May 7, 2024

జడమాలిక

pic: BapuBapu-Paintings-Photo-Gallery-40

 

 

 

 

 

Shyam pullela

కంట్రీలు వేరు యైనచొ
వెంట్రుకలను ముడుచునట్టి విధములు మారున్
‘ఎంట్రీ’లవెన్ని యున్నను
‘జంట్రీ’ మెచ్చెడి విధమ్ము, జడయే శ్యామా!

 

Srinivas Bharadwaj Kishore

సుస్తీజేసిందంటూ
కుస్తీబడుతుండు లేయకూసోరాకే
వస్తేనువుజడనూపుత
ముస్తాబయ్యిండుసూడు ముసలాడైనా

ఇస్తే జడ చేతికి నువు
ఉస్తాదుకు మల్లె గొప్ప పోజిచ్చిండే
వస్తేగద చూస్తందుకు
మస్తుగ నుందేంది దంట పండ్లికిలించే

మామూలుగ జడ కదుపగ
వామోయని గట్టిగరిచి వడిగురికిండే
ఏమౌతది మరి బయపడి
పామనుకుని వురికితె పడి పండ్లూడుగదే

 

Subrahmanya Chakravarti Oruganti

వెనకటికొక కోపిష్టికి
కనబడెనొక కేశము తన కంచమునందున్
తనసతి జడ కొరకొరగని
చినతిరుపతి తీసుకెళ్ళి సిగ గొరిగించెన్

జడలో సుమములె శరములు,
జడయే మన్మథుని విల్లు, సరసుడె లక్ష్యం,
పడకే రణరంగము, కలఁ
బడితే యిరువురికి జయము, ఫలితము పాపల్

 

Nagajyothi Ramana

మెదడు న అంతశ్శూచీ
పదునుగ పనిచేయునంచు -పడతి కనుగొనెన్
అదునుగ జడ లేకున్నను
మెదడు కలదు ముదితలకని -మెండుగ తెలిపెన్.

ఆ ! జడ దేమున్నదిలే
తాజాగా పురుషులిపుడు -తరచుగ జడలన్
మోజుగ వేసుకు తిరుగగ
ఫోజులు మీకేల బాల-బోరది మాకే

 

Maddali Srinivas

ముస్తాబెందుకు పోరీ
గస్తీ దారులకు మస్తుగా పని జెప్పన్
కుస్తీ పట్టుట జడతో
బస్తీలో పోరగాళ్ళ బలి కొరకేనా?

షహరంతా నీ కొరకే
పహరా కాసేను పోరి పవలున్ రేయిన్
తెహెజీబే నదియోంకీ
సెహెబాషే జడలు నీవి సెహబాష్ గోరీ

 

Arka Somayaji

పలువురి “లైకు”ల కోసము,
అలుపెరుగక జడ పురాణమందుచు’ రోజూ,
విలువైన సమయమంతయు,
ఖిలమొనరించుటయు నీకు!కిక్కే?మనసా!

వినుమొక్క మాట!జడ “యౌ
వనముననే! మిడిసిపాటు పడు!”వార్ధక్య
మ్మునజూడు!దాని సోకును
మన జీవితమంతె కాదె!మానవె!మనసా!

మును “తిరుపతి కవు” లిట్లే,
మనసా!నిను మార్పుజేయ, మంచిని బోధిం
చిన, పద్యమ్ములు జదివియు,
వినవు గదా!నీదు జడలు వేయు గుణంబున్.

మనసా!యొద్దిక! నీకీ
యనవసరపు జడల గొడవ!లాపుము!యికపై,
ఘనముగ కృష్ణా!రామా!
యనుమీ! నవరాత్రులందు నఘములు దొలగున్.

మనకున్నయట్టియాలో
చనలీ జడ చిక్కుదీయ జాలుటకేనా?
యనగా వినవు గదా!నువు!
మొనగాడవు! నాదు పుట్టి ముంచకు! మనసా!

 

J K Mohan Rao

అమ్మా వేస్తావా నా-
కమ్మా వేయమ్మ జడను – అందరు చెప్పా-
లమ్మా బావుందని చూ-
డమ్మా ఆగడము చేయ – నమ్మా రావే

వస్తాడే మా బావా
తెస్తాడే పువ్వు నాకు – దీపం కిందా
ఇస్తాడే జడకోసం
వేస్తాడే జడను నాకు – ప్రేమిస్తాడే

శీగాన పెసూనాంబా
యా గిటకజడ లొక రెండు – హాహా కదలిం-
దా గొక్క నిమిష మిక్కడ
బాగుందో లేదొ చెప్త – బాబా బ్లాక్ షీప్ –

 

Gopala Krishnarao Panthula

బారెడొ, మూరెడొ,జానెడొ
తీరగు జడ పెంచు కొనగ తిప్పలు పడుచున్
నారీమణి పడు బాధల

నేరీ ఎరిగిన పురుషులు? ఎక్కడ లేరే ?

 

Goli Hanumath Sastry

ఈజీలే ముడివేయగ

ఈజీవికి జడల ? చిన్న హెయిరే బెటరౌ

క్రేజీగా దువ్వుట స్టైల్

లేజీ గర్లని తలవకులే యిటు జెప్పన్.

 

జానా బెత్తెడు జడ బస్

జానేదో లాంగు లాంగు జడ చల్తా నై

నేనే మాన్ తా బిగ్ జడ ( మానేస్తా )

మైనే మాన్ తా హు చోటి మస్తీ జడకో

 

జర్రంత తేలు జాల్తతి

వర్రీలింతై నవద్దు పైసల్ కొన్నే

సర్రున దువ్వుట ఈజీ

బర్రున చిన జడతొ మేలు బాజార్ జానా

 

అమ్మా జల యేత్తావా

తమ్ములు నా జుత్తులాగి తంతున్నాలే

అమ్మలు పువ్వాయిచ్చే

అమ్మకు దాన్నిచ్చి జలను అల్లమనంతూ.

 

అత్తా పూలిత్తావా

ఇత్తా జల్లోన పెత్తి  ఇంతికి పోతా

ఆత్తిచ్చిందని నేనే

ల్పిత్తాలే అక్కనిపుడు వెవ్వెవ్వెవ్వే !

 

వాటీజ్ దిస్ జడ సీ ఐ

హేటిట్ డోంట్ టై ద హెయిరు  హే ! హే ! ట్రై పో

నీటైలండ్ బాబ్డు హెయిరు

నీటై వ్యూయర్సు మెచ్చు నిన్నే మైగర్ల్

 

ఏజడ క్యారే హంకో

రోజానా తేలు దాల్కె రుద్దింగ్ బోరే

మై జాన్ తా నై అల్లింగ్

వీజీ రే బాలు ఛోడ్కె విరబోస్కుంటే.

 

( ఈజీ నే సరదాగా వీజీ అన్నా.. )

 

అయ్యో మమ్మీ కూంబ్ చెయ్

అయ్యాల్సో లైకు దిస్సు హాండ్సం జడనే

అయ్యా మిండ్యన్ గర్లూ

షయ్యేం ఫీల్గాను నాకు జడ థ్రిల్లంటా .

పిరాట్ల. వెంకట శివరామ కృష్ణప్రసాద్

కం.         అడిగిన తడవుగ వడివడి

నుడివిరి పద్యము లనెన్నో నొక్కు మ్మడిగా

జడపై జరిగిన జగడము

జడిపిం చెనుపురు షలోక జాడను జననీ .

కం.        జడపై అల్లిన జడలను

ముడువుడు కవులా రామీరు మూకుమ్మడిగన్

జడపై జగడము ముగిసెను

విడువుడు నడువుడు పరుగిడు విజ్ఞుడ వైతే.

కం.        అమ్మడి జడలను పొగడుచు

అమ్మో యిదిత్రా చుపాము యనహ డలినే

నమ్మా యితల్లి నోయన

అమ్మో భయపడి పొరబడె ఔరా! యనగా

కం.        నల్లని  త్రాచై చెంపలు

చెళ్ళని పించెడు జడలను చిన్నది గదిలో

వొళ్ళుమ రచిశయ నించగ

వేళ్ళకు కత్తెర నుబూని వేటును వేసెన్ .

కం.       ఘడిఘడి జడపై గడిబిడి

పడగలు విడినా ట్యమాడె పడతుల పొగడన్

గుడుగుడు యనగుం డెగుబులు

ముడిలిడె కవులిట రగడలు మూకుమ్మడిగా

 

7 thoughts on “జడమాలిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *