May 6, 2024

అశ్వమేధము

రచన: ఇందిరా గుమ్ములూరి

aswamedhamu
పురాణవైరగ్రంధమాలలో ‘అశ్వమేధము’ అరవ నవల. దీని రచనకాలం 1960 . దీనిని శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెపుతూ ఉంటె శ్రీ జువ్వాడి గుతమరావుగారు లిపి బద్ధం చేసారు.
మౌర్య వంశ పతనం, శుంగ వంశ పాలనారంభం ఇతివృత్తంగా కలిగిన నవల ఇది. మౌర్య వంశజులలో చివరి రాజు బృహద్రథుడు. యీతని సేనాని పుష్యమిత్రుడు శుంగ వంశుజుడు. బృహద్రథుడు వ్యసనపరుడై రాజ్యపలనని నిర్లక్ష్యం చేసి, ప్రజలందరికీ అనిష్టుడైయ్యాడు. అపుడు అతని సేనాని అయిన పుష్యమిత్రుడు బృహద్రథుని సంహరించి మగధకు చక్రవర్తి, చక్రవర్తి స్వీకరానంతరం అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. ఈ శుంగ వంశంలో పుష్యమిత్రుడే కాక అగ్నిమిత్రుడు, వసుమిత్రుడు, సుజేష్టుడు, భద్రకుడు, పులిందకుడు, గోష్వాసువు, వజ్రమిత్రుడు, భాగవంతుడు, దేవభూతి అనువారలు మఫదను పాలిచారు. క్రీ. పూ. 1218 నుండి 918 వరకు మూడువందల సంవత్సరాలు వీరి పాలనాకాలం . వీరి అనంతరం మగధ కాణ్వ వంశస్థుల పరమౌతుందని మత్స్య పురాణం తెలుపుతుంది

కాళిదాసు విరచిత ‘మాళకాగ్నిమిత్రం’ నాటకంలో కుమారా వసుమిత్రుడు అంటే పుష్యమిత్రుని మనవడు తాతగారి మేధీయాశ్వాన్ని వెంట చని శకయవనుల పారద్రోలి యజ్ఞాన్ని పరిసమాప్తి కావించినట్లుంది. . కాని విశ్వనాథ వారు అగ్నిమిత్రుని చేతనే యవనులను పారద్రోలించి, మేధీయాశ్వాన్ని యజ్ఞ వాటికకు తరలించినట్టుగా మలచారు. కాళిదాసు అగ్నిమిత్రుడు శృంగార నాయకుడు, దక్షిణ నాయకుడు రాజకార్యలను మంత్రుల భుజస్కంధాలపై ఉంచి తను వినోదాలలో కాలం గడిపినట్లుగా విశ్వనాథులవారు అగ్నిమిత్రుని చేత ఉదాత్తమైన కార్యనిర్వహణ కావిన్చినట్లు మలచి అతని పాత్రకు న్యాయం కావించి భావిష్యత్రాజుగా నిలిపారు.

చారిత్రాక పుష్యమిత్రునిలో దోషం ప్రథమం, దితీయం గుణం, రాజవధ దోషం అతనిలో ఉంది. అయితే నవలానాయకుడైన పుష్యమిత్రుడు ఉదాత్త చరితుడు. వేదధర్మానుష్టాన శీలుడు, పరమ ధార్మికుడు. వృద్ధ రాజైన బృహద్రథుడు సురాపానమత్తుడు. దుష్ట ప్రకృతులకు సులభుడు. తత్కారణంగా రాజ్యం వహిస్తున్నది పుష్యమిత్రుదేమో అన్నట్లు రాజ్యనిర్వాహన సాగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనగా రచయితా కథను మలచి పాఠకునకు పుష్యమిత్రుని పట్ల సానుభూతి వెలయింప చేసారు. ఆ పాపప్రశామనార్థం అశ్వమేధం కావింపించి నవలానామానికి సౌకార్యార్థం కల్పించారు.

‘అశ్వమేధం’ నవలలో కథానాయకుడు పుష్యమిత్రుడు. ఈతడు శుంగ వంశాజుడు. మౌర్య వంశజుడైన బృహద్రథుని మహాసేనాని. ఈతని మేనల్లుడు సోమశర్మ. మౌర్యసైన్యంలో పనిచేసే ఒక సామాన్య ఉద్యోగి. సోమశర్మ తన మేనమామ పంపిన ఒక రాజ్యకార్య నిర్వహణార్థం యవన దేశం సరిహద్దు ప్రాంతాలకు వెళుతూ మేనమామకు తెలియకుండా అతని అశ్వాన్ని అధిరోహించి అక్కడ యవనులకు పట్టుబడి వారు పెట్టిన చిత్రహింసలకి చిక్కి శాల్యావశిష్టుడౌతాడు . అశ్వం వారికి చిక్కి, వారివద్ద బందీ అయి వారిచేతిలోనే హతమవటమే కాకా వారికి ఆహారమౌతుంది. దీనతటికీ ప్రత్యేక్ష సాక్షి అయిన సోమశర్మ తిరిగి మగధకు పోనియ్యక యవన దేశమందే ఉండి తనకూ ఆశ్వానికి జరిగిన ఘాతుకానికి ప్రతీకారం తీర్చుకోవాలని యవన సేనాని అయిన ఠిమ్ఠాకరాళుని తన జ్యితిష్య విద్యా వైదుష్యంతో మెప్పించి అతని ఇంట ప్రవేశం సంపాదిస్తాడు.
మహారాజు బృహద్రథుడు శతాధిక వ్రుద్దుడైనప్పటి కీ, స్త్రీలోలుడై రాజ్య వ్యవహారాలని సేనాని పుష్యమిత్రుని భుజస్కందాలపై ఉంచి రాజ్యపాలనని అలక్ష్యం చేయగా , ప్రజలకి అతని పట్ల అయిష్టత ప్రబలుతుంది. రాజుకు వుద్దాప్యంలో రాజుని వివాహమాడిన కుమద్వాటికి పుష్యమిత్రుని పట్ల అపారమైన విశ్వాసం. రాజబంధువులైన శాతానిక శ్వేతాశ్వులు రాజ్యాన్ని పహరంచాలని నిత్యం కుట్రలు పన్నుతూ ఉంటారు .

పుష్యమిత్రుని తన మేనల్లుని కోసం , తన అశ్వం కోసం వేదికించి విఫలుడౌతాడు. బౌద్ధుల వల్ల ఉపద్రవాలు ఆందోళనకరంగా వీఉన్న వైదిక మాట పరిస్థితికి తోడూ వీరి అదృశ్యం పుష్యమిత్రునికి వ్యథను కలుకచేస్తాయి . ప్రతి సంవత్సరం జరిగే శాస్త్ర పండిత సమావేశాల్లో పై మూడు విషయాలు చర్చకు వస్తాయి. ఈ పండిత సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం గల నారాయణ భట్టనే పండితుడు ముందు సభలకి వచ్చినపుడే పుష్యమిత్రుని అశ్వం సంవత్సరం లోపల క్రూరంగా మరణిస్తుందని , దాని కవలాశ్వమందు స్వర్గ లోక వాసి అయిన జీవుడు ఉన్నాడని చేపుఆడు. పుష్యమిత్రుని పండిత సభకు విచ్చేసిన నారాయణ భట్టుని పిలిపించి దేశం గురించి తన మేనల్లుని గురించి ప్రశ్నించగా సోమశర్మ మరల మగధకు రావాడం అసంభవమని , అతని గుర్రం సంహితమైందని దాని కవలాశ్వం మేదీయాశ్వం అవుతుందని పలుకుతాడు .
సింహపుర కటక, ఉరగ, ఉత్తర , జ్యోతిష, అభిసార దేశాలు పంచయవన దేశాలుగా ప్రసిద్ధాలు. ఇవి ఎత్తైన కొండల నడుమ ఉన్నాయి. ఈ కొండల మధ్య ఉన్న నీటిపడియలే అక్కడ జీవులకు జలాధారం. ఈ జల సంగ్రహణ నిమిత్తమై అక్కడ యుద్ధాలు సంభవించటం కూడా కద్దు. ఇటువంటి జలకుండ సమీప ప్రాంతంలో దుర్భేధ్యమైన కొండల మధ్య ఒక గుహలో మృషా సిద్ధాంతంతో నిత్యజీవిగా పరిగణితుడే ఒక జఠాధారై నివసిస్తుంటాడు. ఈతనికి వంశ పరంపరానుగతంగా వచ్చిన విద్య జ్యోతిష్యం. కొండలపై పడిన యవనులకి అనుకూలంగా ఉన్న సమయాలని చెపుతూ ఉంటాడు . ఈతని పేరు వెలియోనసు. ఈ వెలియోనసు తండ్రి పేరు కూడా వెలియోనసే.

ఈ రాజ్య ప్రతినిదులకి ఈతని మధ్యవర్తిత్వం నేర్పేవాడే ఠిమ్ఠాకరాళుడు. ఈ వెలియోనసు నిత్య జీవన రహస్యాన్ని రక్షించటం, వంశాపరపరాప్రాప్తమైన ఈతని సంతానానికి భార్యను సంపాదించి పెట్టడం ఠిమ్ఠాకరాళుని ఉద్యోగ ధర్మాలు. వెలియోనసు ఒక్కడే అని అందరినీ నమ్మించి అక్కడి రాజులపై ఓకే విధమైన ఆధిపత్యం ప్రదర్శిస్తాడు ఠిమ్ఠాకరాళుడు. పంచయవన రాజులు తమ మంత్రి సేనానిలతో ఒకే మారు వేలియోనసు దర్శింప సమకట్టగా , వాని రహస్యాన్ని , తన రహస్యాన్ని రక్షించుకొనటానికి ఠిమ్ఠాకరాళుడు తప్పని పరిస్థితులలో సోమశర్మను వార్తాహునిగా పంపవలసి వస్తుంది. సోమశర్మ తన ఉపాస్య దేవత వృద్ధ భార్గవి కరుణా విలసనంతో ఆ గుహను చేరి, సర్వాన్ని అవగతం చేసుకుని ఠిమ్ఠాకరాళుని సందేశాన్ని వెలియోనసుకి అందజేస్తాడు.
గిరివ్రజంలో పండిత సభలు ముగుస్తాయి . వేదం మతానికి అనుకూల సమయం ఆసన్నమైందనీ దానికి పుష్యమిత్రుడే ప్రారంభకుడనీ అతడు ప్రభువైన బృహద్రథుని ఆపద నుంచి రక్షించే ప్రయత్నంలో సంహరిస్తాడనీ తద్వధ పాపాశమనార్థం పుష్యమిత్రుడు అశ్వమేధ యాగం ఆచరిస్తాడనీ ఈ సభల సారాంశం. యవన దేశమునందున్న సోమశర్మే ఇదే విషయాన్ని లేఖల రూపాన తెలియ బరుస్తాడు. కార్తిక పౌర్ణమి నాడు రాజ వధ జరుగుతుందనీ పుష్యమిత్రుడు ఆత్మా రక్షణార్థం చర్యలు గైకొనవలసి ఉంటుందని పుష్యమిత్రుడు అనుకోని పరిస్థితుల్లో బృహద్రథుని వధిస్తాడనీ మొదటి లేఖ సారాంశం. కుమారా అగ్నిమిత్రుడు మేదీయాశ్వం వెంట పంపుమని యజమాని దీక్షలో ఉన్నంత కాలం నారాయణ భట్టు రాజ్యనిర్వాహన కావిన్చాలనేదే రెండవ లేఖ సారాంశం.

పౌర్ణమినాడు పుష్యమిత్రుడు బృహద్రథుని దర్శనార్థం సర్వతో భద్రంగా సకవచధారుడై వెళతాడు. సర్వసురాపనాల విషయాలను బృహద్రథుడు పుష్యమిత్రుని తెలియచేసే సందర్భంలో కుముద్వతి, శతానీకాదులు వారి వెన్నంటే ఉన్నారు. ఒకానొక గది సమీపానికి వచ్చిన సమయంలో వారిని వెన్నంటే వస్తున్న కుముదవతి తన అన్నైన శతానీకుడు మహారాజుపైన మహాసేనానిపైన జరుపబోయే కుట్రను వెల్లడిస్తుంది ఈ సమయంలో తననుతాను రక్షించుకునే ప్రయత్నంలో శతానీకుడు కుముదవతి పై మిథ్యారోపణ చేస్తాడు. ఆ సమయాన జరిగిన కలహంలో శతానీకుని పుష్యమిత్రుడు సంహరిస్తాడు. మిథ్యారోపణను నమ్మి మహారాజు కుముద్వాతిని సంహరింపబోగా మహారాజు పుష్యమిత్రుని చేతిలో హతమౌతాడు. కుముద్వతి పర్భుత్వోడుగుల సమక్షంలో శతానీకాదుల దౌష్టాన్ని, పుష్యమిత్రుని నిర్దోషిత్వాన్ని వెల్లడించి, పుష్యమిత్రునికి రాజ్యాన్ని అప్పగించి తానూ బౌద్ధ సన్యాసిని అయిపోతుంది.

సోమశర్మ మూడవ నాలుగవ లేఖననుసరించి పుష్యమిత్రుడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలని సంకల్పించి సంవత్సర కాలం జరిగే ఈ యాగా నిర్వహణ సమయంలో మేధావి భట్టు అనే కాశ్మీర బ్రాహ్మణుని ప్రధాన బ్రుత్విక్కు గాను, రాజ్య నిర్వహణ భారాన్ని మోయటానికి నారాయణ భట్టుని నియమిస్తాడు. రాజు జగ్నదీక్షను పొంది మేధీయాశ్వం వెంట కుమారా అగ్నిమిత్రుని సేనాని ఉపవర్శిని పంపుతాడు.

సోమశర్మ పూర్తిగా యవనుడై పుస్ మిరత్ ఫా కినోజ్ , మిరత్ ఫా అనే నామాన్తరాలని పొందుతాడు. యవన రాజు పరిషత్సభ్యులు వెలియోనసు గుహని దర్శిస్తారు. వెలియోనసుల మృషాజీవితాన్ని దానికి హేతువైన ఠిమ్ఠాకరాళుని భార్య అయేషా సోమశర్మ భార్యకాగా ఠిమ్ఠాకరాళుని పిల్లలు సోమశర్మ పిల్లలౌతారు. సోమశర్మ లేక మిరత్ ఫా పంచయవానాలకి రాజవుతాడు.

పుష్యమిత్రుడు యజ్ఞం ఆరంభిస్తాడు. సేనాని ఉపవర్షుడు, కుమార అగ్నిమిత్రుడు వెంటచనగా
మేధీయాశ్వం యవనదేశాలను ప్రవేశిస్తుంది. యవనముష్కరులపై ప్రతీకార చర్యలకు మిర్తఫా సర్వం సిద్ధం చేస్తాడు. అయేషా తన మంత్రం తంత్రాలను సంపూటీకరించి మ్లేచ్ఛ రాగంలో ఒక పాటను ఎత్తుకుంటుంది. ఆ గానం లోని మంత్రం జంతువుల కాళ్ళను తాటింప చేసే శక్తిగలది. పుష్యమిత్రుని గుర్రాన్ని ఎవరు ఎక్కడ హింసించి సంహరించారో అదే ప్రదేశంలో ఆ మేధీయాశ్వం ఆ క్రూరాలను తన పాద తాడనంతో మంతబలం సంహరిస్తుంది. అందరూ సంహరితమయ్యే వరకు అయేషా పాట ఆగాడు. అశ్వాన్ని ప్రీతి పురస్సరంగా ఉపవర్షునకు అందిస్తారు. యవన ప్రభువు దర్శనం ఎవరికీ లభించదు.

******************

1 thought on “అశ్వమేధము

  1. too many typos. Hard to read.
    People like me eagerly wait for the column on purana vairagrandh amaala.
    editors should take a note on this.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *