April 26, 2024

దూరపు బంధువులు

రచన: మణికుమారి గోవిందరాజుల చలనం లేకుండా కూర్చొని వున్నాడు కేశవరావు. యెదురుగుండా భార్య వసుధ యెటువంటి బాధా లేకుండా ప్రశాంతంగా పడుకుని వుంది. వచ్చిన బంధువులందరూ అతనికి వోదార్పు మాటలు చెబుతున్నారు. “యెంత అదృష్ణవంతురాలు! మాట్లాడుతూ మాట్లాడుతూనే అలా పక్కకి వొరిగిపోయిందట. సుమంగళిగా దాటిపోయింది. చాలా కొద్దిమందికి మాత్రమే ఇలాంటి చావు దొరుకుతుంది.” “ సాయంత్రం కలిసింది. చీకటి పడ్డదాకా మాట్లాడుకున్నాము. భోజనాలయ్యాక కూడా కాసేపు వాకిట్లో మెట్లమీద కూర్చుంది వసుధక్క. ఇక తొమ్మిది దాటుతోంది పడుకుంటాను […]