April 26, 2024

అనగనగా బ్నిం కధలు – 6 (లిఫ్ట్)

రచన: బ్నిం

లిఫ్ట్ (కథ గురించి)bnim

తరచి తరచి చూస్తే… ఆలోచిస్తే…

“ఇలవృత్తులెన్ని వున్నను

కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా.”

అనే పద్యపాదం నిజమనిపిస్తుంది.

“స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మోభయావః ” అన్న భగవద్గీతా వాక్యం కూడా అదే చెప్తోంది. రాని పనులకోసం ఆరాట పడుతూ వచ్చిన స్కిల్స్‌నీ, అలవాటైన అనువంశీక వృత్తుల్నీ వదిలేసే.. ఆత్రంగాళ్లని చూస్తే నాకు జాలి.. చిరాకు.. ఆసహ్యం కూడా! అది చెప్పాలనే ఈ కథ…

 

అతను చక్కాగా “దర్జీపని” నేర్చుకున్న షార్ప్ అయిన కుర్రాడు. ఆ పని వదిలి.. ఏదో పిచ్చి క్రేజ్‌తో కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చి అగచాట్లు పడుతుంటే.. ఆ అవస్థని తప్పించి వాస్తవాన్ని చూపెడతాడు ఓ పెద్దాయన..

“నువ్వెందుకు పుట్టావు? నువ్వు దీన్లో కృషి చెయ్! స్థిరపడు!” అని నీతులు చెప్తే.. కుర్రాళ్లకి బుర్రకెక్కకపోవడం వాళ్ల దురదృష్టమే అనిపిస్తుంది.

అలా కాక ఈ కథలో నీతులు చెప్పకుండా అదృశ్యంగా అదృష్టమార్గాన్ని మళ్లిస్తాడు ఆ పెద్దాయన!

నాకీ కథ చాలా బాగా నడిపానని అనిపిస్తోంది. ఆకలేసేవాడికి చేపలు పెట్టి ఆ పూట గడిపించడం కన్నా చేపలు పట్టడం నేర్పించి జీవితాంతం నడిపించు  అన్న మాటని ఇంగ్లీషు వచ్చినవాళ్లు చాలాసార్లు అంటారు. మనవాళ్లకి అర్ధమయేలా చెప్పాలని నేను అనుకుంటూ.. చాలా సార్లే ప్రయత్నిస్తున్నాను.

 

బ్నిం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *