June 24, 2024

తపస్సు – పాకురు మెట్ల దిగుడు బావి

రచన: రామా చంద్రమౌళి

బతుకుతూ చనిపోతూ
మళ్ళీ బతుకుతూ చనిపోతూ
ఇక చనిపోతూనే బతకడం అలవాటైన తర్వాత
జీవితం స్థానికమో , ప్రవాసమో , ప్రవాస స్థానికమో అర్థంకాలేదామెకు
మనిషి ఎక్కడ జీవిస్తూంటే అదే స్వస్థలమని తెలుస్తోందామెకు –
రాత్రంతా ఆమె ఒంటరిగా మగ్గాన్ని నేస్తూనే ఉంది
ఒక నిర్విరామ లయాత్మక శబ్దం బయటా .. లోపల గుండెలో
ఆమె నేసే బట్ట రేపు ఎవరికి వస్త్రంగా మారుతుందో తెలియదు –
యుగయుగాలుగా నడచి వచ్చిన దారుల్లో
పరిచయమైన ప్రతి దీపస్తంభమూ .. ప్రతి మనిషీ
ఒక అధ్యాయమే .. పుటలు పుటలుగా జ్ఞానమై
అన్నీ ఇసుక చెలిమెలు.. తోడుకోవాలి ప్రాణజలం కోసం –

ప్రపంచం దిక్కు ఆశ్చర్యంగా చూస్తూ మొదలైన ప్రయాణం
ప్రపంచమే తన దిక్కు ఉత్సుకతతో చూడాలని తపిస్తూ ఎదుగుతున్నపుడు
అరికాళ్ళ నిండా అన్నీ సీసవక్కలే
రక్తాలోడే గాయాలు .. మనిషి ఎప్పుడైనా ఒంటరే అని పాఠాలు చెబుతాయి
ఒంటరిగానే అరణ్యాల వెంట , నదీ తీరాల వెంట
పర్వతాలను చీల్చుకుని మైదానాల వెంట .. నడచి వస్తూ వస్తూ
మనిషి ఒక చరిత్రయి .. ఒక నాగరికతై .. ఒక సంస్క ృతై
గత వర్తమాన భవిష్యత్‌ విచికిత్సలన్నీ
ఎదుట .. రాతి నేలపై గిరగిరా తిరుగుతున్న బొంగరమైతే
తాడు విశ్రమిస్తూ ఉంటుంది నేలపై
రెండు చేతుల కోసం వేచి చూస్తూ –
ఒక్కసారి ‘ జై హనుమాన్‌ ’ అని కాల జలపాతంలోకి దూకి
అట్టడుగు లోతుల్లో అన్వేషిస్తున్నపుడు
దొరికిన ‘ సీతమ్మ ముక్కు పుడక ’ వెనుక
ఎన్ని అశ్రుజలధులో .. ఎన్ని యుద్ధ శంఖారావాలో
అన్నీ మనుషుల జాడలు జాడలుగా .. అనేక ఆనవాళ్ళుగా
పాకురు పట్టిన మెట్లతో దిగుడు బావులుగా
ప్రత్యక్షమౌతున్నపుడు
హృదయం ఒక కణకణలాడే నిప్పుల మండె
.. వెంటనే కొండల గుండెల్లోనుండి వినిపించే
ఏక్‌ తార జీవధ్వనిలో కొట్టుకుపోతూ
పచ్చని గడ్డిలో .. గుంపులు గుంపులుగా మేస్తున్న
గొర్రెల మందలను చూస్తూ
ఎక్కడో విస్మృత శిథిలాలయ అగరొత్తుల ధూమంలోకి
మహాభినిష్క్రమణ –
భగవంతుడా.,
నాకు రవ్వంత సహనం .. ముత్యమంత సంయమనం .. పిసరంత శాంతిని ప్రసాదించు
అన్న అర్థింపుతో మగ్గంపై గుడ్డను నేస్తున్న ఆమె
తన రెండు దివ్య హస్తాలతో సమర్పించే వస్త్రం
రేపు ఎవరి దుస్తులకోసమో .. తెలుస్తుందా మనకు –

Translated by Mydavolu Venkata Sesha Sathyanarayana

Slimy Stairwell

Living and dying,
again living and dying,
then living while dying.
Once got into this habit,
she couldn’t understand
whether life is native, exile or nativised exile!

She started understanding
that wherever the human lives
that’s the native.

Burning the midnight oil,
she kept weaving at the looms!
A continuous beat within and outside her heart.
It’s not known the cloth she’s weaving
who it is going to clothe!

In the paths tread since epochs,
every lamppost and every man
that is crossed, is a vibrant chapter.
Pages and pages of wisdom
and oh, those sandy troughs of wisdom
must draw from them the ale of life!

A journey started staring at the world
and trekking with a staunch desire
to make the world look at him.
The soles pierced by pieces of glass,
and oozing bloody wounds
echo the ultimate adage
that man is always alone.

Walking through the woods,
traipsing along the sandy shores of rivers,
breaking through the mountains,
and sauntering on wide green meadows,
man himself became a history,
a culture and a civilization!

The dilemmas of past, present, future when spin
the grounded whipping threads rest,
waiting for two inviting arms.

Chanting “Jai Hanuman,”
the time-deluge, there fathoms deep
the glittering nasal stud of Mother Sita.
Oh, behind that golden stud
you behold more gushing oceans of tears
and hearken to the deafening sounds of trumpets
played during gruesome wars!
They all became the un-shattered footprints
and eternally burning landmarks
of past human wiles and woes
that take you to the depths
through the slimy steps
of said and unsaid history’s stairwell!

The smell of burning pyres emitting from heart
was soon shattered by sweet music
diffusing from the distant caverns
and gazing at the grazing sheep in green meadows,
she thought of her last journey
through the fragrant incense
coming from the ruins of ancient temples.
She prayed
“O God give me a bit of patience,
a little compassion and a wee of peace!”

But can we ever know
whom she’s weaving those clothes for?

1 thought on “తపస్సు – పాకురు మెట్ల దిగుడు బావి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *