May 19, 2024

హాస్యం ప్రయోజనం హాసం

రచన : డి.వి.హనుమంత్ రావు (ప్రాచీనం, ఆధునికం అయిన కొన్ని హాస్యరచనలలో విషయాలగురించి నాకు తెలిసినంతమేరకు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం ఈ చిన్నవ్యాసం.. సమగ్రం ఎంతమాత్రం కాదు ……………….. డి.వి.హనుమంతరావు.) “చంద్రశేఖరం ! – ఒరేయ్ – చంద్రం !” “ఏమిటోయ్ .. ఏమిటి ఇలా వచ్చావు ? “నీకేమైనా బాకీరా నేను ?” “ఎబ్బే ! ఏమీ బాకీ లేదే ? ఎందుకు అల్లా అడిగావు ? పాత బాకీలన్నీ తీర్చేస్తున్నావా ఏమిట్రా ?” […]

పౌంటేన్ హెడ్ – నా అభిప్రాయం

రచన : వెంకట్ హేమాద్రిబొట్ల   ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే కొన్ని పుస్తకాలు కూడా. అటువంటి వాటిలో ఐన్ రాండ్ రాసిన “ఫౌంటైన్ హెడ్” ఒకటి. మొదటి సారి ప్రచురించి ఆరు దశాబ్దాలు కంటే ఎక్కువే అయినా ఈ రోజుకి ఈ పుస్తకం యొక్క ఆదరణ తగ్గక పోవడం ఇందుకు తార్కాణం. ఏ ఒక్క తరానికో, ప్రదేశానికో లేక అప్పటి పరిస్థితులకో పరిమితం కాకుండా, చదివిన అందరిని ప్రభావితం చేస్తుంది ఈ పుస్తకం. అందుచేతనే […]

అన్నమయ్య – ఒక పరిచయం(2వ భాగము)

రచన : మల్లిన నరసింహారావు 4వ సంపుటం. ఇది కూడా అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తనల సమాహారమే. దీనిలో ఉన్న సంకీర్తనల సంఖ్య 531+77= 608. ఈ 77 నిడురేకులలోని సంకీర్తనలని వేరుగా ఇచ్చారు. సౌరాష్ట్రం వీధుల వీధుల విభుఁడేగీ నిదె మోదముతోడుత మొక్కరొ జనులు IIపల్లవిII గరుడధ్వజ మదె కనకరథం బదె అరదముపై హరి యలవాఁడె యిరుదెసల నున్నారు యిందిరయు భువియు పరఁగఁ బగ్గములు పట్టరో జనులు IIవీధులII ఆడే రదివో యచ్చరలెల్లను పాడేరు గంధర్వ పతులెల్లా […]

ఐపిసి సెక్షన్ 174

రచన :  పసుపులేటి గీత ఎండుటాకు నివురు కింద నన్ను నేనే దాచుకున్న నిప్పు పురుగును.. భయపడకు తగలబడ్డమే తప్ప తగలబెట్టడం తెలీనిదాన్ని! అనాదిగా శూన్యాకాశపు రంధ్రంలో మెరిడియన్ గూటి నల్లుతున్న సాలీణ్ణి నేను ఎన్నడూ గీత దాటలేదు. గీతకవతలా, ఇవతలా చెరపడ్డ సీతనే భయపడకు! రొంటిలో దాచుకున్న గవదబిళ్ళ్లల్ని మింగేశాను నేనిక మట్లాడను. రెప్పల్ని నిమిరి, ప్రాణాల్ని తివిరి నా గుండెల్లోకి నేనే దిగబడ్డను భయపడకు! దిగుడుబావి లాంటి లోకం నోరు మూసేందుకు నీ నాలిక […]

నిన్నలేని అందం

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి సౌమ్యకి కాళ్ళకింద నేల చీలినట్టయ్యింది. తటాలున యే గ్రహశకలమో భూమిని ఢీకొంటే ఆ ఘాతానికి భూమి తలక్రిందులై, ధృవాలు తారుమారై, రాత్రి పగలై, పగలు రాత్రై అల్లకల్లోలం అవుతుందంటారు. అది అసంభవం కాదు. అగ్రరాజ్యాలు ఘర్షణ పడితే జరిగే అణుయుద్ధంలో ఆకాశమంతా పొగచూరితే వచ్చే శాశ్వత శీతాకాలంలో జీవలోకమంతా ఘనీభవించి పోతుందంటారు. అదీ సంభవమే. తిండితిప్పలు లేకుండా బ్రతుకు వెళ్ళబుచ్చిన బైరాగులున్నారు. తృటిలో మేధావులైన మూర్ఖులున్నారు. చచ్చి బ్రతికిన వాళ్ళున్నారు. ఇవన్నీ […]