April 28, 2024

అనగనగా బ్నిం కథలు – 12 (ఆబ్దీకం)

రచన: బ్నిం bnim

చదివినది: మోహనరావు

అనగనగా.. కథల్లో పరకాయ ప్రవేశాలు చాలా చేశాను. వారానికో కథ రాయాలి. ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తారు. అప్పట్లో ఎవరైనా దిల్‌కుష్‌గానో, దిగాలుగానో కనిపిస్తే వాళ్లని ఆవాహనం చేసుకుని వాళ్ల బతుకు మనం కొంతసేపు బతికేస్తున్నట్లు  ఫీలైపోయేవాణ్ని.  వాళ్ల కథ కాయితమ్మీదకి వెళ్లాక ఆ పాత్రని ఉద్వాసన చెప్పటానికి కొంత ఇబ్బందే అయేది.

అందులో దిగాలుగా ఉన్న కథానాయకులే (నాయికలే) అందులో ఎక్కువగా కదిలేవాళ్లు. ఇంకోసారి కన్నవి కాకపోయినా,  విన్నవి రాయటం జరిగినప్పుడు ఇలాంటి కథలూ నడిచేవి. అయితే.. దీన్లో ఎంత భాగాన్ని విన్నాం. ఎంత పాయింట్ చుట్టూతా అల్లుకున్నాం అనే దానిపై అంతర్ కథనం.. మధనం నడిచేవి.

ఆబ్దికం కథ.. ఆర్పీ రోడ్‌లో ఆనంద్‌భవన్ (ఇప్పుళ్లేదేమో) దగ్గర బంటాకూలీల్లా కూర్చునే పేద (పని దొరకని) బ్రాహ్మల్ని చూసినప్పుడు .. వాళ్లలో ఒకతనికి ఒకాయన పిల్చి టిఫెన్ పెట్టించమనడం చూసినప్పుడు తట్టిన కథ. అక్కడ తిన్నవాడు , తినిపించినవాడు పేకాట దోస్తులని మనం నిజాన్ని మర్చిపోతే. ఆ తినిపించడానికి ఓ అర్ధం అల్లుకుంటే ఈ కథ నడిచింది.

అటు తర్వాత చాలామందికి ఈ కథ స్ఫూర్తినిచ్చిందిట. తిథులు కాకపోయినా ఇంగ్లీష్ కేలండర్ ప్రకారమైనా ఇలా అబ్దీకాలు పెట్టచ్చని భావించి, ఆచరించిన సంప్రదాయ ప్రేమికులు నాకు కనిపించారు. గతించిన పెద్దల్ని ఇలా తల్చుకొవడంతో మనం క్షణంసేపు ఆత్మానందం పొందుతాం మరొకరి కడుపు నింపే కదా.. సరే కథ వినండి!! (చాదస్తం అనుకోకుండా). చదివిందెవరనీ.. మోహన్‌రావుగారని డబ్బింగ్ ఆర్టిస్ట్.. చాలా టాలెంటెడ్..

మీ బ్నిం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *