ర‌మ‌చెత్త‌* అన్నాడు
హీరోయిన్ * తూ…..యాక్* అంది

ఛానెల్స్ వాళ్లు వాళ్ల వంక చూసి “ మీరట్లా పోట్లాడుకోవ‌ద్దు. ఆ డ్యూటీ మాది……వివరంగా వ‌న్ బై వ‌న్ చెప్పాలి. లేదంటే నేను ~ లైవ్ ~ ఇవ్వ‌నంతే. ….” ఓ యాంక‌ర‌మ్మ మూతి చిగించి చెప్పింది. అప్ప‌టికే ఆ చోర్యాన్ని ప‌నీ పాట వ‌దిలేసి కాలాక్షేపాన్ని చూస్తోన్న జ‌నం ~ వాట్ నెక్ట్స్~ అన్న క్యూరియాసిటితో ఉన్నారు.
మెయిన్ స్ట్రీమ్‌లోకి వ‌చ్చి ఫ్లాష్ బ్లాక్ స్ర్కీన్ ప్లేని ఓపెనింగ్ షాట్‌తో మొద‌లుపెడితే…
* * *
తొక్కేం కాదూ…. సినిమా విడుద‌లై అప్ప‌టికి ముప్పై నిమిషాలు గ‌డిచాయి. టైటిల్స్ ప‌డ్డ నాలుగు నిమిషాల‌కే జ‌నం అసెంబ్లీ స‌మావేశాలు చూస్తున్న‌ట్లు అస‌హ‌నంగా ఫీల‌య్యారు. బ‌య‌టేమో ఛాన‌ళ్ల వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటర్వెల్లు అవుతుందా ? మైకు ప్రేక్ష‌కుల ముందుపెడుదామా ? అన్న ఆసక్తితో చూస్తున్నారు.
అల్రెడీ ఇలాంటి టీవీ క‌వ‌రెజ్‌ల కోసం కొంద‌రు `క‌వ‌రెజమ్మ‌లు…., క‌వ‌రెజ‌య్యాలు మ‌న‌సులో ఫిక్స‌య్యారు. కెమెరా ఆన్ అవ్వ‌గానే, మైక్ నోటి ముందుకు రాగానే “క‌త్తి… ప‌క్కా……హండ్రెడ్ డేస్ ` అనాల‌న్న `యావ ` వాళ్ల మొద‌ళ్ల‌లో ఫెవికాల్‌లా ఫిక్స‌యిపోయింది.
స‌రిగ్గా అప్పుడే సినిమా యూనిట్ ప్రెస్‌మీట్ పెట్టి ` ప్రెస్‌మీట్‌`లో ( తాజా మాంసం)తో లంచ్ అరెంజ్ చేసింది. భ‌లే మంచి `కాస్ట్‌లీ` బేరం అనుకుంటూ… ఛానెల‌మ్మ‌లు, ఛాన‌ల‌య్య‌లు ప‌రుగో ప‌రుగు.
ఇక్క‌డే రివ‌ర్స్‌గేర్ మొద‌లైంది. క్ల‌యిమాక్స్ ముందే చూపించిన‌ట్టు….. ఓపెనింగ్ షాట్ క్ల‌యిమాక్స్‌లో వ‌చ్చిన‌ట్టు `అటుఇటు` అయింది.
* * *
ప్రొడ్యూస‌ర్ నెత్తిమీద ఉన్న `గుడ్డ‌` అన‌బ‌డే క‌ర్చీఫ్‌ని మొహానికి అద్దుకుంటూ ` మైకందుకొని…. నేనింత వ‌ర‌కు ఇలాంటి చంఢాల‌మైన సినిమా తీయ‌లేదు. మా యూనిటోల్ల‌ని నాకే ప‌రేషాన్…..ఒక్క‌నా…. ( ఓ సెన్సార్ ప‌దం ఉప‌యోగించి ) స‌హ‌క‌రించ‌లేదు. హీరోయిన్‌కి ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారా ?, రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారా ? పేక‌ప్ చేబుతారా ? నా బాయ్‌ఫ్రెండ్‌కి రూం బుక్ చేసారా ? అంటూ స‌తాయింపు
వెంట‌నే హీరోయిన్ కొర‌కొర చూసింది.
“ తెలుగులో ఒక్క ప‌దం అర్థ‌మైతే ఒట్టు…..ఎక్స్‌పోజ్ అన‌గానే రెడీ…. హిందీలో ఇంగ్లీష్ మిక్స్ చేసి, త‌మిళాన్ని తాళింపు వేసి ఏదో ఒక‌టి గొణుక్కుంటే అదే షాట్‌, వ‌న్‌మోర్ టేక్ లేకుండా చచ్చిన‌ట్టు ఒకే చేశాం. డ‌బ్బింగ్‌లో క‌వ‌ర్ చేయ‌లేక, మా బ‌డ్జెట్ చినిగి చేటంత అయింది“ ప్రొడ్యూసర్ చెప్పాడు.
వెంట‌నే హీరోయిన్ మైక్ లాక్కొని “ బ‌హుత్ అబ‌ద్దం హై…. ఫ్రాడ్ హై… ద‌ట్ ప్రొడ్యూస‌ర్ బాయ్ వేరీ బ్యాడ్‌…ఫ‌యిట్‌కు అని చెప్పి, ట్రైన్‌కు `టికెట్` బుక్ చేశాడు. హై……రెమ్యూన‌రేష‌న్ స‌గం ఎగ్గొట్టాడు హై “ వ‌ర‌గ‌స్తూ చెప్పి, డైరెక్ట‌ర్ వైపు చూసి “ ద‌ట్ డైరెక్ట‌ర్ ఎక్స్‌పోజ్ అంటూ ఎప్పుడూ చొంగ కార్చడం హై…… హీరో వేధించాడు హై….. నేను ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌కు పిర్యాదు చేస్తాను హై…. బ‌హుత్ చెత్త సినిమి హై…..“ అంటూ రిలాక్స‌యింది.
హీరో లేచి పెట్టుడు మీసం తీసేసి “ స‌బ్జెక్ట్ చెప్ప‌కుండా మోసం చేశారు. ఏం తీసారో…. నేనేం చేశానో నాకే తెలియ‌దు…. నా లైఫ్‌లో ఇంత వ‌రస్ట్ సినిమా ఫ‌స్ట్ టైమ్ చేశాను. మీరు చూసి చెప్పండి. ఎంత చెత్త సిన్మానో… అంటూ చంకలు గుద్దుకొని కూచున్నాడు.
అప్పుడు లేచాడు డైరెక్ట‌ర్‌ “ ప్చ్‌…. ప్రొడ్యూస‌ర్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డ్డాడు. సిమ్లాలో తీద్దామంటే నాలుగు ఐస్ గ‌డ్డ‌ల‌ను మార్చురీలో నుంచి సెకండ్ హ్యాండ్‌కు కొనుక్కొచ్చి ఘాట్ చేయ‌మ‌న్నాడు. హీరోకు షూస్ లేవు….. సాక్స్‌తో అడ్జ‌స్ట‌య్యాడు. మూడు, నాలుగు, ఎనిమిది, ప‌న్నెండు రీళ్ళ‌లో మీకే తెలుస్తుంది.
అబ్బో……. హీరోయిన్ అయితే…..చ‌చ్చాం….. `నువ్వు నాకు న‌చ్చావు` అని డైలాగ్ చెప్ప‌మంటే… “నువు నాకు నాకితే చ‌చ్చావు“ అంటుంది. టేకు మీద టేకులు మా పాట్లు ఎవరికి చెప్పుకోవాలి. ఇలాంటి చెత్త క‌థ ఇంత‌వ‌ర‌కు క‌న‌లేదు, విన‌లేదు అని చెప్పి శాంతించాడు డైరెక్ట‌ర్‌
* * *
టీవీ చానెల్స్ వాళ్లు మొహాల్లో బ్ల‌డ్ డ్రాప్స్. లైవ్ చూస్తోన్న జ‌నంలో క‌ల‌క‌లం. వెంట‌నే టీవీలో మూడున్న‌ర పావు……. ఈ చెత్త సినిమా మీద మీ అభిప్రాయం మాకు య‌స్ఎంయ‌స్ చేయండి అంటూ స్క్రోలింగ్ వ‌చ్చేసింది. టీవీ ప‌ద్దెనిమిదిన్న‌ర రంగంలోకి దిగి థ‌ర్టీన్ మినిట్స్ పొగ్రాం మొద‌లెట్టింది. రెగ్యూల‌ర్‌గా వ‌చ్చే దాన‌య్యాలు, దాయ‌మ్మ‌ల‌తో ఫెస్ టూ ఫెస్‌.
చెత్త సిన్మాలు ఎన్ని ర‌కాలు… ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన చెత్త సిన్మాలు ఎన్ని…. చెత్త సిన్మాల‌కు ఏయే దేశాలు ఉత్త‌మ చిత్రం అవార్డు ఇస్తుంది. అంటూ చెత్త చెత్త డిటైల్స్‌తో ఊద‌ర‌గొట్టారు.
అప్ప‌టికూ ఇంటర్వల్ అయింది. కొంద‌రు రంగంలోకి దిగారు.
“ సినిమా ఎలా ఉంది ? “ అని యాంక‌ర‌మ్మ అడిగింది.
“ ఫ్లాప్‌……“ అన్నారొక‌రు.
“ చెత్త‌……..“ మ‌రొక‌రు.
“ ఫ‌ట్‌………“ ఇంకొక‌రు
ఇలా సాగాయి కామెంట్స్. తెలుగు టీవీ ప్రేక్ష‌కుల చ‌రిత్ర‌లో ఇలా ఓ సినిమా గురించి రానందున ప్రేక్ష‌కుల‌కు, ప్రేక్ష‌క‌య్య‌ల‌కు క్యూరియాసిటీ పెరిగింది.
అప్ప‌టికే ప్రొడ్యూస‌ర్ “ తొక్కేం కాదు…….“సినిమా గురించే టాక్‌..
* * *
అప్ప‌టికే రీళ్ళ‌ను డబ్బాల్లోకి ఎక్కించి, చెత్త బుట్ట‌లోకి ఎక్కించాల్సిన సినిమా రీళ్ల డబ్బాలు ఒక్క‌సారిగా ఒళ్లు విరుచుకున్నాయి.
“ ఇంత చెత్త సినిమా ఎలా ఉంటుందో చూద్దామ‌ని వచ్చే జ‌నంతో మ్యాట్నీ ఆట స‌గం హాల్ నిండితే, మొద‌టి ఆట ముప్పావు…. రెండో ఆట ఫుల్‌….
రెండో రోజు జ‌నం వ‌చ్చారు. మూడో రోజు హౌస్ ఫుల్‌…. ఈ లోగా ఓ ప‌త్రిక ప్ర‌క‌ట‌న‌…. ఫ్లాఫైన మూడ‌వ రోజు సినిమా తొక్కేం కాదు…. ప్ర‌క‌ట‌న‌. ద‌య‌చేసి ఇలాంటి చెత్త సినిమా చూడొద్దంటూ అండ‌ర్‌లైన్ సెంటెన్స్‌.
` ఎంత చెత్త సినిమా అంటే…. మా చెత్త సినిమా ` తొక్కేం కాదూ` గురించి ఒక్క వాక్యంలో రాసి మేమిచ్చే `చెత్త` బ‌హుమ‌తి అందుకొండి అంటూ టీవీ ప్ర‌క‌ట‌న‌లు.
అంతే…వీక్‌లోగా `వ‌న్‌వీక్‌` కూడా ఆడ‌ద‌న్న వీకెస్ట్ సినిమా. మొద‌టి వీక్ నుంచి హండ్రెడ్ వీక్స్ వ‌ర‌కు దూసుకెళ్లింది. చెత్త సినిమాను చూడ‌ల‌నుకునే జ‌నం ఎక్క‌వ‌య్యారు. నెగిటివ్ ప‌బ్లిసిటీనా….మ‌జాకా…..
* * *
తొక్కేం కాదు….సినిమా వంద‌వ వారం ఉత్స‌వాలు మొద‌ల‌య్యాయి. ప్రెస్ వాళ్ల‌ను పిలిచారు. ప్రొడ్యూస‌ర్ కారులో బ‌య‌ల్దేరాడు.
సరిగ్గా అప్పుడే ప్రొడ్యూస‌ర్‌కి యాక్సిడెంట‌యింది. మోకాల్లో ఉన్న మొద‌డుకు డామేజీ అయింది. అయినా అలానే ఆ ప్రెస్‌మీట్‌కు వ‌చ్చాడు.
* * *
డియ‌ర్ ఫ్రెండ్స్‌….!
చెత్త సినిమా అని మేము నెత్తి నోరూ కొట్టుకొని చెప్పినా… మా సినిమాను హిట్ చేసినందుకు థ్యాంక్స్‌. నిజానికి మా సినిమా చెత్త సినిమానే. చెత్త సినిమాను కూడా హిట్ హండ్రెడ్ డేస్‌….ప‌క్కా అని ప‌బ్లిసిటీ యిచ్చుకొని, స‌క్సెస్‌ మీట్స్ పెట్టుకొని, ప్లాప్ అయినా…. సినిమా తాలుకూ అప్పుల‌ను నెత్తిమీదేసుకొని బాధ‌ప‌డ్డం క‌న్నా… నెగిటివ్ ప‌బ్లిసిటితో… వెళ్దామ‌ని, మేమంతా ప్లాన్ చేసి చెత్త సినిమా పబ్లిసిటీ చేశాం. అందుకు మమ్మ‌ల్ని క్ష‌మించాలి. నిజంగానే మాది చెత్త సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *