May 31, 2023

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 5

డా.(శ్రీమతి) చాగంటికృష్ణ కుమారి

సూచనలు :
అడ్డము :
1. మనం అద్దంముందు నిలబడినప్పుడు మనపై పడిన కాంతి ప్రాయాణించి అద్దపు దళసరి గాజు గుండా లోని కి ప్రవేశించినపుడు అక్కడి వెండిపూత ఆ కాంతిని మరి లోనికి వెళ్ళనీయక వెనకకు మళ్లిస్తుంది. వెండి పూత మళ్ళించిన కాంతి కిరణం పేరు (9)
5. పూజ చేసేటప్పుడు మొదటగా చెప్పుకొనే కేశవ నామాల లో మూడవది (3) వెనకనుండి ముందుకి.
6. తెలుసుకునేవాడు (2)
7. తుపాను ప్రభావంతో కురుస్తున్నవానలవల్ల — పులి లోనికి ప్రవేశించి మనలను గజగజా వణికిస్తొంది (2) వెనకనుండి ముందుకి.
9. కళ్ళు బాగా ఎర్రబడి నీళ్ళు కారడం, కళ్ళమంటలు, కళ్ళలో పొడుచుకుంటునటువంటి బాధ, సరిగ్గా చూడలేకపోవడం వంటి ముఖ్య లక్షణాలు గల ఒక అంటు వ్యాధి (5)
10. తెలుగు సినిమా రంగం ఒక తమిళ మాతృక ను బట్టి , రెండక్షరాల పేరుపెట్టి తీసిన ఈ తెలుగు అనువాద చిత్రం బాగా ఆడింది (2)
11.రామదాసు తన కీర్తనలద్వారా – – మార్గములో పరమపదమును పొందాడు
12. అందువల్ల (3)
14. పరిసరాలలో హానికర పదార్థాలు ఎక్కువ పరిమాణంలో చేరి , జీవులకు హాని కలిగిస్తుంటే దానిని — అంటారు (9) వెనకనుండి
నిలువు:
1. వేరు వేరు సంద్రతలు గల రెండు పదార్ధాలలో ఒక దాని నుండి వేరొక దానిలోకి కాంతి ప్రసరించినపుడు దాని దిశ మారుతుందికదా! ఆ కాంతి తరంగము (9)
2. రంగు గల ఒకానొక పదార్ధపు గాఢతను అదే పదర్ధము గల ప్రమాణ పదార్ధపు రంగుతో పోల్చి లెక్కకట్టే పరికరం (6) 3. యుధ్ధము (2)
4. మన శరిరాన్ని “ గాలితో నిండిన తోలు సంచి’ అని పోతన్నగారన్నారు. సంచీని తిసేస్తే మిగిలేది (9)
6. గుర్తుంచుకోగల సామర్ధ్యము (5)
8. రంగును కలగచేయు పదార్ధము ( 6) కిందనుండి పైకి
13. ఆలు లేదు – – లేదు కొడుకు పేరు సోమలింగం(2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *