May 6, 2024

*మొగ్గలు*

  రచన:   – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్   చీకటిలోకి ప్రయాణం చేస్తూనే ఉంటాను వెలుగుచుక్కలను వెతికివెతికి ముద్దాడాలని కిరణాలు వెలుతురు చినుకులు   దుఃఖాలను దిగమింగుతూనే బతుకుతుంటాను జీవనసమరంలో ఆటుపోట్లు సహజాతిసహజమని సుఖదుఃఖాలు జీవితంలో ఆలుమొగులు   కష్టాలతోనే జీవననౌకను నడుపుతుంటాను ఆనందాల తీరాన్ని సునాయాసంగా చేరాలని ఆనందాలు కౌగిట్లో వాలే పక్షులు   పూలను చూసి గర్వంగా మురిసిపోతుంటాను స్వేచ్ఛగా నవ్వుతూ పరిమళాన్ని పంచుతాయని పూలు మనసుకు హాయినిచ్చే మలయమారుతాలు   తొలకరి చినుకులకు […]

*అమ్మేస్తావా అమ్మా*

  రచన: అభిరామ్     అయ్య పనికెళ్ళగానే నీవు కూలికి కదలగానే ఇంట్లో ఉన్న అంట్లు తోమి ఊరి చివర నుంచి కట్లు మోసి మైళ్ళదూరం నడిచి నీళ్ళు తేచ్చిన నేను నీకు బరువయ్యానా అమ్మ అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా   చదువుల పలక పట్టకుండా చేలోని సెలికపట్టి అయ్య వెంట తిరుగుతూ సాళ్ళు నీళ్ళతో తడిపి నేను కూడ తడిచిపోయి పగి‌లిన ప్రత్తిలా నవ్విన నేను నీకు బరువయ్యానా అమ్మ అయ్యచేసిన […]

|| కవితా! ఓ కవితా! ||

  రచన: కొసరాజు కృష్ణప్రసాద్   కవితా! ఓ కవితా! నా మదిలో మెదలినపుడు, మస్తిష్కపు నాడులలో మోసితి నిను తొలిసారిగ తల్లియు తండ్రియు నేనై. ఎన్నెన్నో ఊహాలతో, మరియెన్నో కలలతోటి, పులకించితి నీ తలపుతొ ఏ రూపున ఉంటావోనని.   కలం నుంచి జాలువాఱి వెలువడగా నిన్నుఁజూచి, సుఖప్రసవమై నిన్నుఁగన్న ఆనందపు అనుభూతితొ, మురిసి మురిసి ముద్దాడిన మధుర క్షణం అతిమధురం.   అక్షరాలే పువ్వులుగా ఏరి ఏరి కూరుస్తూ, నీ భావానికి మెరుగులద్ది తీర్చిదిద్ది […]

మణికర్ణిక

రచన: ప్రొఫెసర్ రామా చంద్రమౌళి తనెవరో తనకే తెలియని మణికర్ణిక భస్మసింహాసనంపై కూర్చుని గంగా హారతిని చూస్తోంది కటిక చీకట్లో యుగయుగాలుగా అంతే స్త్రీని హింసించి , వధించి , సతిని యాభైరెండు ఖండాలుగా ఖండించినపుడు ఇక్కడ వారణాసి తటిపై ‘ కర్ణాభరణం ‘ ఒక శక్తిపీఠమై మొలిస్తే కన్యాకుమారిలో తెగ్గొట్టబడ్డ ఆదిమ స్త్రీ పవిత్ర పాదాలు రక్తసిక్తమై చుట్టూ ఆవర్తనాలౌతూ సముద్రాలూ, నదులూ దుఃఖితలైనాయి – అంబాడ్తున్న మణికర్ణికను ఎవరో శ్మశానాల మధ్య విడిచి వెళ్ళారు […]

పట కుటీర న్యాయం

రచన: కాంత గుమ్ములూరి ఎక్కడ దొరికిన అక్కడే నా గృహం పట కుటీర న్యాయం ఆక్రమించిన స్థలం నా నివాసం అనుభవించిన దినం నా అదృష్టం చెట్టు కిందా , గుట్ట పక్కా, ప్రహరీ గోడ వెనకాలా మంచు మబ్బుల నీలాకాశం నా దుప్పటీ పచ్చ గడ్డి, మన్ను దిబ్బా పవళించే తల్పం వెచ్చనైన రాళ్ళ మట్టి నా ఆసనం వర్షం, గాలీ, ఎండా, నీడా అందరూ నా సహచరులు. నీ కడుపు నింపుతా ననే అమ్మ […]

పాడు పండగలు..

రచన: రాజి పల్లె పల్లెలా వాడ వాడలా వస్తాయంట మాయదారి పండగలు ముస్తాబులూ, మంచి మంచి వంటకాలు తెస్తాయంట ఇంటింటా ఆనందాలు విరజిమ్ముతాయంటా. మరి మా మురికివాడ జాడ తెలియలేదా వాటికి వెలుతురు లేని వాడల అరుగులు వెతకలేదా ఈ వగలమారి పండగలు ఆకలి ఆర్తనాదాలు, చిరుగు చిత్రాలు కనరాలేదా కలహమారి పండగలకు మాయదారి పండగలు కలవారి ఇంటనే విడిది చేస్తాయంట బంగళాల్లో, కనక, కాంతుల్లోనే కనపడతాయంటా గుడిసెల్లో, నిరుపేదలను కనికరించవంట ఈ పాడు పండగలు.

ఒక్క క్షణం ఆలోచించు!

రచన: నాగులవంచ వసంతరావు మనిషికి మత్తెక్కించి మనసును మాయచేసి ఇల్లు ఒళ్ళు రెంటిని గుల్లచేసి సంఘంలో చులకనచేసే మద్యపాన రక్కసీ! మానవజాతి మనుగడపై నీ ప్రభావం మానేదెప్పుడు? ఆడపడచుల ఆక్రందనలు, ఆవేదనలు “చీర్స్” చప్పుళ్ళలో కలిసిపోయాయి ఐస్ ముక్కల హిమతాపానికి మంచులా కరిగిపోయాయి మహాత్ముల ఉపన్యాసాలు, నీతిబొోధలు సంఘ సంస్కర్తల త్యాగఫలాలు మద్యం మత్తులో చిత్తుగా ఓడిపోయాయి అర్ధరాత్రి స్వాతంత్ర్యం అర్థం తెలిసిపోయింది గాంధీజీ కలలుగన్న భరతమాత గౌరవం బక్కచిక్కి బరువెక్కి బజారుపాలైంది మధ్యం నిషాముందు ఇoద్రభోగం […]

సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ

రచన: ఉమా పోచంపల్లి విశాల గగనం, వినీలాకాశం అనంత విశ్వం, ఆవేశపూరితం మనోబలం కావాలి ఇంధనం తేజోబలం అవ్వాలి సాధనం మానవమేధ మహా యజ్ఞం చేయాలి లోకముద్దీప్తి మయం విశాల అవని వినిపించెనదె ఆమని వలె వికసించెనదె అణుమాత్రమైనా, ప్రతిధ్వనించెను అష్టదిక్కులు మారుమ్రోగగా తారలమించే తేజోమయం ఆనందభైరవి నాట్యాలు వెలిగి మనసానంద నాట్యాల ఉర్రూతలూగించి వనితా అవని సుశాస్త్రజ్ఞానం అవని పరిధినే అధిగమించెనే కెంపులకేల కరవాలము వలెనే కుజగ్రహ మున నిలిపెను మన భారత క్షిపణి కుజగ్రహమున […]

ఉష …..

రచన:  జి. శ్రీకాంత   సూర్యోదయ పూర్వార్ధ సమయం ….. ఉష తొంగి చూసింది… ప్రియాగమనార్థియై ముంగిట నిలిచింది తూరుపు దిక్కున నింగిలో ఆమె చీర  కొంగు నీలాకాశమై  విస్తరించుకుంది దీర్ఘమైన కురులు దట్టమైన పొగమంచులా పారాయి ఆమె ధరించిన నగలు నభంలో నక్షత్రాలై  మిలమిలలాడాయి సన్నని వెలుగులు చిప్పిల్లగానే నగల తళుకులు  వెలవెల పోయాయి చిరు వెలుగులలో చీర కుచ్చిళ్ళు జేగురు రంగు వెలువరించాయి అధిగమిస్తున్న సూర్య కాంతులు చొచ్చుకు రాగా నారంగి, పసుపు, బంగారు […]

పునర్జన్మ

రచన: ఉమ జి   అనుదినమూ ఏవో చిన్న గొడవలతో జీవనఝరిలో నిస్తేజంగా, స్తబ్దంగా మిగిలిన నేను, తిరిగి నాలోనే చైతన్యాన్ని చిలికిస్తాను, మనసున అమృత మథనం సాగిస్తాను   ఏమీ తోచని జడత్వాన్ని పారదోలి జీవం నింపే ఊహల సాక్షాత్కరించే మనసు పొరలు మాటునున్న ఊటకు ఊపిరి పోసి ప్రాణం నింపుతాను సజీవంగా సాక్షాత్కారం చేస్తాను   నిష్కర్షగా మాట్లాడే మనుషులు చెప్పే నిజాన్ని గ్రహించి, జాజి మల్లెల పరిమళాలు మనసుకు అందేలా వారి మంచితనాన్ని […]