May 19, 2024

ఒక ప్రయాణం – ఒక పరిచయం

రచన: మధురవాణి  డిసెంబరు 31, దుబాయ్ ఎయిర్ పోర్ట్ సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. దాదాపు ఇంకో గంటలో అక్కడ నుంచి హైదరాబాదుకి బయలుదేరే ఫ్లైటు ఉంది. ఆ ఫ్లైటులో ఎక్కాల్సిన ప్రయాణీకులందరూ షాపింగులూ గట్రా ముగించుకుని మెల్లగా ఒక్కొక్కరే వచ్చి బోర్డింగ్ గేటు దగ్గర చేరుతున్నారు. మరి కొందరు ఆ పాటికే అక్కడున్న వాలు కుర్చీల్లో చేరి చిన్న కునుకు తీస్తున్నారు. అక్కడే కూర్చున్న ఓ అబ్బాయి ఈ లోకంతో తనకే సంబంధం లేనట్టుగా చెవికి ఇయర్ […]

సంపాదకీయం: సంక్రాంతి పండుగ

మాలిక సంక్రాంతి సంచిక కోసం ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు ఇచ్చిన  కార్టూన్.. ఈ సంచిక సంపాదకురాలు: సుజాత బెడదకోట సహాయకులు: కల్లూరి శైలబాల, జ్యోతి వలబోజు    మాలిక పత్రిక ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా సంపాదక బృందానికి , రచయితలకు, చదువరులకు అందరికి  శుభాకాంక్షలు ..   పండగంటే తెల్లారుజామునే మెలకువొచ్చేసే ఉత్సాహం,హడావుడి,ఉల్లాసం,ప్రత్యేక వంటలతో భోజనం,భుక్తాయాసం,మధ్యాహ్నం కాస్త కునుకు….సాయంత్రం కొత్త బట్టలు..ఇలా ఉంటే బాగానే ఉంటుంది.   కానీ జీవితం ఇంట్లో ఒక అడుగూ, వీధిలో […]

బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం

బ్లాగులు బ్లాగర్లకు సంబంధించిన ఆధారాలతో నిర్మితమైన ప్రత్యేక గడి   కూర్పు: భరద్వాజ్ వెలమకన్ని చిత్తరువు: కోడిహళ్ళి మురళీమోహన్..   మీ సమాధానాలను editor@maalika.org కి పంపండి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన ఒక విజేతకు బహుమతి పంపబడుతుంది.         ఆధారాలు:   అడ్డం : 1. హేమిటో ఈ అమాయక చక్రవర్తిగారిని “కిక్” సినిమాలో హీరోయిన్ ఎవరని అడిగితే రంగమ్మ అని అన్నార్ట!   5. శైలబాలగారికిష్టమైన […]

తెలుగు పండితుడి మసాలా పాట!

రచన: భరద్వాజ్ వెలమకన్ని   ఒక తెలుగు పండితుడు విధిలేక ఓ రవితేజ సినిమాకు వ్రాసే మసాలా పాట ఇలా ఉంటుందేమో?   పల్లవి:    నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల నీ చెంపలపై రాసేస్తా చంపకమాల మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ నీ  ముక్కు  నుండి పుట్టిస్తా ముత్యాలసరమే … !    నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల నీ చెంపలపై రాసేస్తా చంపకమాల మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా […]

ఇదేమైనా బాగుందా??

జనక మహరాజుగారు యజ్ఞం చేయాలనుకుని అందుకోసం ఏటి ఒడ్డున పూజ చేసి భూమిని దున్నుతుంటే ఆయనకు సీతాదేవి పసిబిడ్డగా దొరికింది. అంటే యజ్ఞం చేయకముందే ఫలం లభించినట్టే కదా.. దానికంటే కొన్నేళ్ల ముందు దశరధ మహారాజు పిల్లలు లేరని ఎవరో అయ్యను బతిమాలుకుని పుత్రకామేష్టీ అనే యాగం పూర్తి చేస్తే గాని ప్రసాదం దొరకలేదు. అది దొరికిన తర్వాత కూడా పెద్ద తంటా వచ్చి పడింది. మరి ఆయనకు  ఉన్నది ఒక్కరు కాదు ముగ్గురు భార్యలాయే. వాళ్లకు […]

తెలుగు సినిమాలో హాస్యం

రచన : వెంకట్ హేమాద్రిబొట్ల   ఎంతో సునిశితమైనది, కేవలం మానవులకే సాధ్యపడేది, ఆ పని చేయడం వల్ల ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ముఖంలో అన్నీ కండరాలకి వ్యాయామం ఇచ్చేది, మనసుని ఆహ్లాద పరిచేది, ఎటువంటి ఖర్చు లేనిది – ఏమిటది?  అదేనండి నవ్వు. మనకి ఇంతటి మంచి చేసే ఆ నవ్వు తెప్పించేది?  హాస్యం.  మంచి హాస్యం ఉన్న పుస్తకాలు చదువుతుంటేనో, నవ్వుతు నవ్విస్తూ ఉండేవారితో మాట్లాడితేనో ఎంతో హాయిగా అనిపిస్తుంది కదూ.   […]

సహస్ర స్క్వైర్ అవధానం …..

రచన : శశి తన్నీరు   ట్రింగ్…ట్రింగ్…మంటూ మోగే అలారం నెత్తిన ఒక్కటిచ్చాను. దెబ్బకి నెత్తిన బుడిపను తడుముకుంటూ నోరు మూసుకుంది. సరే ముందు కొంచం సేపు ధ్యానం చేద్దాం అని శ్వాస గమనిస్తూ ఉన్నాను……”ఇడ్లీ కి చట్ని వేయకపోతే కరెంటు పోతుందేమో”……ఐదున్నరేగా ….ఆరుకి కదా కరెంటు పోయేది. “పప్పులోకి టొమాటోలు ఉన్నాయా?”….ఒకటుందిలే…..శ్వాస మీద  ధ్యాస….పెట్టు…. “పాప తొందరగా లేపమంది…. లేచేటప్పటికి పాలు ఇస్తే తాగుతుంది”…ఇక లాభం లేదు..పద వంటిట్లోకి…… ముందు బ్రష్  చేసుకొని మొహం కడుక్కున్నాను. […]

డూప్లెక్స్ భోగం

రచన: సుజాత బెడదకోట ఇల్లంతా తిరిగి చూసి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చి తృప్తి గా నిట్టూర్చింది రాధ! “ఎస్, మై డ్రీమ్ హోమ్” అనుకుంది వందో సారి! బయట రాధ మొగుడు గోపాలం లాన్ వేయిస్తున్నాడు కాబోలు గట్టిగా మాటలు వినపడుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ ఇల్లు…రాధ చాన్నాళ్ల నాటి కల! ఇన్నాళ్ళకు నెరవేరింది. లోను పూర్తిగా రాకపోయినా ఎక్కడో ఊర్లో ఉన్న స్థలం అమ్మి మరీ డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టి కమ్యూనిటీ […]

రేడియో చమత్కారాలు

  రచన: డా. ఏల్చూరి మురళీధర రావు ,’ న్యూ ఢిల్లీ     హాసము ఆరోగ్యానికి లక్షణం. “దుఃఖంతో నిండి ఉన్న ప్రపంచంలో నవ్వు అనేదే లేకపోతే విసుగూ అసహ్యమూ పుట్టి మానవజీవితం దుర్భరమైపోతుంది” అని మహాకవి వేదుల సత్యనారాయణశాస్త్రిగారు ఒకచోటన్నారు. అందువల్ల, నిత్యానుభవంలో సైతం ప్రతివాడూ ఏదో విధంగా నవ్వడానికే ప్రయత్నించడం సహజం. చమత్కారం స్ఫురించేటప్పుడు కూడా నవ్వలేనివాడు హృదయం లేనివాడో రోగగ్రస్తుడో అయివుంటాడని పెద్దలంటారు. నవ్వు హృదయనైర్మల్యానికి స్నిగ్ధసంకేతం. మనస్సుకు వికాసాన్ని కలిగించే జీవశక్తి […]

మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి

కూర్పు : కోడిహళ్లి మురళీమోహన్   కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా:  editor@maalika.org  .. సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి […]