May 19, 2024

చర్య – ప్రతిచర్య

రచన: రాజ్యలక్ష్మి బి రఘురాం ఒక చిన్న కంపెనీలో చిరుద్యోగి. ఐదేళ్ల కొడుకు, ఒద్దికగా గుట్టుగా సంసారం నడిపే భార్య, చిన్న అద్దిల్లు. బస్ స్టాప్ వీధి ఒక చివర వుంటే, యిల్లు వీధి మరో చివర వుంటుంది. రోజూ పదినిమిషాల ముందు బస్ స్టాప్ చేరుతాడు. ఆ వీధి పెద్దగా సందడి వుండదు. ఒక్కోసారి బస్సు వేగంగా వచ్చి ఒక నిమిషం ఆగి వేగంగా వెళ్లిపోతుంది. అందుకే రఘు ముందుగా చేరి బస్సు కోసం క్యూలో […]

ఆట పట్టింపు

రచన: ప్రకాశ లక్ష్మి వేణూ, వనజా అన్నా చెల్లెళ్ళు. వనజకు పది సంవత్సరాల వయస్సులో వారి తల్లిదండ్రులు ఒక బందువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్ళి వస్తూ వుండగా జరిగిన యాక్సిడెంట్లో మరణించారు. అప్పటికే వేణూ పెళ్లి అయ్యి జాబ్ చేస్తున్నాడు. వేణూ భార్య రాధ మంచి అణుకువ గల పిల్ల. అడపడచు రాధను చాలా ప్రేమగా చూసుకొనేది. కానీ వేణూ ఇంకా గారాబంగా చూసుకొనేవాడు. దాంతో వనజకు పెంకితనం, ముక్కోపం అలవాటు అయింది. అలా అని […]

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది. లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని […]

అమ్మమ్మ – 41

రచన: గిరిజ పీసపాటి వీళ్ళ నవ్వులు విన్న అన్నపూర్ణ ఆంటీ తలుపు తీసి, వీళ్ళను చూస్తూ “ఎన్నాళ్ళు అయిందండీ మీరు ఇలా హాయిగా నవ్వగా చూసి. అన్నయ్య గారు వెళ్ళిపోయాక మీరందరూ అసలు నవ్వడమే మర్చిపోయి, మర మనుషుల్లా మారిపోయారు. మీ ఇంట్లో మళ్ళీ మునుపటిలా నవ్వులు వినిపిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. మీరు నలుగురూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. అప్లికేషన్ పోస్ట్ చేసి, చాలా రోజులు ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందేమోనని […]

భావ కాలుష్యం

రచన: వసంతరావు నాగులవంచ కాలుష్యాలు నానా విధములు. భౌతిక కాలుష్యం కంటే భావ కాలుష్యం మిక్కిలి ప్రమాదకరమైనది. మానవుని ఆలోచనా విధానంలో వ్యతిరేక భావాలు చోటుచేసుకున్నప్పుడు మనసు మాలిన్యమౌతుంది. తత్ఫలితంగా వచ్చే ఫలితాలు కూడా చెడ్డగానె ఉంటాయి. జరుగవలసిన పనికూడా సక్రమంగా జరుగదు. మనసుకు శరీరానికి అంతులేని అవినాభావ సంబంధం ఉంది. మనసు తేలికగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై శరీరాన్ని ఆరోగ్యవంతంగా, కర్మలను చేయడానికి మిక్కిలి అనుకూలంగా ఉంచుతుంది. భావాలు వ్యతిరేకమైనప్పుడు శరీరం […]

మాలిక పత్రిక అక్టోబర్ 2022 సంచికకు స్వాగతం..

పాఠక, రచయిత మిత్రులందరికీ దివ్య దీపావళి శుభాకాంక్షలు దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ దీపాలు, మతాబులతో సంబరాలు జరుపుకునే పర్వదినం. రాబోయే దీపావళి మీకందరికీ శుభాలను అందివ్వాలని కోరుకుంటూ మాలిక అక్టోబర్ సంచికకు స్వాగతం. సుస్వాగతం   మీ రచనలు పంపవలసిన చిరునామా:maalikapatrika@gmail.com   ఈ సంచికలోమిమ్మల్ని అలరించబోయే కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు.. 1.చంద్రోదయం – […]

చంద్రోదయం – 33

రచన: మన్నెం శారద సారథి బేంక్‌నుండి వస్తూనే “స్వాతీ!” అంటూ పిలిచేడు. నానీ గబగబా పరిగెత్తుకొచ్చి “డాడీ! అమ్మ హాస్పిటల్లో వుంది. జ్వరమొచ్చిందట” అన్నాడు అమాయకంగా. సారథి అర్ధం కానట్లు చూసేడు. “ఏమయ్యింది?” అన్నాడు పనిపిల్లనుద్దేశించి. “నాకు తెల్దయ్యా! జానకమ్మగారే అమ్మగార్ని రిచ్చాలో తీసికెల్లేరు” అంది పనిపిల్ల. “ఏ ఆసుపత్రో తెలుసా?” “చెప్పలేదయ్యా. కాని డాక్టర్ చాకోమ్మగారు కామాల” సార్థి ముఖమైనా కడుక్కోకుండా చెప్పులు తొడుక్కుని హడావుడిగా హాస్పిటల్‌కి బయల్దేరేడు. “నేనూ వస్తాను డాడీ” నానీ కూడా […]

సాఫ్ట్ వేర్ కధలు – కోమల విలాస్

రచన: కంభంపాటి రవీంద్ర “ఈవేళ నీ మెయిల్ చెక్ చూసుకున్నావా?” అడిగింది వందన. మా అకౌంట్ మేనేజర్ తను. “చూసేను” బదులిచ్చేను “షిర్లే నుంచి వచ్చిన మెయిల్ చూసేవా?” మళ్ళీ అడిగింది “చూసేను.. షిర్లీ, స్కాట్ మన ఆఫీస్ చూడ్డానికి రెండు వారాల్లో ఇండియా వస్తున్నారట” “అది నాకూ తెలుసు.. పాయింట్ అది కాదు.. వాళ్ళు ఫ్రైడే రాత్రికి వస్తున్నారు.. వీకెండ్ చెన్నై చూస్తారట.. అంటే మనలో ఎవరో ఒకళ్ళు వాళ్ళని చెన్నై అంతా తిప్పాలి” అసహనంగా […]

పరవశానికి పాత(ర) కథలు – యువర్ సీట్స్ ఆర్ సేఫ్ విత్ మి

రచన: డా. వివేకానందమూర్తి వాన దంచేస్తోంది. టాపుమీద పడే ధారల శబ్దం సిట్యుయేషన్ మ్యూజిక్ లా వుంది. కారు దీపాల వెలుగులో ప్రహరీ గోడ ప్రస్ఫుటంగా కనబడుతోంది. అగ్గిపుల్ల వెలగ్గానే గీసిన శబ్దం. కాంతి కంటే ధ్వని లేటయింది. సిగరెట్టు తుదముట్టించి పుల్లని తుది ముట్టించేడు. ఒక్కసారి దమ్ము లాగేడు. కాస్త వంగి స్పీడో మీటర్ లైటు వెలుగులో మణికట్టు చూసుకున్నాడు. ఫణి పదకొండున్నర నుదురు బిగించి రెప్పలు పైకి విప్పి చూశాడు. వాన వినిపిస్తోంది. చూపు […]