May 18, 2024

రోషినీ శర్మ ఆన్ హాట్ వీల్స్

రచన, ఇంటర్వ్యూ: విశాలి పెరి రోషిని శర్మ… కన్యాకుమారి నుండి కాష్మీర్ (లేహ్ ) వరకు బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వనిత. ఆడపిల్ల రాత్రి పూట పక్కనే ఉన్న వీధిలోకి ఒంటరిగా వెళ్ళడనికే భయపడే ఈ రోజుల్లో ఆమె ఇంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణించింది? అందుకు ఆమె కి స్ఫూర్తి ఎవరు? ఎంత మంది వెనకకు లాగారో తెలుసుకుంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎంతో మంది ఈ నాటి […]

స్వలింగ సంపర్కం వ్యక్తిగతమైనదా లేకా దేశనైతిక విలువలకి సంబంధమా ????

రచన, సేకరణ: డా. శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి సైంటిస్ట్ ఇన్ ఫిలడెల్ఫియా, అమెరికా. దేశ నైతిక విలువలా.. విచిత్రం గా వున్నది కదా? క్యూరియాసిటీ ని కూడా పెంచుతున్నది తెలుసుకోవాలని. ఏదో చీకట్లో నాలుగు గోడల మధ్య జరిగే వాటికీ, దేశాల నైతిక విలువలకి ఏవిటి సంబంధం? స్వలింగ సంపర్కులకు కఠినమైన శిక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? యునైటెడ్ స్టేట్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటినుండో మరుగున పడివున్న విషయం-స్వలింగ సంపర్కాలు. వీటిని ఇప్పుడు చట్టబద్దం […]

Rj వంశీతో అనగా అనగా… ఆ తలుపు అవతల

Rj వంశీ ఈసారి ఆ తలుపు అవతల ఏముందో చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి మరి. తలుపు మీద మెల్లిగా తట్టండి.. అంతే..

ఎంజాయ్ మేరిటల్ బ్లిస్.. (తరాలు-అంతరాలు)

రచన: జి.ఎస్.లక్ష్మి.. చిక్కగా అల్లుకున్న పచ్చని పందిరిమీద, లేత రంగుల కలయికతో తీగలుగా సాగే రెమ్మలమీద ఉయ్యాలలూగుతున్న ఆ చిలుక, గోరింకల సాన్నిహిత్యాన్ని చూస్తున్న అలకనంద ఊహలు భువిని వీడి దివిని తాకుతుండగా సన్నగా కోకిల కూత కూసింది ఆమె మొబైలు. స్వర్గానికి చేరువలో వున్నట్టున్న ఆమె ఒక్కసారి ఈ భూతలానికి వచ్చిపడింది. కిటికీలోంచి చూస్తున్న అందమైన దృశ్యాన్నుంచి దృష్టిని మంచం మీద పడున్న మొబైల్ వైపు సారించింది. అక్కడ వినీత మొహం కనపడింది. మొబైల్ చేతిలోకి […]

అత్తారిల్లు (తరాలు-అంతరాలు)

మంథా భానుమతి. “అంత భయవెందుకే అత్తారిల్లంటే! మా కాలంలో లాగానా ఏవన్నానా?” ఇంకా పూర్తిగా తెల్లారలేదు.. అప్పుడే మా అమ్మాయి గదిలోంచి నెమ్మదిగా మాటలు, వంటింట్లోంచి ఢమఢమా చప్పుళ్లు.. ఆదివారమైనా ఒకరగంటసేపు ఎక్కువ పడుక్కుందామంటే కుదరదు. బద్ధకంగా మంచం మీద అటూ ఇటూ కదిలాను. దుప్పటి చెవుల మీదుగా బిగించి కళ్ళు మూసుకున్నా.. ఊహూ! ఒక సారి టాటా చెప్పి వెళ్ళిపోయిన నిద్రాదేవి మళ్లీ వస్తుందా నా పిచ్చిగానీ.. కళ్లు మండి పోతున్నాయి. రాత్రి చాలా పొద్దు […]

సాంప్రదాయం తెరలో ఆధునికం ( తరాలు-అంతరాలు)

రచన: లక్ష్మీ రాఘవ “హలో ” ” హలో ” “నిత్య వాళ్ళ అమ్మగారేనా” మర్యాదగా వినిపించింది గొంతు… “అవునండీ” “అమ్మా మీ అమ్మాయి నిత్యను బెంగళూరు పంపారు ఉద్యోగం కోసం …” అతని మాటలు మధ్య లోనే త్రుంచి వేస్తూ “అవునండీ ” “మీ అమ్మాయి ఇంకొక అబ్బాయితో కలిసి వుంటోంది. విచారించుకోండి.” “మీరెవరు? ఏం పేరు?” అంటూన్న అరుణకు ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది. ఒక క్షణం విపరీతమైన భయంతో వణుకు వచ్చింది.. […]

అల్విదా నేస్తం

రచన: వడ్లమాని బాలా మూర్తి “లాస్యా! ఓ లాస్యమ్మా లేవవే తల్లీ. నాలుగైపోయింది లే లేచి స్నానం చేసిరావేమ్మా. కోత్త పట్టుచీర మార్చుకోకుండానే పడుక్కు నిద్ర పోయావు…రేపు అత్తవారింట్లో ఇలా చేస్తే ….పిల్లకి ఏమీ నేర్పలేదని నన్నే ఆడిపోస్తారు.”అని లలిత, కూతుర్నిలేపుతూ. “అబ్బా, ఉండమ్మా.” “చూడు లాస్య, ఆరున్నరకి పీటలమీద కూర్చోవాలట. నువ్వు ఇలాగే నిద్ర పోతూంటే, ఇంక చీర మార్చక్క ర్లేదు పూల జడ కుట్టక్కర్లెదు. ఆ పైన నీ ఇష్టం” “ఏమైంది అంటి?” “రా […]

ఏవగింపు

రచన: పుక్కళ్ళ రామకృష్ణ నిన్న రాత్రి నాన్న చెప్పిన, “అదిగో పులి” కథ నచ్చింది. అసత్యం పలికితే ఎదురయ్యే విపత్తులేమిటో తెలిపే కథ. నాన్న ప్రారంభించిన రెండో కథ సంపూర్ణం కాకముందే నిద్రలోకి జారుకున్నాను. ఉదయం మెళకువ వచ్చే సమయానికి బాగా పొద్దెక్కింది. కిటికీ నుండి వేప చెట్టు క్రింద స్టాండ్ వేసిన నాన్న సైకిల్ కోసం చూశాను. అది అక్కడ లేదు. సైకిల్ లేకపోతే నాన్న ఆఫీసుకు వెళ్ళినట్లు అర్థం. బడులకు వేసవి శెలవులొచ్చాయి. శెలవులన్నీ […]

శుభోదయం 1

రచన: డి.కామేశ్వరి శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకొంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా, అనాకారిగా ఎందుకు పుట్టించాడో! రోజుకి కనీసం ఒకసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆ రోజు పదిసార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే.. ఈ రంగే తనకి శత్రువయింది. లేకపోతే.. రేఖ.. నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనకనించి తల్లి వచ్చిన నీడ అద్దంలో కనిపించింది. “శ్యామ్! టిఫినుకి రా రా, యింకా ముస్తాబవలేదా? […]

చిగురాకు రెపరెపలు – 7

రచన: శారద మన్నెం మా చుట్టాల్లో ఎవరిదో పెళ్ళి. ఎవరో అంటే ఏమో కాదు. మా పెద మామయ్య మరదలి కొడుకు. మా పెద్ద మామయ్య తహశిల్దార్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. చాలా స్టయిల్ చేసేవాడు. అతని కేప్స్ కి, స్టిక్స్ కి స్టాండ్సుండేవి. హంటింగ్ కి వెళ్ళేవాడు. గుర్రం స్వారీ చేసేవాడు. కాని పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు. మా అమ్మమ్మకే ఏమీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడన్నా యింట్లో వుంటే నేను కనిపిస్తే “ఏవే […]