June 14, 2024

కలర్స్

రచన: స్వప్న పేరి “”దయచేసి వినండి , సికింద్రాబాదు నుంచి గుంటూరు వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్ మరి కొద్దిపట్లో ప్లాట్ఫోర్మ్ నుంబరు 5 పైకి వచ్చును”” సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే రద్దీ గా ఉంది. సాయంకాలం సమయం. అటు వెళ్ళే జనాలు , ఇటు వెళ్ళే జనాలు. నరహరి , తన భార్య తులసి , వాళ్ళ అబ్బాయి కిరణ్ , ముగ్గురు గుంటూరు దగ్గర ఉన్న మంగళగిరిలో ఉంటారు. నరహరి అక్కడే కొబ్బరికాయల వ్యాపారం […]

మాలిక పత్రిక డిసెంబర్ 2016 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Headప్రియమైన పాఠకులకు, రచయితలకందరికీ నమస్కారాలు, రాబోయే కొత్త సంవత్సరానికి అభినందనలు.. డిసెంబర్ అనగానే మాకు, మీకు, అందరికీ ఇష్టమైన పుస్తకాల పండగ మన హైదరాబాదుకు రాబోతుందని తెలుసుగా. మరి మీ  పుస్తకాల లిస్టు, డబ్బులతో తయారుగా ఉన్నారా.. అనివార్య కారణాలవల్ల కాస్త ఆలస్యంగా వెలుగు చూస్తున్న మాలిక పత్రికలో ఈసారి ప్రమదాక్షరి కథామాలిక శీర్షికన స్నేహం పేరిట వచ్చిన కథలను  ప్రచురించడం జరుగుతోంది. ఇంకా మీ ప్రియమైన కథలు, కవితలు, […]

యే దోస్తీ హమ్ నహీ చోడెంగే – ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మణి వడ్లమాని “హే స్వాతీ ! నా హెయిర్ స్తైల్ ఎలా ఉంది” అంది స్వప్న “బావుంది కాని కాస్త లూజ్ చెయ్యి” అంది స్వాతి. అలాగే ఇంకా ఏవేవో టిప్స్ అడుగుతూ ఉంది. స్వాతి చెబుతూనే ఉంది. ఆ విధంగా అరగంట గడిచింది. అంతలో ఏమయిందో ఏమో ఆల్ ఆఫ్ సడన్ “ ఏమి బాగా లేదు. నేను నాలానే లేను అసలు ఇంత అగ్లీగా చేసావో అందరూ నన్ను పిచ్చిది అనుకుంటారు పార్టీ […]

మూడంతస్తులు ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన:ఆదూరి హైమవతి   “ఏరా ! రాఘవ్ ! ఎవడు వాడు? ” ” మా క్లాస్ మేట్ నాన్నా! అన్నిట్లో ఫస్ట్ ! నా బెస్ట్ ఫ్రెండ్ !. వాసయ్య, ” ” ఏంటీ వాసయ్యా! ఏంట్రా ఎవర్నంటే వాళ్ళని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నావ్!” ” డైనింగ్ టేబుల్ మీద కాదు నాన్నా! కుర్చీల మీదేగా మేమిద్దరం కూర్చున్నాం! ” “చాల్లే జోకులు, ఆ డైనింగ్ టేబుల్ ఖరీదెంతో తెల్సా? ” ” ఎంతైతేనేం? […]

స్నేహ బంధం ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మాలతి దేచిరాజు మనిషి స్వార్ధ పరుడు., , కానీ నాకెందుకోఅలా అనిపించదు. ఎవడి బ్రతుకు వాడు బ్రతకడానికి ప్రయత్నిస్తాడు ఇందులో స్వార్ధమేముంది., !మనకు అవసరానికి ఉపయోగపడనంత మాత్రాన స్వార్ధపరుడేనా., ? కానీ., మన దగ్గర సహాయం పొంది మనకు అవసరమున్నప్పుడు సహాయపడకపోతె అది స్వార్ధమే కదా., ! కేవలం తమ అవసరాలకి అక్కున చేరే వాళ్ళని స్వార్ధపరులే అనాలి మరి., అని అనుకుంటూ అచేతనమైన చూపుతో ఆకాశం వైపు చూస్తున్న “రవి” కళ్ళకి అప్పుడే ఒక […]

గుండెకీ గుబులెందుకు! ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మాలాకుమార్ “అదేమిటి అట్లా కూర్చున్నావు?” బాత్ రూం నుంచి వస్తూ, మంచం మధ్యలో గడ్డం కింద చేయి పెట్టుకొని మూడీగా కూర్చున్న సుజాతను అడిగాడు అర్జున్. అతని ప్రశ్నను పట్టించుకోకుండా “పాపం మీకు మీ నాన్న అన్యాయం చేసారు కదూ ?”విచారంగా అంది సుజాత. “మా నాన్న నాకేమి అన్యాయం చేసాడు? పొద్దున్నే లేవగానే నీకా అనుమానం ఎందుకు వచ్చింది?”అడిగాడు అర్జున్. “మీ అన్నయ్యకేమో తెలివిగల, పనిమంతురాలైన అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసారు.అందరూ ఆమె తెలివితేటలని మెచ్చుకుంటున్నారా […]

‘బెస్ట్ ఫ్రెండ్’ ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: నండూరి సుందరీ నాగమణి “ఈ మధ్య నీకు మరీ చిరాకు ఎక్కువ అవుతోంది…ఏమైంది నీకు? వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువైనట్టుంది…” నా ముఖంలోకి చూస్తూ చెప్పింది లహరి. నన్ను నేను నియంత్రించుకుంటూ, “సారీ లహరీ…” అని చెప్పాను. ఈ రోజు లహరి చేసిన ఉప్మాలో పొరపాటుగా ఉప్పు ఎక్కువైపోయింది… ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నపుడు మూడ్ ఆఫ్ అయితే ఇక రోజంతా అంతే… అందుకే ఆమెపై కోపంగా అరిచిన నాకు గిల్టీగా అనిపించింది. “సుజిత్, నాకు […]

Gausips – ఎగిసే కెరటాలు-8

రచన: శ్రీసత్య గౌతమి తెల్లారింది. అమెరికా కూడా నిద్ర లేచింది. రాకేష్ ఎప్పుడో లేచిపోయి తయారయ్యి ఆఫీస్ కి బయలుదేరడానికి రెడీగా ఉన్నాడు. ఈ లోపుల కాఫీ కలుపుకొని తాగుతూ టీ.వి, పెట్టుకొని వెదర్ చానల్ చూస్తున్నాడు. అప్పుడు లేచింది సింథియా. “ఆర్ యూ రెడీ టు గో?” సింథియా ప్రశ్న. “యెస్” “నన్నేం చెయ్యమంటావ్?” “నీ యిష్టం. కాఫీ చేసుకుంటావో లేక డంకెన్ డోనట్స్ కి వెళ్తావో”. “నువ్వక్కడినుండి కాఫీ తెచ్చుకున్నావా? మరి నాకూ తేలేదేం?” […]

బ్రహ్మలిఖితం – 3

రచన: మన్నెం శారద కార్తికేయన్ గత మూడు రోజులుగా అవిశ్రాంతంగా తాగుతున్నాడు. నిజానికతనిదివరకెప్పుడు మందు ముట్టలేదు. సిగరెట్టు కూడా తాగే వ్యసనం లేదు. అసలతనికి అలాంటి దురలవాట్లు చేసుకునేంత తీరిక కూడా లేదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒకే ధ్యేయంతో, ఒకే లక్ష్యంతో గడిపేడతను. ఎపుడైనా అతని ఆశయాల్ని రెచ్చగొడుతూ నిద్ర కమ్ముకునొస్తే అందులో కూడా అతను మృత్యువు వెంబడించి పరిగెడుతున్నట్లుగానో, మృత్యునివారణకి మందు కనిపెట్టినందుకు తనని యావత్ ప్రప్రంచం కొనియాడుతున్నట్లుగానో కలలొచ్చేవి. ఉలిక్కిపడి లేచిపోయేవాడతను. అంతులేని […]

శుభోదయం – 10

రచన: డి.కామేశ్వరి “భయపడకు అమ్మా! నాకేం అవలేదు. నిక్షేపంలా వున్నాను ఆ సంగతి విని. నా రంగులాగే నా చర్మం దళసరి. ఏమీ అవదులే” అన్నాదు కులాసాగా. రాధ నిట్టూర్చింది. “రాధా… నీ నిట్టూర్పులు యింక మానేయి. జరగవలసిందంతా జరిగింది. ఇప్పుడింక దేనికి భయం. ఆ మాధవ్ కూతురికలా జరిగింది. తనకి జరిగిన అవమానం, శిక్ష నీకు తెల్సిందన్న దుగ్ధతో అలా అన్నాడు. యిన్నేళ్ళ తరువాత నిన్ను చూడడం. ఆ చూడడం అలాంటి సమయంలో జరిగింది కనక […]