April 26, 2024

కథల వేదిక “గల్పికా తరువు”

సమీక్ష: సరోజన బోయిని

మనసును దోచే చిన్న, చిన్న కథల వేదిక ఈ “గల్పికా తరువు”.

104 మంది రచయితల కథల సమూహమే ఈ “గల్పికా తరువు”. కేవలం 200 పదాలతో అర్థవంతమైన ఓ కథను అందించడం. రచయుతల సృజనకు పరీక్ష లాంటిది..
ప్రతీ రచయిత చిత్త శుద్ధితో విభిన్న కోణాలలో విభిన్న కథలను అందించారు. ఎవరి శైలిలో వాళ్ళు రచయితలు వారి కథలకు న్యాయం చేశారు.
సమాజ నైజాన్ని చూపించిన కథలు కొన్ని, సామజిక దృక్పధంతో రాసినవి మరి కొన్ని, కన్నీటి గాధలు, మనసు వ్యధలు ఇలా ఒక్కో కథలో ఒక్కో అంశంతో మనసును కదిలించేలా కరిగించేలా ఆలోచించేలా ఉన్నాయి.
ఇక ఇలాంటి మంచి కథలకు వేదిక ఇచ్చి వాటికి రూపం ఇచ్చిన శిల్పి ఆత్మీయ సోదరి జ్వలితక్క.
రచయితగా సాహితీ రంగం ఎన్నో సేవలు చేసి. తన ప్రస్థానం అక్కడితో ఆపేయకుండ సంపాదకురాలిగా కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తూ, వెన్ను తట్టి వాళ్ళ రచనలను అన్నిటికీ తనే ఓ వేదికగా ముందుకు తీసుకు పోవడానికి తను చేస్తున్న కృషి. అనిర్వచనీయం. అది మన కళ్ళకు కనిపించే నగ్న సత్యం. సాహసం తో కూడిన తన ప్రస్థానంలో తన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు ఎన్నో..
ఇక పోతే ఇంత మంది రచయితలను ఒకే చోట చేర్చి. చిన్న కథలతో పుస్తకం వేయడం ఓ సాహసమే. అయినా దీనిని ఓ సవాల్ గా తీసుకొని మన ముందు “గల్పికా తరువు ‘పుస్తక రూపంలో ఉంచారు జ్వలితక్క.
ఇక ఇందులో మొదటి కథ “అడ్డు గోడ” కులాల మధ్య ఉన్న అడ్డు గోడలు మానవత్వం ఎలా బద్దలు కొట్టి తొలిగించిందో చూపించే ఓ మంచి కథ.
ఇద్దరి ప్రాణస్నేహితులు ఒకరి కోసం ఒకరు ఏ అవసరం వచ్చిన సాయం చేసుకునే వాళ్లు. స్నేహితుడికి పరీక్ష పీజు కట్టడానికి డబ్బులు లేక పోతే ఆత్మాభిమానం గల తన స్నేహితుడికి చేబదులుగా ఇచ్చి సాయం చేస్తాడు.
కానీ వాల్ల ఇంటికి భోజనానికి తీసుకువచ్చిన స్నేహితుడిని అంటరానివాడు అని వాల్ల తల్లి చేసిన అవమానంతో మొఖం చూపించుకోలేదు. చివరకు అంటరాని వాడే తన ప్రాణాలను మానవత్వం తో కాపాడినందుకు తన తల్లి లో మార్పు వస్తుంది.
*”అమూల్యం” ప్రమాదం లో అప్పుడే పెళ్లి అయిన తన బిడ్డను భర్తను కోల్పోయిన ఒక మహిళ తన కోడలికి మళ్ళీ పెళ్లి చేసి తన కోడలిలో కూతురును చూసుకుంటూ తన కోడలికి పుట్టిన బిడ్డను ఎంతో లాలనగి చూసుకునే ఒక ఆదర్శ స్త్రీ మూర్తి కథ.
*”అమ్మ తనం” తన భర్త ముందుకు, మగువలకు బానిస అయ్యి తన కళ్ళ ముందే వికృత చేష్టలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ తనను శారీరకంగా ,మానసికంగా ఎంత బాధ పెట్టిన సహించిన ఆ తల్లి చివరకు కన్న కూతురు అని మరిచి తనతో తప్పుగా ప్రవర్తించిన ఆ తల్లి తన కళ్ళను తానే నమ్మక. చివరకు అపర కాళిల మారి తన భర్తనే కడతేర్చిన తీరు.. తన బిడ్డ కోసం ఓ తల్లి తన భర్తనే శిక్షించిన కథ.
*”ఆదర్శం” పెద్దలు ఏమి చేస్తే పిల్లలు కూడ అదే చేస్తారు. మంచిలో, చెడులో పిల్లలు పెద్దవాళ్లనే అనుకరిస్తారు, అన్నది ఇందులో నీతి..
పిల్లల ముందు పెద్దలు ఎలా ఉంటే వారు కూడ అలాగే వుంటారు. పెద్దవాళ్లకు గౌరవం మర్యాద ఇవ్వడం అనేది తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. ఎవరినైన అమర్యాదగా చూస్తే పిల్లలు కూడ అలాగే చూస్తారు అని.
“అపాత్రసాయం” పాపం లేని వాళ్ళు అని సాయం చేస్తే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అప్పులు చేసి తిరిగి వాళ్లకు ఇవ్వకుండ కొడుకు కోడలకు తగువు పెట్టించే అత్త కథ
“ఆమె కథ”ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ.బిడ్డకు తల్లి అయి మోసపోయిన ఓ మహిళ కథ. చివరకు తన బిడ్డను పోషించ లేని స్థితిలో వేరే వాళ్లకు దత్తత ఇచ్చిన భర్త చేతిలో మోసపోయున ఓ..తల్లి కథ
“ఆమె విలువ” బ్రతికి ఉండగా ఎవరి విలువ తెలియదు పోయాక ఎంత బాధ పడ్డా వాళ్ళు తిరిగి రారు. తనకు అన్ని సపర్యలు చేసిన తన భార్య చనిపోయునంక ఓ భర్త పరిస్థితి ఎంటో ఈ కథలో చక్కగా చూపించారు.
“ఆసరా” కరోనాతో కంపెనీలు అన్ని మూత పడి పల్లెబాట పట్టి నలుగురి ఆకలి తీర్చే వ్యవసాయం చేసుకునే యువత కథ.
“నమ్మకం” ఓ బిడ్డ తన తల్లి మీద పెట్టుకున్న నమ్మకం. లాక్ డౌన్ లో పుట్టిన రోజుకు తన కూతురి కోరికను ఎలా తీరుస్తుంది అని తన భర్త ముందు తన కూతురి నమ్మకాన్ని నిలబెట్టిన తల్లి కథ. తను కోరుకున్నట్లు గానే తెల్లవారే సరికి తన కూతురికి కొత్తబట్టలు ఇచ్చిన ఓ తల్లి.
“మరణం”ఓ అబ్బాయి చనిపోయిన వాళ్లకు హాస్టల్ లో దెబ్బలు తింటూ బ్రతికి ఉన్న మనకు తేడా ఏంటి అనే తన బాధను వెళ్ల బోసుకునే కథ
“సదువు ఇమ్మర్స” బాల్య వివాహం చేసిన ఆడపిల్ల కథ. చదువుకుంటూ ఆటపాటలతో బడిలో గడపాల్సిన బాల్యాన్ని పెళ్లి పేరుతో బంధిస్తే మళ్ళీ ఆ ఆడకుతురు తన చదువును ఎలా కొనసాగించిందో చదువు విలువ గురించి చెప్పే మంచి కథ.
“ప్రే మంట” ప్రేమించి పెళ్లి చేసుకోని ఆ ప్రేమికుడి కపట ప్రేమను పసి గట్టి మోసపోయున అని తెలుసు కొని తనను వదిలేసి తన జీవితాన్ని చక్క దిద్దుకున్న యువతి కథ.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కథ ఒక్కో అద్భుతం. నారి శక్తిని చాటే మహిళల కథలు, మోసపోయినా మళ్ళీ తన జీవితాన్ని నిలబెట్టుకున్న వారి కథలు, చదువు విలువ తెలిపేవి, సంస్కారం నేర్పించేవి..
చక్కటి ముఖచిత్రంతో పెద్దలు విహారిగారు, శిలాలోలితగారి ముందుమాటలతో అందరూ చదవతగినది. ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివి అర్థం చేసుకోగల పుస్తకం. నాకు తెలిసినంత వరకు తెలుగు సాహితీ చరిత్రలో గల్పికలతో వచ్చిన మొదటి సంకలనం…

(పుస్తకం కొరకు జ్వలిత-9989198943 సంప్రదించండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *