May 9, 2024

సహజీవనం (Living Together)

రచన: టీవీయస్. శాస్త్రి

tvs-sastry
నిర్దిష్ట వయో పరిమితి దాటిన ఇద్దరు విద్యార్దులు సహజీవనం (living together ) చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పు పట్టింది. కేరళలోని కొల్లాంలో మార్ తోమ ఇంజీనిరింగ్ కాలేజీలో చదువుతున్న ఛాయామంగళం , ఆమె క్లాస్ మేట్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారు పెద్దలతో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీ యాజమాన్యం వారిని కాలేజీ నుంచి పంపివేసింది. దానిపై ఛాయామంగళం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా వారిని సమర్దించలేదు. పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయి, సహజీవనం చేయదలచినప్పుడు దాని పరిణామాలను కూడా ఎదుర్కోవాలని జడ్జి వినోద్ చంద్రన్ వ్యాఖ్యానించారు. కాలేజీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించలేదు. చట్టబద్దంగా కాని, సంప్రదాయం ప్రకారం కాని వారు పెళ్లి చేసుకోలేదని జడ్జి అబిప్రాయపడ్డారు. అయితే సుప్రింకోర్టు గతంలో సహజీవనాన్ని సమ్మతిస్తూ ఒక తీర్పు ఇచ్చింది.
ఈ నేపధ్యంలో కేరళ హైకోర్టు నిర్ణయం చర్చనీయాంశం అయింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చూద్దాం! If an unmarried couple is living together as husband and wife, then they would be presumed to be legally married and the woman would be eligible to inherit the property after death of her partner, the Supreme Court has ruled. A bench of Justice MY Eqbal and Justice Amitava Roy said
Continuous cohabitation of a couple would raise the presumption of valid marriage and it would be for the opposite party to prove that they were not legally married. “It is well settled that the law presumes
in favour of marriage and against concubinage, when a man and woman have cohabited continuously
for a long time. However, the presumption can be rebutted by leading unimpeachable evidence. A heavy burden lies on a party who seeks to deprive the relationship of legal origin, ” the bench said.
హిందూ వైవాహిక వ్యవస్థలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ! సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఒక ఆస్తి పంపకం విషయంలో అని మాత్రమే అర్ధం చేసుకోవాలని నా అభిప్రాయం! చట్టాలు వేరు, న్యాయాలు వేరు! న్యాయం అనేది సమాజపు కట్టుబాట్లకు , నీతి నియమాలకు లోబడి ఉంటుంది ! కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన అన్నీ న్యాయాలు కావు! సహజీవనంలో లైంగిక సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ! వివాహం అంటే లైంగిక సంబంధమేనా? కానే కాదు– అంతకన్నా ఎక్కువ విలువైనది వివాహబంధం! సహజీవనంలో ఆ బంధానికి అంత పవిత్రత రాదు! అసలు నాకు తెలియక అడుగుతాను! సహజీవనం ఒకరితోనే చేయొచ్చా లేక నచ్చిన ప్రతి వారితో చేయొచ్చా? అదీ ఒకేసారి చేయొచ్చా, విడిపోయిన తర్వాత చేయొచ్చా? సహజీవనం చేసేవారి మధ్య ఏమైనా agreements ఉంటాయా? ఆ ఒప్పందాలకు చట్టబద్ధత ఉందా ? పూర్వం చెన్నైలో చాలామంది సినిమా తారలు(ఇప్పుడు కూడా)ఇలానే సహజీవనం చేసేవారని నేను ఆనాటి పత్రికల్లో చదివాను! THE IMMORAL TRAFFIC (PREVENTION) ACT, 1956 ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అలా సహజీవనం చేసేవారు ఒక friendship agreement ను వ్రాసుకునేవారు!

Indian contact act ప్రకారం friendship contact కు చట్టబద్ధత ఉందని ఒక న్యాయవాది మిత్రుడు చెప్పాడు! ఈ మధ్యనే కమల్ హాసన్ , గౌతమీలు ఇకనుంచీ సహజీవనం చేయమని చెప్పుకున్నారు. ఇంతకాలం వారు చేసిన దాన్ని వ్యభిచారం అని నేను అనటానికి వెనుకాడను. పవన్ కళ్యాణ్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొక నటితో సహజీవనం చేసి ఆమె వలన తండ్రి కూడా అయ్యాడు. ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తల్లి అయిన ఆ నటిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెతో కూడా బంధాలు తెంచుకొని మరొక ఫ్రెంచ్ వనితతో సహజీవనం చేస్తున్నాడు. వీరందరూ సినిమాల్లో, బయట నైతిక విలువలను గురించి చెబుతుంటారు. వీరిని గుడ్డిగా ఆరాధించే అమాయకులు కూడా ఉన్నారు. అలనాటి ప్రముఖ సినీ తార యస్. వరలక్ష్మి తమిళ ప్రముఖ నిర్మాత A. l. శ్రీనివాసన్ తో స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకొని సంతానాన్ని కూడా పొందింది! అయితే ఆయనకు అంతకు ముందే వివాహం అయి మొదటి భార్య ద్వారా సంతానాన్ని కూడా పొందాడు. భర్త అయిన శ్రీనివాసన్ చనిపోయిన తర్వాత అతని ఆస్తిలో యస్. వరలక్ష్మికి చిల్లిగవ్వ రాలేదు! వారిద్దరికీ వివాహం అయినట్లుగా ఆమె చాలా ఫోటోలను, పిల్లల వివాహ శుభలేఖలను , ఇంకా చాలా డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. అయితే ఆ వివాహంలో ‘సప్తపది’ తంతు జరగలేదని, ఇతర కారణాల చేత న్యాయస్థానాలు ఆమె వివాహానికి చట్టబద్ధత కల్పించలేదు! ఆమె జీవిత చరమాంకంలో ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆర్ధిక సహాయంతో ఒక అపార్టుమెంట్లో జీవితాన్ని దుర్భర దారిద్ర్యంతో గడుపుతుంది. అసలు భార్యాభర్తలుగా సహజీవనం చేయదలుచుకున్నవారు చట్టబద్ధంగా వివాహం చేసుకోవటానికి ఏమి అడ్డంకి? సరే ఇప్పుడు ఏ ఒప్పందం లేకుండా మేజర్లు అయినవారు సహజీవనం చేయొచ్చని కొందరి వాదన! అలా వాదించేవారు తమ పిల్లలను అలా ఉండటాన్ని అంగీకరిస్తారా ? హిందూ వైవాహిక చట్టంలో తగిన మార్పులు తీసుకొని రాకుండా సహజీవనానికి చట్టబద్ధత కల్పించవచ్చా? ఒక వేళ ఏదైనా కారణాలతో సహజీవనం చేసేవారు విడిపోతే , వారికి కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి? విదేశాల్లో ఉండే ఈ వికృత సంస్కృతిని మనం దిగుమతి చేసుకోవటం దురదృష్టకరం! అమెరికాలాంటి దేశాల్లో అలా కలిగిన సంతానం ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు! అలా సహజీవనం చేసేవారి మధ్య అన్నా చెల్లెళ్ళ లాంటి సంబంధం ఉంటే దాన్ని కోర్టులు తప్పు పట్టవా? కేవలం వయోపరిమితి దాటి , ఇద్దరి అంగీకారం ఉంటే చాలా? సమాజానికి కొన్ని కట్టుబాట్లు అవసరం! ఆ కట్టుబాట్లు , నీతి నియమాలు లేకపోతే సమాజంలో ఆటవిక ప్రవృత్తి విజృంభిస్తుంది. సహజీవనమే సరైనదైతే ఇక మనుషులకు జంతువులకు తేడా ఏముంది ?

20 thoughts on “సహజీవనం (Living Together)

  1. Saha jeevanam pai chakkani visleshanatmaka rachana.neti samajam lo ee vishayaala valana stree lu ekkuva nasta poyaaru.biddalunte paristiti maree daarunam.ee pokadalu…anusarincha దగినవి కావు.ఇప్పటి కే బంధాలు,అను బంధాలు..కను మారుగయి పోతున్నాయి.ఇక ఈ పోకడలు మనుషుల మధ్య బంధాలను మరింత బ్రష్టు పట్టిస్తాయి.వీటిని మొగ్గ లొనే తుంచటమే మేలు.కలసి బతకా లనుకున్నాక..వివాహం వలన కలిగే భద్రతా ఛత్రం కింద మనుగడ నేటి సమాజం లో అత్యవసరం.నప్పనపుడు విడిపోతానికి ఎన్నో మార్గాలు..వున్నాయి.కనీసం అప్పుడు పిల్లలకి కొన్ని హక్కులు వస్తాయి.ఈ సహజీవనం లో పిల్లల బాధ్యత..హక్కుల విషయం లో ఇంకా ఎన్నో సంస్కరనలు తేవాల్సి వుంది.ఏ కోర్ట్ లు ఎన్ని చెప్పినా..ఏ రకమైన బంధం అయినా తల్లి తండ్రులు మధ్య సరయిన సంబంధం లేని చోట ఆ ప్రభావాలు పిల్ల ల వ్యక్తిత్వాలపైవిపరీత ము గా ఉంటాయి.ధన్య వాదాలు..అభివాదములు సర్

  2. ఈ సహజీవన బంధాలు – బాంధవ్యాలు భారతదేశానికి క్రొత్త ఏమీ కాదు. ఏ వివాహతంతు లేకుండా సహజీవనం చేసిన ఘటన అందరికీ తెలిసిన విశ్వామిత్ర – మేనకల సహజీవనం ద్వారా పుట్టినదే శకుంతల. ఇలా మన పురాణేతిహాసాల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఇక మన అష్టవిధ వివాహాలలో చివరిదైన పైశాచకం (అంటే బలాత్కరించి చెడపటం) కూడా వివాహం క్రిందే జమ కట్టారు. కాలక్రమంలో బుద్ధయుగం తర్వాత పరిణామాలలో శంకరాచార్యుని ప్రవేశం తర్వాత భారతదేశంలో, హిందూమతంలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
    క్రమేణా బహుభార్యత్వం నిరసనలకు గురైనది. అలాగే వివాలలోను అనేక సంస్కరణలు చోటుచేసుకుని సామాజిక మరియు కుటుంబ వ్యవస్థలను పటిష్ట పరచే వైవాహిక బంధాలు అందరి మన్ననలు పొంది ఆచరణాత్మకాలు అయ్యాయి.
    ఇక, ఈ సహజీవనం అన్నది ఆయా సందర్బాలకు, పరిస్థితులకు లోబడి ఉంటాయి. తప్పా/ఒప్పా అని తేలికగా నిర్ణయించెయ్యడం సరికాదని నా అభిప్రాయం. అలాగని బాధ్యతలకు – బంధాలకు తిలోదకాలిచ్చి కేవలం శారీరిక సుఖం, కామాన్నితీర్చుకోవడం కొరకు “సహజీవనం” పేరిట వ్యవహరించండం, తమ క్రియల్ని సరర్ధించుకోవడం సరైన పద్దతి కాదు. సమాజంలో భాగమైన వ్యక్తులకు ఆ సమాజానికి “ఛీడ”గా మాత్రం మారకూడదు.
    సామజిక సమస్యపై మీ విశ్లేషాత్మక వ్యాసం వాస్తవ పరిస్తితులను ఎత్తి చూపుతోంది. ధన్యవాదములు..

  3. సహజీవనము మన సంస్కృతి సంప్రదాయములకు విరుద్ధమైనది.వివాహము,వివాహవ్యవస్ధలోని విశిష్టత తెలియక పోవుటవలన ఇట్టి చర్యలకు పూనుకొనుచున్నారు.

  4. ఈ సహజీవన బంధాలు – బాంధవ్యాలు భారతదేశానికి క్రొత్త ఏమీ కాదు. ఏ వివాహతంతు లేకుండా సహజీవనం చేసిన ఘటన అందరికీ తెలిసిన విశ్వామిత్ర – మేనకల సహజీవనం ద్వారా పుట్టినదే శకుంతల. ఇలా మన పురాణేతిహాసాల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఇక మన అష్టవిధ వివాహాలలో చివరిదైన పైశాచకం (అంటే బలాత్కరించి చెడపటం) కూడా వివాహం క్రిందే జమ కట్టారు. కాలక్రమంలో బుద్ధయుగం తర్వాత పరిణామాలలో శంకరాచార్యుని ప్రవేశం తర్వాత భారతదేశంలో, హిందూమతంలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి.

    క్రమేణా బహుభార్యత్వం నిరసనలకు గరైనది. అలాగే వివాలలోను అనేక సంస్కరణలు చోటుచేసుకుని సామాజిక మరియు కుటుంబ వ్యవస్థలను పటిష్ట పరచే వైవాహిక బంధాలు అందరి మన్ననలు పొంది ఆచరణాత్మకాలు అయ్యాయి.

    ఇక, ఈ సహజీవనం అన్నది ఆయా సందర్బాలకు, పరిస్థితులకు లోబడి ఉంటాయి. తప్పా/ఒప్పా అని తేలికగా నిర్ణయించెయ్యడం సరికాదని నా అభిప్రాయం. అలాగని బాధ్యతలకు – బంధాలకు తిలోదకాలిచ్చి కేవలం శారీరిక సుఖం, కామాన్నితీర్చుకోవడం కొరకు “సహజీవనం” పేరిట వ్యవహరించండం, తమ క్రియల్ని సరర్ధించుకోవడం సరైన పద్దతి కాదు. సమాజంలో భాగమైన వ్యక్తులకు ఆ సమాజానికి “ఛీడ”గా మాత్రం మారకూడదు.

    సామజిక సమస్యపై మీ విశ్లేషాత్మక వ్యాసం వాస్తవ పరిస్తితులను ఎత్తి చూపుతోంది. ధన్యవాదములు..

  5. సహజీవనము మన సంస్కృతి ,సంప్రదాయములకు విరుద్ధమైనది.వివాహము,వివాహవ్యవస్థ ప్రాధాన్యమును సరిగా తెలియక పోవుటవలననే ఇటువంటి చర్యలకు పాల్పడుచున్నారు.

  6. మీరు మంచి విషయమును చక్కగా విశ్లేషణ చేశారు .అభినందనలు.

  7. సమాజ పరిణామం లొ సహజీవన మొక విపరీత ధోరణి . పరిణితి చందని యువత ముఖ్యంగా మహిళలు సహజీవన అనర్థాల ను ఎదుర్కొనే స్తితిలొ ఉన్నారా ? వారికి పుట్టె పిల్లల భవిష్యత్తెమిటి ..?!
    It is a big controversial issue in present society.that affect the life of innocent youth.
    Youth,girls especially ,need to be educated on this issue.Thanks for the topic Sastrigaaru..

  8. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తాను శాస్త్రి గారు. సహజీవనం చేసినంత మాత్రానా భార్మా భర్తల అనుబంధం ఎన్నటికీ రాదు.సహజీవనం వలన నష్టపోయేది, పోతున్నది మహిళలే. వారి నుండే స్పందన రావాలి.

  9. వివాహానికా మన హింందూ మతంం చాలా గౌౌరవాన్ని ఇచ్చింంది ముఖ్యంంగా మహిళలకు రక్షణ కల్ఫింంచింంది యే కార్యానికైైనా భార్య పక్కన వుంండాల్సింందే భార్య కి ఇచ్చే గౌౌరవంం అది భార్య స్ధానానికి వున్న మర్యాద రక్షణ సహజీవనంం లో వున్న స్త్రీ కి వుంండదు దీనికి కోర్ట్ దాకా ఎంందుకు సమాజమే శిక్ష వేస్తుంంది సమాజంం కూడా కాదు మనసాక్షే ఆమెను శిక్షిస్తుంంది ఇది ఏనాటికీ మారనిజీవిత సత్యంం తలితంండ్రులకు పిల్లలంంటే ప్రేమ వున్నంంత కాలంం వివాహవ్యవస్ధ వుంంటుంంది కోర్ట్ ఈవికృృత పోకడలను ఏవో చట్టాల నంంబర్లు చెప్పి సమర్ధింంచినా సమాజంం సమర్ధింంచదు గర్హిస్తుంంది సహజీవనంంచేసేవారికి గౌౌరవంంఇవ్వదు మీవ్యాసాలు చాలా నిజాయితీగా సమాజంంలోని సమస్యలను ఎత్తి చూపిస్తున్నాయి కృృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *