May 1, 2024

సృష్టి (కాల) రహస్యము (గమనం)

రచన: సుమంగళి

సృష్టి రహస్యం తెలియని అంతరంగం
ఎవరికోసం ఆగదు నిరంతర కాలగమనం
మంచు తెరల మాటున దాగిన సౌందర్యం
బానుని కిరణాలు సోకగ ప్రకృతి బహిర్గతం
గుండె లయలో వినిపించే భావం అనిర్వచనీయం
కదిలే కాలానికి లేదు ఎలాంటి కళ్లెం.

సుఖ:దుఃఖాలను రుచి చూపించే వైనం
గతకాలపు మధురస్మృతులతో మటు మాయం
కొల్పోయిన సన్నిహితుల తోటి సహచర్యం
గతించిన చేదు అనుభవాల మరిపించు నైజం
మది నిండుగ గతస్మృతుల సమాహారం
కలవర పరిచినా ముందుకు సాగు గమనం
ఎంతటి వారికైనా తప్పదు ఈ అనుభవం
ఎదురీదుతూ సాగే నిర్విరామ పయనం
సర్వేజనా సుఖినోభవంతు మన నినాదం
సమస్తం కావాలి ఆనంద నందనవనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *