June 25, 2024

సహస్ర స్క్వైర్ అవధానం …..

రచన : శశి తన్నీరు   ట్రింగ్…ట్రింగ్…మంటూ మోగే అలారం నెత్తిన ఒక్కటిచ్చాను. దెబ్బకి నెత్తిన బుడిపను తడుముకుంటూ నోరు మూసుకుంది. సరే ముందు కొంచం సేపు ధ్యానం చేద్దాం అని శ్వాస గమనిస్తూ ఉన్నాను……”ఇడ్లీ కి చట్ని వేయకపోతే కరెంటు పోతుందేమో”……ఐదున్నరేగా ….ఆరుకి కదా కరెంటు పోయేది. “పప్పులోకి టొమాటోలు ఉన్నాయా?”….ఒకటుందిలే…..శ్వాస మీద  ధ్యాస….పెట్టు…. “పాప తొందరగా లేపమంది…. లేచేటప్పటికి పాలు ఇస్తే తాగుతుంది”…ఇక లాభం లేదు..పద వంటిట్లోకి…… ముందు బ్రష్  చేసుకొని మొహం కడుక్కున్నాను. […]

డూప్లెక్స్ భోగం

రచన: సుజాత బెడదకోట ఇల్లంతా తిరిగి చూసి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చి తృప్తి గా నిట్టూర్చింది రాధ! “ఎస్, మై డ్రీమ్ హోమ్” అనుకుంది వందో సారి! బయట రాధ మొగుడు గోపాలం లాన్ వేయిస్తున్నాడు కాబోలు గట్టిగా మాటలు వినపడుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ ఇల్లు…రాధ చాన్నాళ్ల నాటి కల! ఇన్నాళ్ళకు నెరవేరింది. లోను పూర్తిగా రాకపోయినా ఎక్కడో ఊర్లో ఉన్న స్థలం అమ్మి మరీ డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టి కమ్యూనిటీ […]

రేడియో చమత్కారాలు

  రచన: డా. ఏల్చూరి మురళీధర రావు ,’ న్యూ ఢిల్లీ     హాసము ఆరోగ్యానికి లక్షణం. “దుఃఖంతో నిండి ఉన్న ప్రపంచంలో నవ్వు అనేదే లేకపోతే విసుగూ అసహ్యమూ పుట్టి మానవజీవితం దుర్భరమైపోతుంది” అని మహాకవి వేదుల సత్యనారాయణశాస్త్రిగారు ఒకచోటన్నారు. అందువల్ల, నిత్యానుభవంలో సైతం ప్రతివాడూ ఏదో విధంగా నవ్వడానికే ప్రయత్నించడం సహజం. చమత్కారం స్ఫురించేటప్పుడు కూడా నవ్వలేనివాడు హృదయం లేనివాడో రోగగ్రస్తుడో అయివుంటాడని పెద్దలంటారు. నవ్వు హృదయనైర్మల్యానికి స్నిగ్ధసంకేతం. మనస్సుకు వికాసాన్ని కలిగించే జీవశక్తి […]

మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి

కూర్పు : కోడిహళ్లి మురళీమోహన్   కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా:  editor@maalika.org  .. సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి […]

అల్లరి కార్టూన్ల శ్రీవల్లి !

  చాలా ఏళ్ళ క్రితం తెలుగు వార, మాస పత్రికల్లో ‘శ్రీవల్లి’ పేరుతో కార్టూన్లు వస్తుండేవి.  కార్టూన్ల హవా బాగా వెలిగిపోయిన, కార్టూనిస్టులు తామరతంపరగా పుట్టుకొచ్చిన రోజులవి.  అయితే ఇంతమందిలో కూడా శ్రీవల్లి కార్టూన్లు చాలామంది పాఠకులకు గుర్తుండిపోయాయి!   కార్టూన్ గీత లావుగానూ,  హాస్యస్ఫోరకంగానూ ఉండటం, విభిన్నమైన కోణాన్నుంచి అల్లరిగా దూసుకొచ్చే హాస్యధోరణి , సంతకం కూడా ప్రత్యేకంగా ఉండటం-  ఇవన్నీ దీనికి కారణాలు కావొచ్చు. బొమ్మకి ప్రాధాన్యం ఇస్తూ కాప్షన్ తక్కువుండేలా ప్రయత్నించటం,  సామాజిక […]