May 19, 2024

ఊహా సుందరి!

రచన: నాగులవంచ వసంత రావు   సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో   అవనిలోని అందమంత అమరిన జవరాలివో రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో   ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో   ఒంపు సొంపు లొలకబోయు బాపు గీసిన బొమ్మవో చూపరు నలరింపజేయు అచ్చ తెలుగు రెమ్మవో   ప్రేమ మధువు జాలువారు అమృత భాండానివో ప్రేమాభిషేక చిరుజల్లుల అమర […]

చిరు చిరు మొగ్గల

రచన: రావూరు సత్యనారాయణ రాధ: చిరుచిరు మొగ్గల చిలిపి తెరలలో చిటికెలు వేయుచు, చిలిపిగ నవ్వుచు వడివడిగ వచ్చెను వసంతరాగం ఎవరికోసమో సుమభోగం! కృష్ణ: పిలపిలగాలులు పుప్పొడి దూగ ఈలలు వేయుచు ఎదలను దూయుచు ఆమని రాత్రుల యామిని రాగా ఎవరికోసమీ అనురాగం! రాధ: ఎవరికోసమీ సుమభోగం! కృష్ణ: ఈ అనురాగం – ఈ సుమభోగం! రాధ: పూలతోటలో – కాలిబాటలో మురిపించెడి నీ మురళి పాటలో తూగిన నా యెద – ఊయలలూగగ ఎన్నినాళ్లనీ సహయోగం […]

అతను-ఇతను

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. అతను తనకు పెళ్లి అయినాసరే, అమ్మకొంగును వదలలేని బిడ్డ. ఇతను తనబిడ్డల పెళ్ళిళ్ళు అయినా సరే భార్యపొందును వదలలేని భర్త. ఆబిడ్డకు అమ్మే దైవం,ఆమె మాటే వేదం, అతని దృష్టిలో భార్యంటే మనిషే కాదు. ఈభర్తకు భార్యే లోకం,ఆమె చెంతే స్వర్గం, ఇతని దృష్టిలో అమ్మంటే మనిషే కాదు. అతనికి భార్యంటే అలక్ష్యం,ఇతనికి అమ్మంటే నిర్లక్ష్యం. అతనికి అమ్మంటే అన్నపూర్ణాదేవి,ఇతనికి భార్యంటే రతీదేవి. అతనికి అమ్మచేతిలో తన సంపాదన పెట్టటం, ఆమె […]

బ్రాహ్మణుడంటే ఎవరు?

రచన: శారదా ప్రసాద్(టీవీయస్.శాస్త్రి) రాజకీయాలలోనే కాదు అన్ని వేదికలమీద కూడా కొందరు తామే హిందూ మతోద్ధారకులమని చెప్పుకుంటూ ఒకరినొకరు అభినిందించుకునేవారున్నారు. వారికివారే డబ్బాలు కొంటుకుంటారు! హిందూమతం ఎవరూ ఉద్ధరించే నీచస్థితిలో ఇప్పుడూ లేదు,ఇక ముందు కూడా ఉండబోదు! భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు హిందూమతంలో ఉండటమే, హిందూమతం యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఉండబట్టే హిందూమతం నిరంతరం ప్రవహిస్తుంది! మతోద్ధారకులమని చెప్పుకునే వారికి ఇతరుల భావాలను గౌరవించటం చేతకాదు! వారి భావాలకు భిన్నమైన భావాలను వ్యక్తపరిస్తే […]

ఇద్దరు మనుషులు

రచన:- రామా చంద్రమౌళి ఆ రోజు ఆదివారం.. మధ్యాహ్నం పన్నెండు దాటిందేమో పొద్దటినుండీ .. మబ్బు పట్టిన ఆకాశం ఒకటే ఉరుములు .. గర్జనలు వర్షం ఎప్ప్పుడు మొదలౌతుందో తెలియదు అతను ఫ్రిజ్ మీది అందమైన బుద్ధుని గాజుబొమ్మను కోపంతో విసిరేసాడు. భళ్ళున పగిలి అన్నీ గాజు ముక్కలు .. తళతళా మెరుస్తూ పిల్లలిద్దరూ బెడ్రూంలో నక్కి నక్కి ముడుచుకుపోయి.. నోళ్ళు మూసుకుని, ఆమె.. చేతిలోని టీ కప్పును నేలకేసి కొట్టింది. ఫెడేల్మని.. పగిలి.. అన్నీ పింగాణీ […]

వీరు…

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. పిల్లల ఎన్ని ఆగడాలనైనా భరిస్తారు, వారి ఎన్ని తప్పులనైనా క్షమిస్తారు, వారి ఎన్ని అవివేకాలనైనా హర్షిస్తారు, ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక! సదా వారి సేవలో తరిస్తారు, ఎప్పుడూ వారి క్షేమాన్నే కాంక్షిస్తారు, వారి సుఖాన్వేషణలోనే చరిస్తారు, ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక! వారితో చీవాట్లు వీరి అలవాట్లుగా చేసుకుంటూ, వారితో చెప్పుదెబ్బలు వీరి పొరపాట్లుగా చెప్పుకుంటూ, వారితో అగచాట్లు తెరచాట్లుగా ఉంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీరు వారికి […]

సాధ్యం కాదేమో!

రచన: పారనంది శాంతకుమారి కొంత మాయ,కొంత మర్మం నేర్చుకొంటే కానీ జీవించటం సాధ్యం కాదేమో! కొంత నటన, కొంత మౌనం అలవర్చుకొంటే కానీ మెప్పుపొందటం సాధ్యం కాదేమో! కొంత స్వార్ధం, కొంత లాభం చూసుకుంటే కానీ సుఖపడటం సాధ్యం కాదేమో! కొంత వేదం, కొంత నిర్వేదం ఆచరిస్తే కానీ ఆనందించటం సాధ్యం కాదేమో! కొంత గోప్యం, కొంత లౌఖ్యం ఉంటే కానీ శాంతి దొరకటం సాధ్యం కాదేమో!

రంగుల ‘భ్రమ’రం..

రచన, చిత్రం, కవితాగానం : కృష్ణఅశోక్ ఈ మైక్ మీద క్లిక్ చేసి  కవితను వింటూ చదువుకోండి. అప్పుడప్పుడు… ఆకాశంలో ఉల్కలు రాలిపడినప్పుడో, భూమ్మీద సునామీలు చెలరేగినప్పుడో, నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను… కారణం లేకుండానే! జ్ఞాపకాలు హృదిలో కదలాడే వేళ మొదట కనిపించేది నీవే… నగ్నంగా… అవును! నగ్నంగానే… నిన్ను మొదటిసారి నగ్నంగా చూసినప్పుడు “నా న్యూడ్ పెయింటింగ్ వేస్తావా!?” అని ఆకాశంలో ఏదో వెదుకుతున్నట్టు చూస్తూ అడిగావ్… గుర్తుందా!…” భౌతికంగా కాకుండా, మనో నగ్నత్వం […]

దుఃఖ విముక్తి

రచన:- రామా చంద్రమౌళి అతనికి చాలా దుఃఖంగా ఉంది పంచుకోడానికి ఎవరూ లేరు.. చుట్టూ వెదికాడు అంతా అరణ్యం నాభిలోనుండి తన్నుకొస్తున్న ఆక్రోశంతో ఆకాశం దద్ధరిల్లేలా అరిచాడు సకల దిశలూ ప్రతిధ్వనించాయి కాని దుఃఖం తగ్గలేదు పరుగెత్తి పరుగెత్తి.. ఒక మనిషిని చేరాడు మధ్య మద్యం సీసాను తెరిచి పెట్టుకుని దుఃఖ గాథ నంతా వర్షించాడు.. దుఃఖం రెట్టింపయింది శరీరమంతా కరిగి కరిగి.. అంతా కన్నీరే వెళ్ళి ‘ యూ ట్యూబ్ ‘ లో కళ్ళు మూసుకుని […]

దీపం

రచన: కృష్ణ మణి నింగిలోంచి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తెలిసింది ఎంత అందంగా ఉందోనని ! అన్ని గ్రహాలు ఉన్నట్లు గుండ్రంగా ఉన్నా ఆ అందాల ప్రక్రుతి హొయలు మనసుని కట్టిపడేసింది తెల్లని మబ్బుల ఊయలలు డోలాయమానం అంటే ఏంటో రుచి చూపించాయి అ నీలి సంద్రం మధ్యలో పచ్చటి మైదానపు ప్రదేశాలు అక్కడక్కడ గోదుమరంగు ఇసుక ప్రాంతాలు కన్నుల పండుగనే చెప్పాలి మబ్బుల్ని దాటి భూమిపైకి వస్తుంటే ఏవో రేకుడబ్బాలు చువ్వలు దాడి చేసాయి భూమికి […]