May 4, 2024

అంతా నాన్నపోలికే!

రచన–ఆదూరి.హైమావతి .

“ఇది అచ్చం వాళ్ళ నాన్నపోలికే!”
“ఔను అన్నీ వాళ్ళ నాన్నపోలికలే!”
“ఆ పట్టుదల, ఆ మొండితనం, ఆ ధైర్యం అన్నీ వాళ్ళనాన్నవే పుణికి పుచ్చుకుంది”
“దీనికి తెగింపూ ఎక్కువే” “అచ్చం మగవాడికున్నంత తెగువ!” “ఈమె ముందు మగవారూ తీసికట్టేనండీ! వాళ్ళనాన్న దేనికీ వెనుకాడేవాడు కాడు.” “యుధ్ధం నుంచీ వచ్చాక ఆ యోగాసెంటర్ పెట్టి ఎంత బాగా శ్రమించి, పేరుకు పేరూ, సేవకు సేవా, సంపాదనా అదీనీ ధర్మబధ్ధంగా ఎలా గడించాడో! తన శక్తిమీదా, తెలివిమీదా అతడికంత నమ్మకం” “నిజం చెప్పారు, దీనికీనీ అంతే నమ్మకం, తనశక్తి మీద అంత విశ్వాసం ” “అందుకేనర్రా! ఎవ్వరూ సాధించలేనిదాన్ని సాధించింది.” “అంతేనా! రాత్రింబవళ్ళూ శ్రమించింది, నిద్రాహారాలు మాని రోజుకు 18నుంచీ 20 గంటలు చదివిందండీ!” “దీని నాన్నమాత్రం తక్కువా మరొకరైతే యుధ్ధం నుంచీ అలావస్తే దిగులుతో క్రుంగిపోదురు” “అతగాడిది చెరగని చిరునవ్వు.” “పాపం వాళ్ళావిడే ముగ్గురుపిల్లల్నిఎలా సాకాలాని ఆలోచించి ఆలోచించి గుండెపోటుతో పోయింది కానీ అతడు ఎంత ధైర్యంగా ఇద్దరికీ చదువులు చెప్పించి పెళ్ళిళ్ళుచేశాడు. ఇహ దీన్నైతే కోరినట్లు చదివించాడు. ” “చదివిస్తానన్నా మరొకరైతే అలా ఉంటే క్రుంగిపోదురు, దిగులుతో వాళ్లవాళ్ళనూ ఏడిపిద్దురు.” “ఇదంతా వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడిందండీ!”
ఇలా సంభాషణ సాగుతుండగా, “తప్పుకోండి , తప్పుకోండి కలెక్టర్ గారు వస్తున్నారు “అనే హెచ్చరిక వినగానే అక్కడ మౌనం రాజ్యమేలసాగింది. ఇంతలో సెక్యూరిటీ ముందూ వెనకా వస్తుండగా ఒకేకాలితో ఉన్న వ్యక్తి భుజానికి చెక్క సపోర్ట్ తో, తాను ఒక వీల్ ఛైర్ లో ఒక మహిళను నెట్టుకుంటూవచ్చాడు. ఆ వీల్ ఛైర్ నేరుగా స్టేజ్ మీదకు చేరింది. అంతా ఆశ్చర్యంగా చూస్తుండగా మహిళా డి.జి.పి పూలమాలతో వీల్ ఛైర్ లో మహిళను పూలమాలతో సన్మానించి, “మనజిల్లా కలెక్టర్ గారికి మనందరి తరఫునా ఆహ్వానం పలుకుతున్నాను. గివ్ బిగ్ హ్యండ్స్ ” అనగానే కరతాళ ధ్వనులతో హాలు నిండిపోయింది. *
*************

2 thoughts on “అంతా నాన్నపోలికే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *