April 26, 2024

ఐఐటి(లెక్కల) రామయ్యగారు

రచన: శారదాప్రసాద్ ఖద్దరు పంచె, చొక్కా, భుజాన ఒకఖద్దరు సంచి వేసుకొని అతి సాధారణంగా కనిపించే ఈయనను చూసిన వారెవరూ ఆయనను అఖండ మేధావిగా గుర్తించలేరు. చికాకు లేని చిరునవ్వు ఆయన సొంతం. ఈ అసమాన్య మేధావే లెక్కల(చుక్కా) రామయ్య గారు. శ్రీ చుక్కా రామయ్య గారు 20 -11 -1928 న, వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు-నరసమ్మ , అనంతరామయ్య గార్లు. వీరి ప్రధాన వృత్తి పౌరోహిత్యం. […]