May 20, 2024

వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా! – 3 వ రంగము

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు సుందర దాసు ఇల్లు దాసు:- ( సరుకులతో ఇంటిలోకి ప్రవేశిస్తూనే) కాళీ కాళీ కాళీ వేళొచ్చెను నీకు ఇంటి వెలుగువు గాగన్ కాళీ:-ఏవండోయ్ దాసుగారూ! డోసేమైనా పడిందా మాంఛి హుషారులో కందళిస్తున్నారు దాసు:-తాళుము రేపటి దాకా పాళికి పదునెక్కు ఘడియ పరతెంచునహో-11 కాళీ:-కలయో నిజమో తెలియదు అలవోకగ ఆత్మసఖుడు అల్లెను కందం బెలకోయిల వలె పాడగ పులకించెను మేను పద్య పోడిమి గనినన్-12 (నోటి వద్ద చేయి పెట్టి వాసన చూసి) […]

వెంటాడే కథలు – 23, ఎవరతను?

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507   నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా […]

అన్నమాచార్య కీర్తనలు – వివరణ

రచన: శ్రీనివాస్ చామర్తి ఇదె చాలదా మమ్ము నీడేర్చను ఉపోద్ఘాతము: ఈ కీర్తనలో అన్నమాచార్యులు భక్తిలోని మర్మమును చక్కగా తెలిపిరి. భక్తినే సర్వస్వముగా భావించి కొలుచు వారికి మోక్షముపై ఆసక్తి నశించి భక్తిలోనే వుండుటకు ప్రాధాన్యమునిత్తురు. అట్టివారికి మాత్రమే మోక్షము కరతలామలకము. అధ్యాత్మ కీర్తన: రాగిరేకు: 285-3 సంపుటము: 3-490 ఇదె చాలదా మమ్ము నీడేర్చను అదన నెవ్వఁ డెరుఁగు నటమీఁది పనులు ॥పల్లవి॥ ఇట్టె పంచసంస్కారా లెచ్చోట నుండినాను పట్టైనవారే మాకుఁ బ్రమాణము మట్టుగ నీరూపనామము […]

సృష్టి (కాల) రహస్యము (గమనం)

రచన: సుమంగళి సృష్టి రహస్యం తెలియని అంతరంగం ఎవరికోసం ఆగదు నిరంతర కాలగమనం మంచు తెరల మాటున దాగిన సౌందర్యం బానుని కిరణాలు సోకగ ప్రకృతి బహిర్గతం గుండె లయలో వినిపించే భావం అనిర్వచనీయం కదిలే కాలానికి లేదు ఎలాంటి కళ్లెం. సుఖ:దుఃఖాలను రుచి చూపించే వైనం గతకాలపు మధురస్మృతులతో మటు మాయం కొల్పోయిన సన్నిహితుల తోటి సహచర్యం గతించిన చేదు అనుభవాల మరిపించు నైజం మది నిండుగ గతస్మృతుల సమాహారం కలవర పరిచినా ముందుకు సాగు […]

మాలిక పత్రిక డిసెంబర్ 2023 సంచికకు స్వాగతం

Jingle Bells Jingle Bells.. Jingle All the Way..       పాఠక మిత్రులు, రచయిత మిత్రులు అందరికీ సాదర ఆహ్వానం… డిసెంబర్ మాసం.. చలి చలి మాసం.. పిల్లలకు పరీక్షలు,సెలవులు,క్రిసమస్, న్యూఇయర్.. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.. మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియల్స్, కార్టూన్స్ తో వచ్చేసింది ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరపు మాలిక ఆఖరి సంచిక […]

లోపలి ఖాళీ 14. – ఏదో…

రచన: రామా చంద్రమౌళి   లోకోత్తరరీతిలో గంగా హారతి కొనసాగుతోంది. మంగళకరమైన ఘంటల పవిత్ర మధురస్వనాల మధ్య పదుల సంఖ్యలో పడవల్లో నిలబడిఉన్న పూజారుల చేతుల్లోని హారతి జ్వాలలలు ఎగిసెగిసి పడ్తూ.  ఒక వింత శోభనూ, అదనపు అందాలనూ చేకూరుస్తున్నాయి ప్రకృతికి.  గంగామాత ఆ కొద్ది క్షణాలు పులకించిపోతూ పరవశించిపోతోంది. దూరంగా  వారణాసిలో, ఒంటరిగా ఒక చిన్న హోటల్‌ గదిలోని కిటికీ గుండా అంతా ఆసక్తిగా చూస్తున్న అరవై నాలుగేళ్ళ నరసింహ రాయలు మంత్రముగ్దుడైనట్టు ఆ దృశ్యాన్ని […]

ప్రాయశ్చిత్తం – 6

రచన: గిరిజారాణి కలవల అమెరికా నుంచి ఇండియాకి ఇరవై నాలుగు గంటల ప్రయాణం. కంటిమీద కునుకు లేదు. సురేంద్ర తలపుల నిండా తండ్రే మెదులుతున్నాడు. ఢిల్లీలో విమానం దిగి మరో రెండు గంటలలో, ముందుగా బుక్ చేసుకున్న కాశీ ఫ్లైట్ అందుకున్నాడు సురేంద్ర. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ మహానగరం. ముక్తి క్షేత్రం. గంగానది ఒడ్డున ఎక్కడెక్కడ నుంచో వచ్చినవారు, తమతమ పితృ దేవతలకు, అక్కడ బ్రాహ్మణులు చేయిస్తున్న శ్రాద్ధకర్మలని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. అక్కడే ఒక […]

సినీ బేతాళ కథలు – 3, నబూతోనభవిష్యతి

రచన: డా. వివేకానందమూర్తి విక్రమార్కుడు చెట్టు మీదనుంచి బేతాళుడి శవాన్ని దింపి, తన భుజం మీద వేసుకుని మళ్ళీ నడకసాగించాడు. ‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగుతోందనే ఫీలింగు రాకుండా మరో కథ చెబుతాను, విను -’ అని బేతాళుడు ప్రారంభించాడు. గుంటుపల్లిలో బంటు ఈశ్వరుడు అనే పొగాకు వ్యాపారి ఉండేవాడు. అతనికి సినిమాలంటే ప్రాణం. ప్రతిరోజూ ఏదో ఒక సినిమా చూసేవాడు. చూశాక తన తోటి బంధుమిత్రులతో ఆ సినిమాను విశ్లేషించేవాడు. తను యవ్వనంలో ఉన్నప్పుడు పౌరాణిక, […]

అమ్మమ్మ – 52

రచన: గిరిజ పీసపాటి “తెలియదు పెద్ద తల్లీ! ఈ రోజు రాత్రికి విజయనగరంలో పెళ్ళి ఉంది. అక్కడికని చెప్పి ఇలా వచ్చాను” అన్నారాయన. మరో రెండు గంటల పాటు మాట్లాడుకుని బాగా చీకటి పడటంతో ‘ఇక బయల్దేరరామని’ చెప్పి లేచారంతా. “ఒక్క నిముషం” అంటూ తన కేష్ బేగ్ లోంచి పాత డైరీ ఒకటి తీసి, అందులోంచి ఒక పేపర్ చించి, దాని మీద ఒక అడ్రెస్ రాసి ఇస్తూ “ఇక మీద మీరు నాకు ఉత్తరం […]

డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

రచన : కోసూరి ఉమాభారతి అహ్మదాబాద్ నుండి శారద ఢిల్లీ పయనమైంది. ఆమె కొడుకు అనిల్ ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS) నుండి ఉత్తీర్ణుడవుతున్న సందర్బంగా… స్నాతకోత్సవానికి హాజరవ్వనుంది. తన భర్త ఆశించినట్టుగా సేవా దృక్పధంతో వైద్య వృత్తిని చేపట్టబోతున్న కొడుకుని చూసి గర్వపడుతుంది శారద. ఉత్సాహంగానే ఉన్నా, ఏడాది క్రితం ఆకస్మికంగా సంభవించిన భర్త మరణం ఆమెని కృంగదీస్తుంది. ** స్నాతకోత్సవం తరువాత జరిగిన తేనేటి విందులో… క్లాస్-మేట్ పూనమ్ ఖత్రి […]