April 30, 2024

మాలిక పత్రిక జులై 2015 సంచికకు స్వాగతం…

Jyothivalaboju Chief Editor and Content Head విభిన్నమైన అంశాలతో , ఆ పాత మధురాలు, ఈనాటి విశేషాలతో జులై మాలిక పత్రిక మీకోసం సిద్ధంగా ఉంది..  సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, సీరియల్స్, సినిమా, కథలతో పాటుగా కొద్దిరోజుల క్రితం జరుపుకున్న ఫాదర్స్ డే కి సంబంధించిన మరికొన్ని ముచ్చట్లు కూడా ఈ సంచికలో చదవొచ్చు.. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org జులై సంచిక విశేషాలు: 01. ధీర – 4 02. అనగా అనగా […]

ధీర – 4

స్త్రీ ఐనా, పురుషుడైనా కుటుంబంనుండి ప్రోత్సాహం లభిస్తే వారు బయటకు వెళ్లి ఏ పనైనా సులువుగా చేసుకుని విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. కొన్నేళ్ల క్రితం ఆడపిల్లకు చదువు, సంగీతం కంటే మంచి అయ్యచేతిలో పెట్టి అత్తారింటికి పంపడం ముఖ్యమనుకునేవారు. అత్తగారింట్లో వంట, ఇల్లు, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు… ఇలా అందరి అవసరాలకు అందుబాటులో ఉండి వారిని సంతృప్తి పరచడం ఇల్లాలిగా ఆడదానికి చాలా ముఖ్యమనేవారు. అలాటప్పుడు ఆ ఇల్లాలి ఇతర కోరికలు, ముచ్చట్లు తీరే అవకాశమెక్కడిది. […]

‘తరం-తరం నిరంతరం’

రచన: వాలి హిరణ్మయీదేవి తలుపు దబదబా బాదుతున్న చప్పుడుకు ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉన్న లలిత ఉలిక్కిపడి లేచింది. తలుపు తెరచి నిశ్చేష్టురాలై నిలిచిపోయిన భార్యను చూసి, “ఏమిటి లలితా?” అంటూ వచ్చిన మధుమూర్తి పూలదండలలో ఉన్న కొడుకుని, అతని పక్కన నవవధువుని చూసి నోట మాట రాకుండా అయిపోయాడు. ఆగ్రహంతో కళ్ళు ఎర్రబడిన లలిత “ఛీ వెధవా! ఏం మొహం పెట్టుకుని వచ్చావురా? పెద్దలం మేమింకా బ్రతికి ఉండగానే ఒక్క మాటైనా చెప్పకుండా తగుదునమ్మా అంటూ […]

‘వెన్నెల్లో గోదారి అందం’

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి ‘వెన్నెల్లో గోదారి అందం’ రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి దక్షిణ భారతం లోనే అతి పెద్ద నది గోదావరి… ఎక్కడో మహారాష్ట్రం లోని నాసిక్ దగ్గర త్రయంబకం అనే ప్రదేశంలో పుట్టి, అక్కడ, తెలంగాణా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి, చివరికి గౌతమిగా, వశిష్టగా బంగాళాఖాతంలో సంగమించే పవిత్ర నది గోదావరి. ఎందఱో రైతులకు పూజ్యురాలై దేవతగా పూజలందుకునే ఈ నదీమాతకు పుష్కరాల సందడి జులై నెల పధ్నాలుగో తారీఖు […]

చిగురాకు రెపరెపలు: 6

రచన: మన్నెం శారద ఇప్పుడు కాస్త మా నాన్న గారి గురించి చెప్పాలి. ఆయన పేరు సీతారామయ్య. నిజంగా రాముడే అనేవారంతా. గుంటూరు హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసారట! మంచి ఇంగ్లీషు మాట్లాడేవారు. బ్రిటిష్ లెక్చరర్స్ దగ్గర చదివేరట. చాలా నిరాడంబరం జీవి. ఆయన పరుషంగా మాట్లాడటం మేం వినలేదు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చేరు. మా తాతగారు చిన్నప్పుడే చనిపోతే మా నాన్మమ్మే చదివించింది. నాకు నాన్న దగ్గర చనువెక్కువ. అసలు భయం లేదు. నాకయిదారు […]

శోధన 4

రచన: మాలతి దేచిరాజు అతను స్టేషన్ బయటకు వస్తూనే ఓ ఆటో దగ్గరికి వెళ్లి “వస్తావా?” అని అడిగాడు ఎక్కడికో చెప్పకుండానే . ఆ ఆటో అతను కూడా ఎక్కడికి అని కూడా అడగకుండానే “రాను” అన్నాడు. అతను మరో ఆటో దగ్గరికి వెళ్లి “వస్తావా?” అని అడిగాడు. అతను కప్పుకున్న దుప్పట్లో నుండే కుడి చేతిని పైకి లేపి “రాను” అన్నట్టు అడ్డంగా ఊపి చెప్పాడు. అతనికి కోపం నషాళానికి అంటింది. భుజానికి వున్న లగేజీ […]

అంతిమం 4

రచన: రామా చంద్రమౌళి ఏమీ అర్థం కాలేదు. అందరూ అమ్మా నాన్న ఇద్దరూ చచ్చిపోయారన్నారు. ఎందుకు. . అనడిగింది. ఒక్కొక్కరిని. . అందరినీ. ఎక్కెక్కిపడి ఏడుస్తూ, జవాబెవ్వరిస్తారు. తర్వాత మిగిలింది ఒట్టి నిశ్శబ్దం. చుట్టూ అడవి. అప్పుడొచ్చాడు భగత్ సన్యాల్ సార్ ఒక రాత్రి. వచ్చి నిద్రపోతున్న తనను తట్టి లేపి ఇక ‘నువ్వు నా వెంట రావమ్మా. నిన్ను నడిపించుకుని తీసుకుపోతా వెలుగులోకి ‘అని అన్నాడు. ఏమీ అర్థం కాలేదు తనకు. కాని అతని వెనుక […]

ఆరాధ్య 10

రచన: అంగులూరి అంజనీదేవి ఆరాధ్య నేరుగా ఇంటికెళ్లలేదు. సరయు దగ్గరకి వెళ్లింది. సరయు ఒడిలో తలపెట్టుకొని ఏడ్చింది. ఏడ్చేవాళ్లను ఎలా ఓదార్చాలో సరయుకి బాగా తెలుసు. ఎలా మాట్లాడితే ఆరాధ్య కోలుకుంటుందో, ఎనర్జిటిక్‌గా ఫీలవుతుందో అలా మాట్లాడింది. మాట్లాడుతూనే వంట చేసింది సరయు. ఆరాధ్య సరిగా తినకపోతే బ్రతిమాలి తినిపించింది. తను కూడా తిన్నది. తిన్న ప్లేట్ల ముందు నుండి లేవకుండానే హేమంత్‌కి, తనకి మధ్యన జరిగిన సంభాషణ చెప్పింది ఆరాధ్య. వినగానే బిత్తరపోయింది సరయు. ”సరయూ! […]

చేరేదెటకో తెలిసీ..

రచన: స్వాతీ శ్రీపాద శృతి గదిలోకి వచ్చాడు శ్రీకాంత్ శర్మ. కళ్ళు తెరచి గోడను చూస్తూ ఉంది శృతి . అతను రాగానే లేచి నిల్చుంది నర్స్. “నేను ఇక్కడ కాస్సేపు౦టాను, ఓ రెండు మూడు గంటలు. ఏదైనా పని చూసుకునేది ఉంటే వెళ్లిరా “ అన్నాడు. “థాంక్స్ “ చెప్పి వెళ్ళింది నర్స్. “శృతి “ నెమ్మదిగా ఉచ్చారి౦చాయి అతని పెదవులు. ఉహు! విన్నట్టే అనిపించలేదు. కొంచం స్వరం పెంచి పిలిచి చూసాడు. లాభం లేకపోయింది. […]