March 29, 2023

కాలమదియె ( గజల్ )

రచన: ములుగు లక్ష్మీ మైథిలి

క్రిమి రక్కసి విలయాన్నే
సృష్టించిన కాలమదియె
దేశమందు చెడు రోజులె
తలపించిన కాలమదియె!

దేశాన్ని కాపాడే
దళపతికే నివాళులే
భరతభూమి కన్నీటితో
విలపించిన కాలమదియె!

దశాబ్దాల సుస్వరాలె
ప్రపంచమే కదిలించెను
స్వర్గపురికి గళములనే
తరలించిన కాలమదియె!

కవనాఝరి చిత్రసీమలొ
సిరివెన్నెలె కురిపించెలె
గగనవీధి నిలిచేలా
మరలించిన కాలమదియె!

శివనృత్య పదఘట్టన
కైలాసం చేరిపోయె
పాండిత్యపు రచయితలనె
కదిలించిన కాలమదియె!

మహమ్మారి అలధాటికి
అసువులే విడిచిరిగా
అవనిలోన పుణ్యాత్ముల
స్మరించిన కాలమదియె!

గడిచిపోయె గతకాలపు
మహామహుల తలచెనులే
లక్ష్మిమదిలొ శ్రద్ధాంజలి
అర్పించిన కాలమదియె!!

*******************

1 thought on “కాలమదియె ( గజల్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2023
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
2728