April 26, 2024

గీకు వీరుడు..

రచన: గిరిజారాణి కలవల   గుర్నాధానికి ఉక్రోషం వచ్చేస్తోంది. కడుపులోనుండి తన్నుకుంటూ మరీ వస్తోంది. రాదు మరీ… చుట్టు పక్కల ఎవరిని చూసినా… రయ్ రయ్ మంటూ.. వేలితో తోసుకునే ఫోనులే. అరచెయ్యి సైజు నుండి అరఠావు పుస్తకం సైజులో ఎవరి చేతిలో చూసినా అవే కనపడుతున్నాయి. తను  ఇంకా టిక్కు టిక్కు నొక్కుకునే ఫోనే వాడుతున్నాడు. కొనలేక కాదు.. అదెలా వాడాలో చేతకాక. మూడేళ్ళు నిండని పిల్లలు సైతం. . ఆ తోసుకునే ఫోనులో ఏవో […]

కంభంపాటి కథలు – కారులో షికారుకెళ్లే

రచన: కంభంపాటి రవీంద్ర     “చూసేరా ..మన ఎదురు ఫ్లాట్ లోని ఆనంద్ వాళ్ళావిడికి  కార్  కొన్నాడట”  అప్పుడే తలుపు తీసి లోపలికి వస్తూన్న జగన్నాధ్ తో కుమారి అంది “ఇంట్లోకి వస్తూనే మొదలెట్టేసేవా?.. వెధవ గొడవ .. ఇంటికి రావాలంటేనే భయమేస్తూంది” అంటూ జగన్నాధ్ విసుక్కున్నాడు “ మీకు ఇంటికి రావాలంటే భయమేస్తూంటే , నాకు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తూంది”   బదులిచ్చింది కుమారి “ అంతేలే.. నేను పోతే తప్ప నీకు ప్రశాంతత దొరకదు.. […]

కౌండిన్య హాస్యకథలు – అట్ల దొంగ

రచన: రమేశ్ కలవల   ధీవర .. ప్రసర సౌర్య భార .. అని బ్యాగ్ గ్రౌండ్ లో సాంగ్ వినపడుతోంది. ఎత్తుగా ఉన్న గోడ మీదకు దూకి ఆ ఇంట్లోకి ఇట్లా చొరపడి అట్లా పట్టుకెళ్ళాడు. వచ్చింది ఒక్కడే కానీ వెళ్ళేటప్పుడు నలభై మంది వెళ్ళిన శబ్థం వచ్చింది. అతనే ఆలీబాబా అట్లదొంగ! ప్రతీ సంవత్సరం అట్లతద్ధినాడు మాత్రమే దొంగతనం చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. అసలు చిక్కితేగా అడగటానికి? మొదటి సంవత్సరం భార్యలు […]

ఆఖరి కోరిక

రచన: నిష్కలశ్రీనాథ్ ఎక్కడో దూరంగా మసీదు నుండి ప్రార్ధన మొదయిలైంది . అప్పుడే సుభద్రకి మెలకువ వచ్చింది పక్కన భర్త రాఘవ కనిపించలేదు, బాత్రూంలో వెలుతురు కనిపిస్తుంది. రాత్రి జరిగిన గొడవ గుర్తొచ్చింది సుభద్రకి ‘బహుశా నిద్ర పట్టి ఉండదు లేదంటే ఇంత త్వరగా లేస్తారా ‘ అనుకుని మంచం మీద నుండి లేచింది. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టింది. హాలులో ఉన్న బాత్రూంలోకి వెళ్లి స్నానం ముగించుకుని వచ్చింది . రాఘవ అప్పటికే రెడీ అవుతుండడం […]

విశ్వపుత్రిక వీక్షణం – “మీ…టూ..అమ్మా”

రచన: విజయలక్ష్మీ పండిట్ ఆ రోజు ఆదివారం . రమ ఒకటే హడావుడి చేస్తూంది. భర్త ఆనంద్ కు ఏమి అర్థం కావడం లేదు . “ఏంటి రమ..,సండే అంత బిజీ బిజీగా ఉన్నావు ఎక్కడికెళుతున్నావు “ అని అడిగాడు భర్త ఆనందు. “ఈ రోజు సిటీలో వివిధ మహిళా మండళ్ళ మహిళలు, ఇతర ప్రోగ్రసివ్ ఉమన్ యాక్టివిస్ట్ గ్రూపులు కలిసి “ మీ ..టూ” ర్యాలీ చేస్తున్నామండి.నేను కొన్ని ప్లాకార్డులు వ్రాశాను. వాటిని ఈ కర్రలకు […]

సౌందర్యలహరిలోని ఓ పది శ్లోకాలు!

రచన: శారదా ప్రసాద్ కొంతమంది మిత్రులు, హితులు ‘సౌందర్యలహరి’ నుండి ఒక పది రోజులు పది శ్లోకాలకు, వాటి అర్ధాలు, వివరణలను క్లుప్తంగా చెప్పమని కోరారు. మనం చేయవలసిన పనులు ఇలానే మన వద్దకు వస్తాయి. నా వద్దకు వచ్చిన ఆ ప్రతిపాదనను అమ్మవారి ఆజ్ఞగా, ఆశీస్సుగా తీసుకొని వ్రాయటానికి ఉపక్రమించటానికి ముందుగా, అమ్మను కీర్తించే శక్తిని అమ్మనే ప్రసాదించమని ప్రార్ధించి శ్రీకారం చుట్టాను. నాకు తెలియకుండానే అలా ఒక పది శ్లోకాలకు అర్ధాలను, నాకు తోచిన […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 31

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు, తరించేందుకు ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నది భాగవత పురాణం. భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భారతదేశంలో భక్తి సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడిన ‘భక్తి ఉద్యమం’లో కీర్తనం ఒక ముఖ్య భాగమై నిలిచింది. భరతఖండంలో మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని మన తెలుగునాట అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వరకూ […]