April 27, 2024

మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

రచన:సి. ఉమాదేవి డా. లక్ష్మిరాఘవ గారు సాహిత్యానికే కాదు తనలోని కళాభిరుచికి నైపుణ్యాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందించి ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. వృధాగా పారెయ్యవలసిన వస్తువులను కళాత్మకంగా వినియోగించడంలోనే వీరి ప్రతిభ ఆవిష్కృతమవుతుంది. వనిత మహావిద్యాలయలో రీడర్ గా పదవీ విరమణ చేసాక తన సమయాన్ని సాహితీబాటలో విహరింపచేస్తున్నారు. చక్కని కథలతో ఆత్మీయులు అనే కథాసంపుటిని మనకందించారు. ఇరవైమూడు కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథ మనసును తట్టిలేపుతుంది. తద్వారా ఆలోచనకు పునాది పడుతుంది. […]