April 26, 2024

ఎందుకంటే….

రచన:అనుపమ పిళ్ళారిసెట్టి.

ఓ చిరాకు….. కంటబడితే
చిన్నగా చేయి విసురు…వెళ్ళిపొమ్మని
కళ్లెర్ర చేసి చూపు….పట్టుదలగా నిలబడితే
వ్యధతో చిన్నగా తిట్టు…పంపించేయాలని…
ఎందుకంటే….వాడు ఓ బికారి!

రోతతో కూడిన చూపు….రాక ఆలస్యం అయినందుకు
మెత్తని మందలింపు…. భయపెట్టేటందుకు
అమరిక గా ఓ ఆజ్ఞ…. పని కానిచ్చేటందుకు
నొప్పించే భాష్యం… స్థానంలో ఉంచాలని
ఎందుకంటే…… అతను ఓ పనివాడు!

ఓ విచారణ….. పనితనం గురించి
ఓ కృత్రిమ దిద్దుబాటు…గౌరవం నిలుపుకోవాలని
విధిగా ఒప్పందం….పనులు పూర్తి కానిమ్మని
ఓ చిన్న మెచ్చుకోలు….ప్రోత్సాహ పరచేందుకు
ఎందుకంటే…..తన ఆధీనంలో ఉన్నాడని!

భయముతో కూడిన చూపు…సమ్మతిస్తారో లేదోనని
మర్యాదతో చిరునవ్వు… ప్రశంస అందుకోవాలని
తృప్తిగా తల వంపు ….క్షమ అందినందుకు
సంజ్ఞతో ఒప్పందం…పదవి సడలదని
ఎందుకంటే….ఆయన అధికారి మరి!

1 thought on “ఎందుకంటే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *