April 27, 2024

సినీ బేతాళ కథలు – తోలు మనసులు

రచన:- డా. కె.వివేకానందమూర్తి విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని, విసుగు చెంద కుండా తెలుగు సినిమాలు పదే పదే చూస్తున్న ప్రేక్షకుడిలా, నడక సాగించాడు. ‘విక్ర! మార్గమధ్యంలో నీకు విసుగు, శ్రమ అనిపించకుండా యింటర్వెల్ యివ్వ కుండా మరో కథ చెబుతాను విను.’ – అని బేతాళుడు ప్రారంభించాడు – “అమలాపురంలో బొబ్బర్లంక బుజ్జిబాబుకి వొక లాడ్డింగ్ హోటలుంది. దానికి ఏ స్టార్స్ లేకపోయినా ఫైవ్ స్టార్ హోటల్ అని పేరెట్టుకున్నాడు. […]

సినీ బేతాళ కథలు – సమ్‍అంతరరేఖ

రచన: డా. వివేకానందమూర్తతి విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజంమీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రా! దారిలో నీకు శ్రమ అనిపించకుండా వుండేందుకు మరో కథ చెబుతాను విను!’ అని బేతాళుడు కథ మొదలెట్టాడు – “ఆ మధ్య బరబరరాయ్ అనే తెలుగు చిత్ర నిర్మాత వొకాయన వుండేవాడు. ఆయన బరబరా, గబగబా చిత్రాలు తీసి ప్రేక్షక ప్రజల మీదికి వదిలేసేవాడు. అన్ని చిత్రాలు అట్టరు ఫ్లాపులయిపోయేవి. అయినా తరతరాల ఆస్తికి వారసుడు కావడంవల్ల అతడి […]

సినీ బేతాళ కథలు – వేస్ట్ ఫిల్మ్ రావు

డా. వివేకానందమూర్తి చెట్టుమీంచి దింపి, విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగకుండా ఉండేందుకు మరో కథ చెబుతాను విను’ – అని బేతాళుడు ప్రారంభించాడు – ‘అప్పటి మద్రాసులో వేస్ట్ ఫిల్మ్ రావుగారనే తెలుగు శాల్తీ ఒకాయన ఉండేవాడు. పొడుగుపొట్లకాయలా పొడూగ్గా ఉన్న బారెడు ఫిల్మ్ ముక్కని తన మెడలో సర్పంలా వేసుకుని తిరిగేవాడు – పరమ శివుడు పన్నగాన్ని ధరించినట్టు. అతను నిర్మాతలందరి […]

సినీ బేతాళ కథలు – 3, నబూతోనభవిష్యతి

రచన: డా. వివేకానందమూర్తి విక్రమార్కుడు చెట్టు మీదనుంచి బేతాళుడి శవాన్ని దింపి, తన భుజం మీద వేసుకుని మళ్ళీ నడకసాగించాడు. ‘విక్రమార్కా! నీకు శ్రమ కలుగుతోందనే ఫీలింగు రాకుండా మరో కథ చెబుతాను, విను -’ అని బేతాళుడు ప్రారంభించాడు. గుంటుపల్లిలో బంటు ఈశ్వరుడు అనే పొగాకు వ్యాపారి ఉండేవాడు. అతనికి సినిమాలంటే ప్రాణం. ప్రతిరోజూ ఏదో ఒక సినిమా చూసేవాడు. చూశాక తన తోటి బంధుమిత్రులతో ఆ సినిమాను విశ్లేషించేవాడు. తను యవ్వనంలో ఉన్నప్పుడు పౌరాణిక, […]

సినీ భేతాళ కథలు – ధ్రువతార

రచన: డా. కె.వివేకానందమూర్తి తెలుగు సినిమాలు కొత్త రిలీజులన్నీ విరివిగా చూస్తున్నా, విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడి శవాన్ని కండువాలా భుజం మీద వేసుకుని నడక సాగించాడు. ‘విక్రమార్కా! ఈ మధ్య కథల్లో బరువు తగ్గిపోతోంది. నేను శవాన్నయి బరువెక్కి పోతున్నాను. అంచేత నీకు శ్రమ కలుగకుండా ఒక కథ చెప్తాను’ అని బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. – కాలింగ్ బెల్ మోగింది. భ్రమరాంబ తలుపు తీసి, విభ్రమాంబ అయిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ, ‘జై […]

సినీబేతాళ కథలు – 1. ఓవర్ నటేశన్

రచన: డా. వివేకానందమూర్తి ‘కాస్త చూసి నడువు విక్రా!’ అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. ‘అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్.టి.సి బస్సు, దానికి ఎన్టీ రామారావైనా ఒకటే. ఎకస్ట్రా నటుడైనా ఒకటే.’ విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్తపడ్డాడు. “విక్రా! నీకు […]