May 8, 2024

శక్తి రా నాన్న….

రచన: జె. భానుచందర్

వెన్నలాంటి మనసున్న నాన్న
మిన్న కదా అమృతం కన్నా

నిన్ను అర్ధం చేసుకుని
నీ బ్రతుక్కి అర్ధానిచ్చేదే నాన్న

నీ ఆశలు ఆంక్షలు తీరుస్తూ
నీ చిరునవ్వులను దోసెళ్ళు పట్టేదే నాన్న

నిన్ను తెలుసుకుంటూ మసలుతూ
నీ వెన్నంటి వుంటూ నిన్నొక వ్యక్తిని చేసే శక్తి రా నాన్న

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేరా కన్నా
నువ్వు రోజూ చూసే ప్రత్యక్ష దైవమే రా నాన్న.

4 thoughts on “శక్తి రా నాన్న….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *