March 19, 2024

నా మనస్సు అనే దర్పణం-నా భావాలకు ప్రతి రూపం।

రచన: లక్షీ ఏలూరి

అది ఒక మాయా దర్పణం-కొన్నిసార్లు నన్ను
కూర్చోపెడుతుంది సింహాసనం మీద।

మరి కొన్ని మార్లు తోస్తుంది అదః పాతాళానికి।

అమ్మ కడుపు లోని శిశువును మావితో, నా హృది
లోని కోరికలు అనే గుఱ్ఱాన్ని అజ్ఞానం కప్పి వేస్తే,

మనసు అనే అద్దానికి పట్టిన మకిలిని అధ్యాత్మిక
జ్ఞాన దీపాన్ని వెలిగించి పారద్రోలుతుంది।

పరులాడు పరుషాలకు పగిలిన నా మాయా,
దర్పణం వక్కచెక్క లయితే పవన మారుతాలు
చల్లని నవనీతంపూసి సేద తీరుస్తాయి।

పసిపాపల నవ్వులలో,విరబూసిన విరులలో
కూజితాల కలకల రవాలతో నాకు స్వాంతన
దొరుకుతుంది।

మనసు అనే అద్దాన్ని చేజారకుండా పదిలపరచు
కొంటే గతం పునరావృతం కాదు।

గతంగతః భవిష్యత్తు బంగారు బాటలు పరచి
ఆహ్వానం పలుకుతున్నాయి।

పాపము..!ఈ అద్దం ఎంత అమాయకమైన ది।
చెడు తలపులఉన్న ముఖాలను,మంచి తలపుల
ముఖారవిందాలకు ఒకే ఆదరణ।

నన్ను మీరు చేజార్చుకుంటే నేను మీకు దక్కను।
ఎలా అయితే మీకు దక్కిన అవకాశం చేజార్చుకున్న
విధంగా ।

నేను మీకు మంచి చెడులను బేరీజు వేసి,
సక్రమంగా నడిపే రారాజు ను।

నేను మీ సుఖ దుఃఖాలు వినే నేస్తాన్ని।
మీ అందచందాలను చూపి,అలరింపజేచే సహృదయను।
మీహృదయ దర్పణ ప్రతిరూపాన్ని।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *