June 14, 2024

మాలిక పత్రిక జనవరి 2024 సంచికకు స్వాగతం

  మనిషి ఎన్ని అవాంతరాలు, ఆపదలు, దుర్ఘటనలు, సమస్యలను ఎదుర్కున్నా కొత్త సంవత్సరం అనగానే ఒక కొత్త ఆశ కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇక రాబోయేవి మంచి రోజులు అన్న చిన్న ఆశ, నమ్మకంతో ముందుకు సాగుతాడు. ఇదే ఆశావహ దృక్పథం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సరికొత్త ఆశలతో,సరికొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగిడదాము. మాలిక పత్రికను ఆదరిస్తొన్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటిలాగే ఈ కొత్త సంవత్సరపు మొదటి మాసంలో మీకోసం […]

డయాస్పోరా జీవన కథనం – కథ కాని కథ

రచన: కోసూరి ఉమాభారతి మేము కారు దిగి ‘గోల్డేజ్-హోం’ పేరిట నిర్వహింపబడే ‘వృద్దాశ్రమం’ రిసెప్షన్ ఏరియాలోకి నడిచాము.. “పితృదినోత్సవ వేడుకలు’ జరుగుతున్న దిశగా రంగురంగుల తోరణాలు కట్టిన మార్గం అనుసరిస్తూ నడిచాము నేను, నా స్నేహితురాలు సాన్యా. అక్కడ నివసించే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే ఈ కార్యక్రమం ప్రతియేడు జరుగుతుంది. నా రూంమేట్ ‘సాన్యా’ నాన్న గారు చాలా కాలంగా ఈ హోంలోనే ఉంటున్నారు. ఆదివారాలు ఆయనతో గడిపి భోజనమయ్యాక అక్కడున్న […]

అమ్మమ్మ – 53

రచన: గిరిజా పీసపాటి వసంతకు మూడు రోజుల తరువాత, కాళ్ళు తీసేయాల్సిన ప్రమాదం తప్పిందని చెప్పి, రెండు కాళ్ళకి ఆపరేషన్ చేసారు డాక్టర్. మరో పదిహేను రోజుల తరువాత డిస్చార్జ్ చెయ్యడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత కూడా నెలరోజుల పాటు నడక లేకపోవడంతో నాగ, గిరిజ పసిపిల్లను సాకినట్లు సాకారు వసంతను. రెండు పూటలా డ్రెస్సింగ్ నాగే చేసేది. వసంత తేరుకుని కాస్త నడక మొదలుపెట్టిందనగా ఉద్యోగం, ఇంటి పని, చదువు మొదలైన వత్తిడి […]

ప్రాయశ్చితం – 8

రచన: గిరిజారాణి కలవల మరునాడు సత్యంతో కలిసి సురేంద్ర తన ఊరికి ప్రయాణం అయాడు. ఊరు సమీపిస్తున్న కొద్దీ సురేంద్రలో తెలియని అలజడి. పైరు పొలాల మీద నుంచి వీచే చల్లని గాలి, తన తండ్రి స్పర్శలాగా మృదువుగా అనిపించింది. ఆ మట్టి, తన మూలాలలని తెలియచేస్తున్నట్టే తోచింది. ఊరి మొదట్లోనే చెరువు. అక్కడే కదూ? తనకి తండ్రి ఈత నేర్పించినది. అక్కడే కదూ జీవితంలో ఎలా ఎదగాలనేదీ పాఠాలు నేర్పించినదీ? బడి ముందున్న వేపచెట్టు తనని […]

సినీ బేతాళ కథలు – వేస్ట్ ఫిల్మ్ రావు

డా. వివేకానందమూర్తి చెట్టుమీంచి దింపి, విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగకుండా ఉండేందుకు మరో కథ చెబుతాను విను’ – అని బేతాళుడు ప్రారంభించాడు – ‘అప్పటి మద్రాసులో వేస్ట్ ఫిల్మ్ రావుగారనే తెలుగు శాల్తీ ఒకాయన ఉండేవాడు. పొడుగుపొట్లకాయలా పొడూగ్గా ఉన్న బారెడు ఫిల్మ్ ముక్కని తన మెడలో సర్పంలా వేసుకుని తిరిగేవాడు – పరమ శివుడు పన్నగాన్ని ధరించినట్టు. అతను నిర్మాతలందరి […]

లోపలి ఖాళీ – లోపల సముద్రం… పైన ఆకాశం…

రచన: రామా చంద్రమౌళి అంతా నిశ్శబ్దం. ఇరవై ఎనిమిదేళ్ల ముక్త కళ్ళు తెరవలేదు. మేల్కొంది. సోయి కలుగుతూ తన ఉనికి మెలమెల్లగా జ్ఞప్తికొస్తోందామెకు. రాత్రి… ఒంటిగంటనుండి … గంటన్నర సేపు… ఒకటే యుద్ధం ఇంట్లో… శేషు… తను. ఇల్లంతా ధ్వంసమైపోయింది. వస్తువులన్నీ విసిరేయబడి… పగిలిపోయి… ముక్కలుముక్కలైపోయి… చిందరవందరగా… గ్లాస్‌ లు… పళ్ళేలు… ఫ్లవర్‌ వేజ్‌ లు… కుర్చీలు… డోర్‌ కర్టెన్లు… టేబుల్‌ పైనున్న వస్తువులన్నీ… పెన్‌ స్టాండ్‌…ప్యాడ్స్‌…గడియారం…బోన్‌ సాయి మొక్కలు… ఒక మర్రి చెట్టు… ఒక కోనిఫర్‌. […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -5

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 10. ఎమ్ సీ ఎచ్ ప్లాస్టిక్ సర్జరీ – ఒక జీవితకాలపు అవకాశం ఎలాటి సహాయమూ సపోర్ట్ లేకుండా, ఢిల్లీలో ఉండే నా సోదరుడు ప్రేమ్ అతని భార్య సుజాత నుంచి కొంత ఎదురు చూస్తూన్నాను. వాళ్ళు మమ్మల్ని చూడటానికి చండీఘడ్ వచ్చినప్పుడు నన్ను డెలివరీకి ఢిల్లీ ఆహ్వానిస్తారని ఆశ పడ్డాను. కాని అలాటిదేమీ లేకపోడంతో నేనూ ఆ విషయం ప్రస్తావించలేదు. కాని ఒప్పుకోవలసిన విషయం నేను […]

బాలమాలిక – స్వశక్తి

రచన: విశాలి పేరి అది ఒక పెద్ద తోట… నిన్నటివరకూ. నిన్ననే ఆ తోటను ఒక పెద్ద బిల్డర్ కి అమ్మేశాడు ఆ తోట యజమాని. ఆ తోటనిండా బోలెడు చెట్లు. ఆ చెట్ల మీద బోలెడు పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. ఆ తోట కొనుకున్న బిల్డరు అక్కడ ఒక పెద్ద మాల్ కట్టాలని అనుకున్నాడు. తోట కొన్న మరునాడే అతనొక కాంట్రాక్టర్ ని తీసుకొని వచ్చి, “ఈ చెట్లన్నీ కొట్టేయించు” అని ఆర్డర్ ఇచ్చి […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 6

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల క్రితం సంచికలో మనం గణేశ పంచరత్న స్తోత్రం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా… ఈ సంచికలో మరో అద్భుతమైన ఆదిశంకర విరచితం, ‘భజ గోవిందం’ గురించి తెలుసుకుందాం. టేప్ రికార్డర్, క్యాసెట్లు గురించి తెలిసిన వారందరికీ బాగా పరిచయం ఉన్న క్యాసెట్, భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి ‘విష్ణు సహస్రనామం’. ఆధునిక పరికరాలు అందుబాటులో లేని కుటుంబాల్లో, పెద్దవాళ్ళు నేటికీ ఇళ్లలో ఉదయాన్నే ముందుగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, ఆ తర్వాత […]

సుందరము – సుమధురము – 9

రచన: నండూరి సుందరీ నాగమణి మనసుకు ఎంతో ఆహ్లాన్నిచ్చేది సంగీతం. శాస్త్రీయ సంగీతంలోని రాగాలన్నీ కూడా వినటానికి, అనటానికి (పాడుకోవటానికి) ఎంతో హాయిగా ఉండి, ప్రేక్షక శ్రోతల హృదయాలనే కాక, గాయనీగాయకుల మానసాలకు కూడా ఎంతో సాంత్వనాన్ని కలిగిస్తాయనటంలో సందేహమేమీ లేదు. కొన్ని రాగాలలో సమకూర్చిన చిత్రగీతాలు ఎంతో మనోహరంగా ఉండి, శ్రోతల మనసులకు హాయిని కలిగిస్తాయి. అలాంటి రాగాలలో చిత్రాలలో ఎక్కువగా ఉపయోగించినవి హిందోళ, మోహన రాగాలు. రెండూ ఔడవ రాగాలే. అంటే సప్తస్వరాలు ఉండవు. […]