May 3, 2024

యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు

రచన: చెంగల్వల కామేశ్వరి అందరికీ నేపాల్ యాత్ర అనగానే గుర్తొచ్చేవి. పశుపతినాథ్, ముక్తినాథ్, మణి మహేష్ హిమాలయాలు ట్రెక్కింగ్ మౌంట్ కైలాష్ ఇంకా ముందుకెడితే మానససరోవరయాత్ర ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తొస్తాయి.కానీ అన్నీ తలొక మూలా ఉంటాయి. నేపాల్ వెళ్లాలంటే ముందుగా గోరక్ పూర్ కాని పాట్నా కాని రైలులోనో, విమానంలోనో, వెళ్లి అక్కడినుండి పోఖ్రా విమానంలో కాని, రోడ్ మార్గాన కాని వెళ్లొచ్చు. ఖాట్మండ్, లుంబిని, చిట్వాన్, మనోకామన, అన్నీ రోడ్ మార్గానా ప్రయాణం చేయొచ్చు. […]

యాత్రా మాలిక – ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర నైనితాల్

రచన: నాగలక్ష్మి కర్రా దేశరాజధానికి సుమారు 330 కిలో మీటర్ల దూరంలో ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో వుంది నైనితాల్ . దేశవిదేశాలలో పేరుపొందిన వేసవి విడిది . సుమారు 6,840 అడుగుల యెత్తులో వుంది . ఢిల్లీ నుంచి రైలుమార్గం ద్వారా ‘ కాఠ్ గోదాం ‘ వరకు  వుంది . నైనితాల్ వెళ్లదల్చుకున్నవారు ట్రైన్ లో కాఠ్ గోదాం ‘ వరకు వచ్చి అక్కడనుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో కాని టాక్సీ లలో గాని […]

జాగేశ్వర మహదేవ్ మందిరం

రచన: నాగలక్ష్మి కర్రా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం గురించి వెతికితే మూడు రాష్ట్రాలలో అదే పేరుతో వున్నట్లు తెలిసింది. మొదటది మహారాష్ట్రలో వున్న ఔండ నాగనాధ్, ద్వారక దగ్గర వున్న నాగనాధ్ ఉత్తరాఖంఢ్ లో వున్న జాగేశ్వర్ లో వున్న నాగనాధ్. ఆయా రాష్ట్రాలవారు మాదే ఒరిజనల్ నాగనాధ్ అని అంటున్నారు, సరే మూడింటినీ చూసేస్తే పోలా అని జాగేశ్వర్ బయలుదేరేం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ […]

బ్రహ్మకమలాల పుట్టిల్లు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమకుంఢ్ సాహెబ్

రచన: కర్రా నాగలక్ష్మి ఉత్తరా ఖండ్ అంటేనే యెత్తైన కొండలు , గలగలలను ప్రవహించే సెలయేళ్లు , భగీరధిని చేరుకోవాలని పరుగులు పెడుతున్న అలకనంద అందాలు , తెల్లని మంచు కప్పబడ్డ పర్వతాలు గుర్తుకొస్తాయి . ఎత్తైన కొండల వెనుక యెన్నెన్నో అద్భుతాలు , యెన్ని సార్లు యీ కొండలలో తిరిగినా యింకా యెన్నో చూడవలసిన ప్రదేశాలు మిగిలే వుంటాయి . అలాంటిదే జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే దారిలోవున్న ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ […]

శివ ఖోడి ( గుహ )

రచన: కర్రానాగలక్ష్మి భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా?. ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా?, అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యీ వ్యాసం చదవండి. మీకే తెలుస్తుంది. ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరులో జమ్మూ నగరానికి 110 కిమీ..దూరంలో, ‘ రియాసి’ జిల్లాలలో వున్న ‘ రంసూ’ గ్రామానికి […]

రఘునాథ మందిరం

రచన: నాగలక్ష్మి కర్ర హిందువులు అతి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముడు జన్మించిన తిథిగా, శ్రీరామనవమిగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం. ఆంధ్రప్రదేశ్ ఆంద్ర, తెలంగాణగా విభజన జరిగిన తరువాత ఆంధ్ర లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరపాలి ఒంటిమిట్టలోనా? లేక రామతీర్ఠాలులోనా ? అనే విషయం మీద యెన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత ‘ఒంటిమిట్ట’లో జరపాలని రాజకీయ నాయకులు నిర్ణయించేరు. శ్రీరామనవమిని కుడా రాజకీయం […]

మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే […]

ట్రావెలాగ్ – వారణాసి యాత్ర

రచన: చెంగల్వల కామేశ్వరి మన దేశం లో కాల భైరవుడు క్షేత్రపాలకుడుగా పార్వతీ పరమేశ్వరులు కొలువయిన వారణాశిని దర్శించడం పూర్వ జన్మ సుకృతం ఎంతో అదృష్టం ఉండాలి. అన్నిటికన్నా మనకి ఆ పుణ్యక్షేత్ర దర్శనం కావాలంటే కాలభైరవుని అనుగ్రహముండాలి. అందుకే మనం వారణాశి వెళ్లాలి అనుకుంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. నిరాటంకంగా మన వారణాశి యాత్ర చక్కగా జరుగుతుంది వారణాశికి బెనారస్ అని, కాశీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది. పూర్వం […]