రచన: జి.ఎస్.లక్ష్మి..
ఈ ఫాదర్స్ డే సందర్భంగా మాకు స్ఫూర్తిగా నిలచిన మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారికి ప్రణమిల్లుతూ..
నాన్నా..
ఉదయించే సూర్యుణ్ణి చూస్తే
మీరు మాలో నింపిన ఉత్తేజం గుర్తొస్తుంది
మధ్యాహ్న మార్తాండుణ్ణి చూస్తే
మా బాధ్యతలు నెరవేర్చడంలో మీ సలహాలు గుర్తొస్తాయి
సాయంసంధ్యని గమనిస్తే
మీరు ఆహ్లాదంగా మాతో పంచుకున్న ఆటపాటలు గుర్తొస్తాయి
పున్నమినాటిరాత్రిని చూస్తే
మాకింతటి చక్కని జీవితాన్నందించిన మీ వ్యక్తిత్వం గుర్తొస్తుంది
ఒకటి కాదు రెండు కాదు యెన్నని చెప్పగలము
మీ పరిపూర్ణ వ్యక్తిత్వంలోని సుగుణాలని..
ప్రతిరోజూ ప్రతిక్షణమూ మా తలపుల్లో నిండిన
ఓ మహా మనీషీ..మీ దివ్యాశీస్సులే మాకు శ్రీరామరక్ష.
నెలవంక వలే చిన్నగా అందంగా ఉందండి మీ కవిత
superb
simple and superb andi mee kavitha
short and sweet. very nice
చాలా బాగు౦ది శుభా క్లుప్త౦గా చాలా చెప్పారు
Excellent ! Pinni
excellent, Chinnakka!