May 26, 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2024 సంచికకు స్వాగతం

  మాలిక పాఠక మిత్రులు, రచయితలకూ సాదర ఆహ్వానం. మండే ఎండాకాలంలో అందరూ ఎలా ఉన్నారు. మధురమైన మామిడిఫలాలు, మనసును మురిపించే మల్లెపూవులు కూడా ఈ మండే ఎండలతో పోటీపడే సమయమిది. ఉగాది పండగ రాబోతోంది. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుందాం. ఒక ముఖ్య ప్రకటన: ఈ ఏప్రిల్ సంచిక తర్వాత ఉగాదికి మరో ప్రత్యేక సంచిక రాబోతోంది. విశేషాలు ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఉండదు కదా. కొద్దిరోజులు ఆగితే చాలు. […]

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

రచన: శ్రీమతి రామలక్ష్మి కొంపెల్ల మనం ఇంతవరకు సంగీతంలోని వివిధ విభాగాల్లో రాగమాలికల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో అందరికీ సుపరిచితమైన లలిత సంగీతంలోని రాగమాలికా రచనల గురించి తెలుసుకుందాం. ముందుగా లలిత సంగీతం అంటే ఏమిటి? ఆ సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడా ఏమిటి, ఇత్యాది విషయాలను క్లుప్తంగా చర్చించుకుని, ఆ తర్వాత ఒక రాగమాలికా భక్తి గీతం గురించి తెలుసుకుందాం. చాలా సరళమైన శైలిలో, భావ ప్రధానంగా, మాధుర్య ప్రధానంగా ఉండే సంగీతమే […]

సుందరము సుమధురము –12

రచన: నండూరి సుందరీ నాగమణి ‘దేవదాసు’ ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీ… కానీ విషాదాంతం. అయినా అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసులను చూరగొన్న ఒక ప్రేమకావ్యం ఇది. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శ్రీ శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ‘దేవదాసు’ నవలకు చిత్రరూపం ఇది. ఈ నవలను ఆయన 1917 లో రచించారు. ఆనాటి బెంగాల్ సమాజ స్థితిగతులకు, కులపట్టింపులకు అద్దం పడుతుంది ఈ నవల. ఈ నవలను తెలుగులో 1953 లో ఒకసారి, 1974 లో విజయనిర్మల […]

శుచిరో అస్మాకా!

రచన: డా. వివేకానందమూర్తి ఇంగ్లాండ్ లండన్లో నేనున్నాను. ఇండియా యెండల్లో మా మావగారున్నారు. అమ్మా, నాన్న అస్తమించాక అంత ప్రేమా యిస్తున్నది ఆయనే! నేను లండన్ చేరి ముప్పై యేళ్లు దాటింది. అప్పుడు యిండియాలో డాక్టర్లు కిటకిటలాడిపోతున్నారు. కొత్త డాక్టరుగా బ్రతకటం కష్టమయ్యింది. అన్నం పెట్టని అమ్మను వదిలేయాల్సిందే అని ఆత్రేయగారు ఆదేశించారు. ఎకాయెకీ బొంబాయి ఎయిర్పోర్టుకి వెళ్లి ఓ పైలట్‌ని పిలిచి, “ఏవోయ్ ఫైలట్టూ! లండన్‌కి బండి కడతావా?” అనడిగాను. “తవరెక్కితే కట్టకపోటవేంటి బాబూ! రాండి” […]

జామాత

రచన: గిరిజారాణి కలవల ‘ఇచట మీ చేయి చూసీ చూడగానే మీ జాతకం మొత్తం చెప్పబడును. జ్యోతిషపండిత రత్న శ్రీశ్రీ అనుగ్రహ స్వామి చేతిలో, మీచేయి పెట్టండి., గతి తప్పిన మీ గ్రహాలని దారికి తెచ్చుకోండి. రండి. చేయి చాపండి. మీ అతీగతీ తెలుసుకోండి.” తాటికాయంత అక్షరాలతో ఉన్న బోర్డు కనపడగానే, ‘యాహూ!’ అనుకుంటూ ఎగిరి గంతేసాడు చిదానందం. గత కొద్ది రోజులుగా తాను పడే సమస్యల నుంచి పరిష్కారం దొరికే మార్గం దొరికిందని సంబరపడిపోయాడు. వెంటనే […]

అమ్మమ్మ – 56

రచన: గిరిజ పీసపాటి మగ పెళ్ళివారి బంధువులలో ఒకాయన ముఖ్యమైన ఘట్టాలను ఫోటోలు తీస్తున్నాడు. పురోహితుడు చెప్పిన విధంగా పూజ చేస్తున్న కామేశ్వరి చెవిలో “అందుకే నీకు చిన్నప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పాను. తలంటి పోసుకునేటప్పుడు ఏడుస్తే… నీ పెళ్ళిలో పెద్ద వాన పడుతుందని. నా మాట విన్నావా!? ఇప్పుడు చూడు… ఎంత పెద్ద వానో…” అంది వసంత ఆట పట్టిస్తూ… కాబోయే భర్త పక్కనే ఉండడంతో…. కామేశ్వరి తిరిగి అక్కను ఏమీ అనలేక గుర్రుగా చూస్తూ […]

బాలమాలిక – బెల్లం కొట్టిన రాయి

రచన: కాశీవిశ్వనాథం పట్రాయుడు “రుద్రా! ఎన్నిసార్లు చెప్పాలి? నీళ్ళు ఒంపొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతోంది. నువ్వు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉన్నావు. ఇక నా వల్ల కాదు. పెద్దమ్మకి చెప్తాను ఉండు నీ సంగతి” అని రుద్ర రెక్కపట్టుకు ఈడ్చుకు వెళ్ళి పెద్దమ్మ ముందు కూర్చోబెట్టింది సౌమ్య. “చూడు పెద్దమ్మా వీడి అల్లరి… ఎలా నీళ్లు ఒంపుకున్నాడో!” అని వాడిని పెద్దమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది సౌమ్య. “అయ్యో అయ్యో… బట్టలన్నీ […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 8

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 18. ఒక సంఘటనాత్మక శీతాకాలం అది మంచు కురిసే క్రిస్మస్ సమయం. మాకంటే ఎక్కువ అమ్ము ఈ పండుగ సందడిని ఆనందిస్తోంది. శాంటా నుండి తనకు కావలసిన బహుమతుల పట్టిక నిర్దాక్షిణ్యంగా రాసింది. సలీం క్రిస్మస్ పార్టీలకు వెళ్తూంటే, నేను అమ్ముతో ఇంట్లో ఉండిపోయాను. అలాగని నాకు పెద్ద బాధగా కూడా లేదు. ఒకప్పుడు సలీం గురించి ఎలా అనుకునేదాన్నో ఇప్పుడలా అనిపించడం లేదు. అతని పట్ల […]

పూల సంకెల

రచన: నండూరి సుందరీ నాగమణి ఆ రోజు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూడగానే శ్రీధరరావుకి నవనాడులు క్రుంగిపోయినట్టు అయిపోయింది. అలాగే పడక్కుర్చీలో వాలిపోయి, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో కొడుకు నుంచి వచ్చిన మెసేజ్ లోని ఆ ఫోటో వంక అదేపనిగా, వెర్రిగా చూడసాగాడు. “ఏమండీ, వంట ఏం చేయను?” అంటూ హాల్లోకి వచ్చిన రుక్మిణి ఆయన పరిస్థితి చూసి, గాబరాగా “ఏమైందండీ?” అని చేయి పట్టుకుని కుదిపింది. “ఆ… అబ్బే… ఏం లేదు […]

బాలమాలిక – రెప్లికా

రచన: మీనాక్షి శ్రీనివాస్ ‘పిల్లలూ, దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే’ దూరంగా మైక్ లో వస్తున్న పాటను మోసుకొస్తున్న గాలి వంటగదిలో సాయంత్రం చిరుతిండి కోసం సతమతమవుతున్న అలివేణి చెవిని హాయిగా సోకింది. ఎప్పటి పాట, అసలు ఆ పాటలో సుశీల గొంతులో ఆ భావం, ఆ మాధుర్యం… ఓహ్! ఒకప్పుడు జనాల్ని ఉర్రూతలూగించిన పాట కదూ. కానీ ఇప్పుడు పిల్లల్లో ఆ సున్నితత్వం, అమాయకత్వం ఉంటున్నాయా! తన ప్రశ్నకు తనే ఉలిక్కిపడింది. ఉంటాయి ఎందుకుండవూ, […]